For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం మీ రాశిఫలాలు (31-12-2019)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మార్గశిర మాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగతంగా లేదా పనికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేరు. వీటి పరిష్కారాల కోసం చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. అయితే వ్యక్తిగత జీవిత సమస్యలను పరిష్కరించడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఇంటి వాతావరణాన్ని మెరుగుపరచడానికి మీరు ఈ రోజు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు కార్యాలయంలోని మీ సహోద్యోగుల నుండి పెద్దగా ఆశించకపోతే మంచిది. శృంగార జీవితం గురించి మాట్లాడుతుంటే, మీ భాగస్వామితో మీకు సమస్యలు ఉంటే, అపార్థాలు మరింత పెరగక ముందు మీరు వారితో మాట్లాడుకోవాలి. మీరు సన్నిహితంగా మెలగాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ :4

లక్కీ టైమ్ : ఉదయం 4:45 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి. ఈ రోజు మీరు వారి నుండి ప్రయోజనం పొందవచ్చు.. వైవాహిక జీవితంలో, మీ జీవిత భాగస్వామితో మాట్లాడటం ద్వారా మీ సంబంధాన్ని మెరుగుపర్చడానికి మీ భావాలను అర్థం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఆర్థిక పరంగా అంతా అనుకూలంగా ఉంటుంది. మీరు అదనపు ఆదాయ వనరులను పొందవచ్చు.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ :6

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 11:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ నిర్ణయాల నుండి సానుకూల ఫలితాలను పొందుతారని ఆశిస్తారు. ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయంలో పెరుగుదల కనబడుతోంది. మీరు ఏదైనా ఆస్తికి సంబంధించిన వాటిలో పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. వైవాహిక జీవితానికి ఈరోజు చాలా కష్టమవుతుంది. మీ జీవిత భాగస్వామి స్వభావంలో కరుకుదనం ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ :48

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:10 నుండి రాత్రి 7 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ఆఫీసులో పనితీరు చాలా బాగుంటుంది. ఈ రోజు మీ సీనియర్లతో మీరు కొన్ని ముఖ్యమైన చర్చలు జరపవచ్చు. వివాహిత జంటలకు ఈ రోజు చాలా శృంగారభరితంగా ఉంటుంది. మీ భాగస్వామి మీకు ఆశ్చర్యం కలిగించే మానసిక స్థితిలో ఉండవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. పెట్టుబడికి ఈరోజు సమయం మంచిది కాదు. అయితే కొంత ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంటి వాతావరణంలో కొంచెం ఒత్తిడి ఉంటుంది. మీ ప్రవర్తనను ప్రశాంతంగా మరియు సానుకూలంగా ఉంచండి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ :31

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు అధిక పని కారణంగా ఒత్తిడికి గురవుతారు. మీ సోమరితనం వల్ల మీ సీనియర్లు కూడా అసంతృప్తి చెందుతారు. ఏదైనా గొడవ లేదా చర్చకు దూరంగా ఉండండి. ఈ రోజు, మీ ప్రణాళిక ప్రకారం ఎటువంటి పని జరగదు. దీనివల్ల మీరు చాలా నిరాశ చెందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. అయినప్పటికీ అదనపు డబ్బు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంచెం పెరుగుతాయి. కుటుంబ జీవితానికి ఈరోజు ముఖ్యమైనది. ఇంటి వాతావరణం మారుతుంది. మీ ప్రియమైన వారి మద్దతు మీకు లభిస్తుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :17

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు కుటుంబంలో గొడవలు ఉంటాయి. ఇంటి పెద్దలతో సైద్ధాంతిక విభేదాలు సహజమే. ఈ రోజు ఇంట్లో పెద్ద వివాదం ఉండవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామిపై అనవసరంగా కోపం పెంచుకోవడం ద్వారా మీరు వారి భావాలను గాయపరచవచ్చు. మీరు ఈ అలవాటును మార్చుకోకపోతే, అది మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. శృంగార జీవితంలో ప్రతిదీ సాధారణంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఈ రోజు సమావేశం మరింత శృంగారభరితంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ :20

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:30 గంటల వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా రొమాంటిక్ గా ఉంటుంది. మీ భాగస్వామి నుండి మీరు ఎల్లప్పుడూ ఊహించని ప్రేమను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధం బాగుంటుంది. మీకు భావోద్వేగ మద్దతు లభిస్తుంది. మీరు కార్యాలయంలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇది మీ సీనియర్లకు చాలా ఆనందంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : రాత్రి 7:45 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలను పొందవచ్చు. అకస్మాత్తుగా వచ్చిన కొత్త బాధ్యతలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పొదుపుగా చేయాలి. లేదంటే మీరు భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు. కుటుంబానికి సమయం ఇవ్వలేరు. మీ మానసిక శాంతిని కాపాడుకోవడానికి, సాధ్యమైనంతవరకు సానుకూలంగా ఆలోచించండి. వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. ఆరోగ్య పరంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే, మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :45

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 11:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు వింటారు. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. శృంగార జీవితం గురించి మాట్లాడితే, మీరు ఈ రోజు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కార్యాలయంలో ముఖ్యమైన పనిని సహోద్యోగుల సహాయంతో పూర్తి చేయవచ్చు. ఆరోగ్య విషయాలు ఈరోజు పరిపూర్ణంగా ఉంటాయి. శారీరకంగానే కాదు మానసికంగా కూడా మీరు చాలా బలంగా ఉంటారు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :3

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. పాతబకాయిలను ఈరోజు తిరిగి పొందుతారు. శృంగార జీవితంలో ప్రత్యేకమైన వారిని కలవడం సాధ్యపడుతుంది. కొత్త సంబంధం గురించి మీరు కొంచెం గందరగోళం చెందవచ్చు. వివాహిత జంటలకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మరోవైపు మీరు ఈరోజు అకస్మాత్తుగా పని కోసం ప్రయాణించే అవకాశం ఉంది. మీరు ఈ రోజు ఇంటి నుండి దూరంగా నివసిస్తుంటే, మీ ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోండి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :16

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు చాలా సరదాగా ఉంటుంది. ఎక్కువ సమయం మీరు స్నేహితులతో గడుపుతారు. పార్టీలు చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు గొప్పగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు రోజంతా మంచి అనుభూతి చెందుతారు. మీ జీవిత భాగస్వామి నుండి బహుమతి పొందవచ్చు. కార్యాలయంలో మీ పనితీరు బాగుంటుంది, ఈ రోజు సహోద్యోగుల మద్దతు కూడా లభిస్తుంది. మీరు వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే, మీరు ఇటీవల ప్రారంభించిన వ్యాపారంలో లాభాలు పొందవచ్చు.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు పూర్తి వినోదాత్మకంగా గడుపుతారు. మీరు ప్రేమించిన భాగస్వామితో సరదాగా గడుపుతారు. పని విషయంలో ఈరోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. సరైన ఆలోచన తర్వాత మాత్రమే ఈ నిర్ణయం తీసుకోండి. మీ ప్రస్తుత ఉద్యోగంలో మీకు సంతృప్తి లేకపోతే, మీరు మరొక కంపెనీకి దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు వ్యాపారం చేస్తుంటే, మీరు వెంటనే కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యం క్షీణించవచ్చు. జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :25

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి సాయంత్రం 5:40 గంటల వరకు

English summary

Daily Horoscope December 31, 2019

Read today's horoscope to know how the last day of 2019 will be for all the 12 zodiac signs.
Story first published:Monday, December 30, 2019, 19:25 [IST]
Desktop Bottom Promotion