For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం మీ రాశిఫలాలు (5-12-2019)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మార్గశిర మాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలలో తొందరపడకూడదు. మీరు చేసే ఉద్యోగంలో వేతన పెంపుదలను కోరుకుంటే మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. అందుకే ఈరోజు అలాంటి డిమాండ్ చేయకపోవడమే మంచిది. ఈరోజు మీరు కొంతమంది కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు. వివాహ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండటం ద్వారా పరిస్థితి కంట్రోల్ తప్పకుండా చేయవచ్చు. శృంగార జంటలకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యంగా ఉంటారు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఉద్యోగం చేసేవారు, ఆఫీసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. గత కొన్ని రోజుల నుండి, మీరు నిరంతరం కష్టపడుతున్నా, మీ కృషికి తగ్గ ఫలితాలను పొందడం లేదని భావిస్తారు. ఇది మీకు బాధ కలిగించవచ్చు. కానీ మీరు ఓపికగా ఉండాలి. లేకపోతే మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోవచ్చు. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీకు పెద్దగా లాభం రాదు. మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. వారితో ఎక్కువ సమయం గడపడం మంచిది. ఆర్థిక విషయాలలో ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే మీరు మీ స్నేహితుల కోసం చాలా ఖర్చు చేయవచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ఎలాంటి వివాదాల్లో తలదూర్చకూడదు. అందరితో గౌరవంగా మాట్లాడండి. మీ విలువైన సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. మీ పురోగతికి ఉపయోగపడే వాటిని ప్రయత్నించండి. మీ ప్రేమికుడు లేదా జీవిత భాగస్వామితో ఉన్న సంబంధంలో, ఇద్దరి మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉన్నందున మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఎందుకంటే మీరు మరొకరి నుండి రుణం తీసుకోవలసి ఉంటుంది. మీ వైఫల్యాల నుండి పాఠం నేర్చుకొని ముందుకు సాగండి. మీ ఖర్చులపై నియంత్రణ ఉంచండి, అప్పుడే మీరు పొదుపుపై ​​దృష్టి పెట్టగలుగుతారు. ఈ రోజు వ్యాపారులు టువంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోకుండా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి రాత్రి 10:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కళారంగంలో ఉండేవారు ఈ రోజు ఉత్తమ నటనకు అవార్డు పొందవచ్చు లేదా పదోన్నతి పొందవచ్చు. మీరు మీ రోజును ముందుగానే ప్లాన్ చేస్తే, మీకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. ఇది తొందరపాటు మరియు భయాందోళనలను నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. మీ పెండింగ్ పనులను పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మీరు మీ బడ్జెట్ ప్రకారం నడుస్తారు. మీరు ఈ రోజంతా రిఫ్రెష్ అవుతారు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 42

