Latest Updates
-
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం!
ఆదివారం మీ రాశిఫలాలు (02-02-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది.
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు ఒక పెద్ద సమస్య నుండి బయటపడొచ్చు. దీని వల్ల మీరు మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మంచి అనుభూతిని పొందుతారు. మీ కుటుంబంతో మీ సంబంధం బాగుంటుంది. మీరు అందరి మద్దతు మరియు ఆప్యాయత పొందుతారు. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడటంతో మీరు మంచి అనుభూతి చెందుతారు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 24
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈ రోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ తల్లిదండ్రులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. శృంగార జీవితంలో అడ్డంకులు లేకుండా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కోసం కొంత సమయాన్ని కేటాయించండి. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:05 నండి సాయంత్రం 5 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈ రోజు మంచి మానసిక స్థితిలో ఉంటారు. మీ మనస్సు ఉల్లాసంగా ఉంటుంది మీకు ఈ రోజు చాలా అదృష్టం కలసి వస్తుంది. మీరు ఒంటరిగా ఉంటే, ఈరోజు మీరు ప్రేమలో పడే అవకాశం ఉంది. మీ భాగస్వామి కోసం చాలా కాలం పాటు చేస్తున్న అన్వేషణ ఈరోజుతో ముగుస్తుంది. వివాహిత జంటలకు ఈరోజు గొప్పగా ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది.
ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు చేసే ప్రయాణం వల్ల కొంత అలసిపోతారు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు. కోర్టు కేసు వంటి ఆందోళనలు కూడా ఉండొచ్చు. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా నష్టాలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే పని విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలోనూ కొంత ఇబ్బంది ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారు ఈరోజు చాలా ధైర్యంగా ఉంటారు. మీ శక్తి, సామర్థ్యాలను చూపించే అవకాశం ఈరోజు లభిస్తుంది. ఇది మీకు గొప్ప ఉపశమనం ఇస్తుంది. కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు ఈ రోజు మీ కుటుంబంతో చాలా మంచిగా గడుపుతారు. మీరు ఈ రోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే, మీ తల్లిదండ్రుల సలహా తీసుకోండి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కన్య ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని గుర్తుండిపోయే క్షణాలను గడిపేందుకు అవకాశం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ అవగాహన పెరుగుతుంది. మీ సంబంధం మంచిగా మంచిది. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 30
లక్కీ టైమ్ : ఉదయం 10:50 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతో సంతోషంగా కలిసి పని చేసుకుంటారు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి పని విషయంలో ఈరోజు కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు మీ కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవాలి. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. ఎందుకంటే మీ వైఖరి మిమ్మల్ని మీ ప్రియమైనవారి నుండి దూరం చేస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా బాగా ఉంటుంది. అయితే జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారు ఉన్నతాధికారులతో సక్రమంగా వ్యవహరించాలి. సానుకూల ఆలోచనలు చేయండి. కచ్చితంగా మీకు విజయం లభిస్తుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు చాలా శృంగారభరితంగా ఉండే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారు మీ పాత విషయాలను మరచిపోయి మీ ప్రేమను, సాంగత్యాన్ని కోరుకునే బలమైన అవకాశం ఉంది. పిల్లల వైపు నుండి ఆనందం రావచ్చు. వారు మిమ్మల్ని గౌరవిస్తారు. ఈరోజు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్య ఉండదు.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : ఉదయం 8:15 నుండి సాయంత్రం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. మీ ఇంట్లో కూడా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో మీ మానసిక శాంతికి భంగం కలగకుండా మీ భావోద్వేగాలను నియంత్రించాలి. ఈ రోజు వైవాహిక జీవితానికి మంచి రోజు అవుతుంది. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన మరింత మెరుగ్గా ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:20 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు కెరీర్ విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలలో మీకు ఈరోజు విజయం లభిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తుంటే, మీకు ప్రమోషన్‌తో పాటు జీతం కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన ప్రయోజనాలన్నీ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:40 నుండి సాయంత్రం 4 గంటల వరకు



Click it and Unblock the Notifications











