For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (12-08-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, శ్రావణమాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope August 12, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Krishna Janmashtami 2020 : శ్రీకృష్ణుడు జన్మించిన రోజునే కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారంటే...Krishna Janmashtami 2020 : శ్రీకృష్ణుడు జన్మించిన రోజునే కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారంటే...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అయితే అవి మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేస్తాయి. అయితే మీరు తొందరపడకూడదు. ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీ కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి. మీ భాగస్వామితో ఈరోజు కొన్ని విషయాల్లో విభేదాలు ఏర్పడొచ్చు. మరోవైపు ఈరోజు ఉద్యోగులు శుభవార్తలను వింటారు. ఈ రోజు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాన్ని పొందవచ్చు.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి ఉదయం 11 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. అయితే మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యమైన పనులకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఈరోజు ఖర్చులను తగ్గించుకుంటే మీకే మంచిది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఈ రోజు మీ కుటుంబం మరియు జీవిత భాగస్వామితో మంచి రోజు గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది.

లక్కీ కలర్ : లైట్ బ్లూ

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు నక్షత్రాలు అనుకూలంగా ఉన్నందున మీకు మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు మీరు ప్రారంభించే పనిలో మీకు విజయం లభిస్తుంది. ఈరోజు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఉద్యోగులు ఈరోజు కష్టపడి పని చేస్తారు. మీరు ఈరోజు ఆఫీసులో ఎంత త్వరగా పని ముగించుకుని, ఇంటికి వెళితే అంత మంచిది. ఇది మీకు, మీ కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి ఉదయం 7 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంగా ఉండేందుకు ధ్యానం, యోగా చేయాలి. ఆర్థిక పరమైన విషయానికొస్తే, ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించాలి. ఈరోజు మీ పనిలో ఒత్తిడి, అలసట ఉంటుంది. ఈరోజు మీరు స్నేహితులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ కారణంగా చాలా మంది మిమ్మల్ని ఇష్టపడతారు. అయితే మీరు మీ పరిమితులను కూడా తెలుసుకోవాలి. ప్రతికూల ఫలితాలు ఎక్కువ కాలం ఉండవని గుర్తుంచుకోండి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు అద్భుతమైన శ్రమ, సమయానికి కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలు వస్తాయి. కానీ మీరు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడాల్సి ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే, అనుభవం ఉన్న వారి సలహాలను తీసుకోవాలి. లేదంటే మీరు నష్టపోతారు. వివాహితులకు ఈరోజు రొమాంటిక్ పరంగా మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఈరోజు ఓ ఏంజెల్ మాదిరిగా మీ అవసరాలను మరింత ఎక్కువా పట్టించుకుంటారు. మరోవైపు ఉద్యోగులకు ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మీరు ఊహించని లాభాలను పొందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మీ కోరికలు చాలా పెద్దవి మరియు వాటిని నెరవేర్చడానికి మీరు తీవ్రంగా కృషి చేస్తారు. మీరు విజయానికి దగ్గరగా ఉన్నారు, కానీ అహంకారాన్ని నివారించాలి. మీ విజయం పట్ల అసూయపడేవారి పట్ల మీరు జాగ్రత్త వహించాలి. ఈరోజు పనిలో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వివాహితులు ఈరోజు జీవిత భాగస్వామితో కలిసి గడపడం అనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 10 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈ రోజు నిజాయితీగా ఉండాలి. వ్యక్తిగతంగా ఈరోజు మీకు తోబుట్టువుల నుండి సహాయసహకారాలు లభిస్తాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ ఇంటికి ఈరోజు అకస్మాత్తుగా బంధువులు రావొచ్చు. వ్యాపారులు ఈరోజు మంచి ఉత్సాహంగా ఉంటాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని, అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : అర్థరాత్రి 2 నుండి ఉదయం 11 గంటల వరకు

ఆగస్టు 2020 : ఈ నెలలో గణేష్ చతుర్థి, జన్మాష్టమితో పాటు ప్రధాన పండుగలివే...ఆగస్టు 2020 : ఈ నెలలో గణేష్ చతుర్థి, జన్మాష్టమితో పాటు ప్రధాన పండుగలివే...

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇతరులకు ఏదైనా విషయంలో వాగ్దానం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఆర్థిక పరంగా ఈరోజు మీరు ప్రయోజనాలు పొందలేరు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో, స్నేహితులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 గంట వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు పెద్ద లాభాలు ఉండకపోవచ్చు. అయితే మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు అదనపు ఆదాయం సంపాదించగలుగుతారు. మీరు ఈ రోజు సరైన స్థలంలో పెట్టుబడి పెట్టాలి. స్థిరాస్థుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెచ్చే అవకాశమున్నందున, అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు పని భారం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి నిజంగా మంచి మూడ్ లో ఉంటారు. మీకు ఒక్క చక్కని సర్ ప్రైజ్ ఇస్తారు. మరోవైపు ఉద్యోగులు ఈరోజు సహోద్యోగులతో కలిసి పనులను వేగంగా పూర్తి చేయాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : సాయంత్రం 4:40 నుండి సాయంత్రం 6:10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితులలో మీరు ఎంతో ఓపికగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో అతిగా స్పందించకండి. మరోవైపు మీ వైవాహిక జీవితంలో ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటే, చివరి నిమిషంలో అది రద్దు కావచ్చు.

లక్కీ కలర్ : బ్లాక్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా మెరుగుదలను సాధించేందుకు ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. ఈ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మీరు చేసే పనిలో అనుకూలంగా ఉంటుంది. అయితే ఈరోజు మీరు ప్రతికూల వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. మీ జీవితాన్ని ఎలా సులభతరం చేయాలో మీకు బాగా తెలుసు. పేద మహిళలకు సేవలు మరియు సహాయం చేయడం వల్ల మీకు శుభప్రదమైన పలితాలు కలుగుతాయి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగతంగా కొన్ని తప్పులను చేసే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మీరు మీ కుటుంబసభ్యులతో, స్నేహితులతో కలిసి గడపండి. అప్పుడు మీకు కొంత ప్రయోజనం ఉండొచ్చు. మీరు ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు ఏదైనా కొత్తదానిని నేర్చుకోవాలని భావిస్తారు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు తేలికపాటి వ్యాయామం చేయండి.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope August 12, 2020

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published:Tuesday, August 11, 2020, 21:13 [IST]
Desktop Bottom Promotion