గురువారం మీ రాశిఫలాలు (20-08-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, శ్రావణమాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope August 20, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు కొన్ని గందరగోళాలను అధిగమించే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు కెరీర్ లో కొత్త దిశలో వెళ్లే అవకాశాన్ని పొందొచ్చు. వ్యాపారులు ఈరోజు కొంత ఆందోళన చెందవచ్చు. ఈ సమయంలో మీరు మీ ప్రణాళికలపై శ్రద్ధ వహించాలి. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు రావచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో మీరు తెలివిగా వ్యవహరించాలి. ఆరోగ్యం పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 8:25 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉంటారు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో పెండింగ్ పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తారు. మీరు బ్యాంకింగ్ రంగంతో సంబంధం కలిగి ఉంటే, మీరు ఏదైనా పెద్ద విజయాన్ని పొందవచ్చు. వ్యాపారులు ఊహించిన దాని కంటే తక్కువ ప్రయోజనాలు పొందుతారు. అయితే మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. పరిస్థితులు త్వరలో మెరుగవుతాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి కొంత సమస్యగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 6:05 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. అయితే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, ఖర్చులు కూడా పెరగవచ్చు. భవిష్యత్ ప్రణాళికలలో మీకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చు. ఈ సమయంలో మీరు పొదుపుపై ​​ఎక్కువ దృష్టి పెట్టాలి. ఉద్యోగులు ఈరోజు అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలి. వ్యాపారులు ఈరోజు ఆర్థికంగా నష్టపోవచ్చు. మీరు మరింత ఒత్తిడికి గురవుతుంటే, మీరు మీ కుటుంబం మరియు స్నేహితులతో కొంత సమయం గడపాలి. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు పనిపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఈ రోజు మీ ముఖ్యమైన పనుల జాబితాను సిద్ధం చేసి, మొదట వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించడం మంచిది. వ్యాపారులు ఈరోజు ఆర్థికంగా ఎక్కువగా లాభాలను పొందొచ్చు. అయితే, ఇటువంటి సందర్భాల్లో మీరు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిరోజు అవుతుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి రాత్రి 8:05 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా సందర్భాల్లో మంచిగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మంచి లాభం వస్తుంది. బంగారం, వెండి వ్యాపారం చేసే వ్యాపారులు విపరీతమైన ప్రయోజనాలను పొందవచ్చు. మరోవైపు, ఉద్యోగులకు వారి ఉన్నతాధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీకు సహోద్యోగులతో కూడా మంచి సంబంధం ఉంటుంది. ఈరోజు మీరు పనితో పాటు, మీరు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. మీ స్వల్ప నిర్లక్ష్యం కొంత తీవ్రమైన వ్యాధికి దారి తీస్తుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసులో సీనియర్ ఆఫీసర్ల నుండి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులు ఈరోజు చట్టబబద్ధమైన బెట్టింగుకు దూరంగా ఉండాలి. మీరు నిబంధనలను ఉల్లఘించకూడదు. ఈరోజు ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గానే ఉంటుంది. మీరు ఈరోజు అత్యవసర షాపింగ్ కూడా చేయవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు మంచి అనుభూతి కలుగుతుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు అధిక ఒత్తిడి కారణంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో ఉన్నతాధికారుల వద్ద సక్రమంగా ప్రవర్తించాలి. వారు మీ అభిప్రాయాలను అంగీకరించకపోతే, మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరు వారితో వాదిస్తే, మీకే నష్టం జరుగుతుంది. వ్యాపారులు ఈరోజు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటట్లయితే, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ ఇంటి వాతావరణం చక్కగా ఉంటుంది. ఈరోజు సమయానికి డబ్బు అందకపోవడం వల్ల, కొన్ని పనులు పెండింగులో పడిపోతాయి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 11 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఊహించిన విధంగా ఫలితాలు రాకపోవడంతో మీరు నిరాశ చెందుతారు. అటువంటి పరిస్థితిలో, నిరాశ చెందకుండా, మీరు మరింత కష్టపడాలి. ఉద్యోగులు ఈరోజు సహోద్యోగులతో గొడవ పడకుండా ఉండాలి. లేకపోతే మీ సమస్య పెరుగుతుంది. వ్యాపారులు కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తుంటే మీరు కొంత సమయం వేచి ఉండాలి. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 4:10 నుండి మధ్యాహ్నం 3:50 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా బిజీగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో కొన్ని అదనపు బాధ్యతలు పెరగొచ్చు. మీరు మీ యజమానికి ఫిర్యాదు చేయడానికి అవకాశం ఇవ్వకపోవడమే మంచిది. వ్యాపారులు ఈరోజు ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే, మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఓపికపట్టండి మరియు త్వరలో మీ సమస్య తీరిపోతుంది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి భావోద్వేగ మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:55 నుండి రాత్రి 7 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈ రోజు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. మీరు పిల్లలతో చాలా ఆనందించండి. ఉద్యోగులకు ఈ రోజు కార్యాలయంలో కొంత కష్టమైన పనిని కేటాయించవచ్చు. ఇలాంటి పరిస్థితులలో పనులను ఎలా పూర్తి చేయవచ్చో ఆలోచించాలి. మీరు మీ ఆలోచనను సానుకూలంగా ఉంచుకుంటే మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు. మీరు ఇటీవల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, ఈ సమయంలో మీరు దాని ప్రమోషన్ పై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈరోజు బాగుంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఈ రోజు వ్యాపారులకు పవిత్రమైన రోజు అవుతుంది. మీరు ఏదైనా ముఖ్యమైన వ్యాపార నిర్ణయం తీసుకుంటే, రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. కార్యాలయంలో ఏదైనా పని పూర్తి చేయడంలో మీకు ఇబ్బంది అనిపిస్తే, మీరు సీనియర్ అధికారులు మరియు సహోద్యోగుల సహాయం తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు, మీరు మీ తినే మరియు త్రాగే అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మీరు ఎక్కువగా ఆకుపచ్చ కూరగాయలు మరియు పండ్లను తినడం మంచిది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో మీ సమయాన్ని వృథా చేయకండి. ఇలా చేయడం ద్వారా మీరు మీ పనిని పూర్తి చేయలేరు. మీ సహోద్యోగులు తప్పులు చేయకుండా ఉండాలి. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి ప్రయోజనం పొందవచ్చు. పిల్లలతో మరింత కఠినంగా వ్యవహరించడం మానుకోండి. మీరు వారితో ప్రేమతో వ్యవహరించాలి. కొన్ని కారణాల వల్ల మీ జీవిత భాగస్వామి మీకు అసంతృప్తిగా ఉంటే, ఈ రోజు మీరు వారిని ఒప్పించడానికి ప్రయత్నించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Thursday, August 20, 2020, 5:00 [IST]
Desktop Bottom Promotion