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 10 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు శృంగార జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. మీ భాగస్వాములు మీ పట్ల ఎంత అంకితభావంతో ఉన్నారో మీకే తెలుస్తుంది. మీతో సమావేశం కూడా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీతో బాగా ప్రవర్తిస్తారు. మీరిద్దరూ ఈ రోజును పూర్తి స్థాయిలో ఆనందిస్తారు. మీరు స్టాక్ మార్కెట్ లేదా బెట్టింగ్ వంటి వాటి ద్వారా మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నించవచ్చు. మీరు ఏమి చేసినా, తొందరపడకండి లేదంటే మీరే నష్టపోతారు. ఈ రోజు మీరు ఆఫీసులో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడంలో చాలా బిజీగా ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:05 నుండి రాత్రి 10:30 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. కానీ మీరు ధైర్యం మరియు తెలివితేటలతో పనిచేస్తే, మీరు వాటిని సులభంగా అధిగమించవచ్చు. ఈ రోజు వ్యాపారులకు కాస్త కష్టమవుతుంది. సమయం అనుకూలంగా లేనందున ఈ రోజు ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోకూడదు. ఈరోజు కార్యాలయంలో, మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక రంగంలో ఈరోజు మంచిగా ఉంటుంది. శృంగార జీవితంలో, సమస్యలను అధిగమించడానికి మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకోవాలి. మీ మొండి పట్టుదల గల స్వభావాన్ని వదిలి ప్రేమతో వ్యవహరించండి. మీకు ఈ రోజు బలహీనంగా అనిపించవచ్చు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : సాయంత్రం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు గొప్ప రోజు అవుతుంది. మీరు మీ రహస్య ప్రతిభను వెల్లడిస్తారు. ఇది మీ సీనియర్ మరియు సహచరులను ఆశ్చర్యపరుస్తుంది. మీరు అదేవిధంగా పని చేస్తూ ఉంటే, త్వరలో మీరు పెద్ద పురోగతిని పొందవచ్చు. వ్యాపారులు కూడా లాభం పొందటానికి మంచి అవకాశం పొందవచ్చు. ఈ రోజు, మీరు మీ పిల్లలపై చాలా ఖర్చు చేయవచ్చు. ఈరోజు వారితో కలిసి ఆనందించండి. మీరు మీ ఆలోచనను సానుకూలంగా ఉంచుకుంటే, ప్రతి ప్రయత్నంలోనూ మీరు విజయం సాధిస్తారు. మీరు మీ వ్యక్తిగత జీవితంలో మరియు వృత్తి జీవితంలో రెండింటినీ సులభంగా నిర్వహించగలుగుతారు. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 7:35 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో వాదన కారణంగా నిరాశకు గురవుతారు. మీరు ఎంత పోరాడినా, మీరిద్దరూ ఎక్కువ కాలం ఒకరికొకరు దూరంగా ఉండలేరు. సాయంత్రం, మీ ప్రియమైన వారికి మంచి బహుమతిని తీసుకుని ఇంటికి వెళ్ళండి. ప్రతిదీ ప్రేమతో గెలవవచ్చు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉన్నతాధికారుల సహాయంతో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని భావిస్తున్నారు. వ్యాపారులు కూడా ఈ రోజు చిన్న ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీరు వారి ఆశీర్వాదం పొందుతారు. విద్యార్థులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. వారు వారి కృషికి సరైన ఫలితాలను పొందవచ్చు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు సంబంధాల పరంగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సున్నితమైన సమస్యలపై మాట్లాడేటప్పుడు పదాలను ఆలోచనాత్మకంగా వాడండి. ఆర్థిక పరంగా ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. మీరు సంపాదించడానికి కొత్త మార్గాన్ని పొందవచ్చు. అయితే దాని కోసం కష్టపడాలి. ఈ రోజు, మీరు చిన్న రుణం కూడా చెల్లించవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. సోదరులతో కొనసాగుతున్న వాదనలు ముగుస్తాయి. మరోసారి మీరు అదే ప్రేమ మరియు బంధాన్ని చూస్తారు. శృంగార జీవితంలో తరచూ ఒడిదుడుకుల కారణంగా, ప్రేమ పట్ల మీ ఆసక్తి తగ్గుతుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ప్రశాంతమైన రోజు గడపాలనుకుంటే, మీ పనులను మాత్రమే చూసుకోండి. అశాస్త్రీయ పుకార్లకు దూరంగా ఉండండి. కార్యాలయంలో ఈ రోజు చాలా బిజీగా ఉంటుంది. పెండింగ్ పనులు ఉన్నప్పటికీ మీకు కొత్త పనిని అప్పగించవచ్చు. ఇది మీ ఒత్తిడిని పెంచుతుంది. అయితే సానుకూల వైఖరితో ఉండండి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాన్ని పరిశీలిస్తే, ఈరోజు మీకు అకస్మాత్తుగా పెద్ద వ్యయం తలెత్తవచ్చు. ఇది మీ బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తుంది. ఈ రోజు విద్యార్థులు కొన్ని శుభవార్తలు వింటారు. మీరు ఉన్నత విద్యను చదవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే, మీరు విజయం సాధించే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు చాలా తెలివిగా పని చేయాలి. అప్పుడే మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, మీ ముఖ్యమైన పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించాలనుకుంటే, మీ పెద్దల సలహాతో మాత్రమే మీ దశలను ముందుకు తీసుకెళ్లండి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక విషయానికొస్తే మీ ఆదాయాన్ని పెంచడానికి మీరు కొత్త మరియు విభిన్న మార్గాల గురించి ఆలోచించాలి. ఏదైనా పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయడానికి ఈరోజు మంచిది కాదు. మీ జీవిత భాగస్వామితో వివాదాలు మీ మధ్య ఉద్రిక్తతను పెంచుతాయి. మీరు ప్రశాంతంగా పని చేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ తల్లిదండ్రుల ఆప్యాయత మరియు మద్దతుతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రోజు, మీరు స్నేహితుడు లేదా బంధువు నుండి ఆర్థిక సహాయం పొందవచ్చు. జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. మీ ప్రియురాలిని ఆశ్చర్యపరిచే రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు శృంగార జీవితంలో కూడా మంచి ఫలితాలను పొందుతారు. మీ భాగస్వామితో మరపురాని సమయాన్ని గడపగలుగుతారు. మిమ్మల్ని ఓడించడానికి వారు తీవ్రంగా ప్రయత్నించవచ్చు. కాబట్టి వ్యాపారవేత్తలు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

English summary

Daily Horoscope December 5, 2019

How will your financial situation be today? Will you get rid of money related problems? Read your daily horoscope to know.
Story first published:Wednesday, December 4, 2019, 18:54 [IST]
Desktop Bottom Promotion