గురువారం మీ రాశిఫలాలు (06-02-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు మాటలపై ఎక్కువ ఎక్కువ శ్రద్ధ చూపాలి. పని విషయాలలో అనవసరంగా సమయం వృథా చేయకండి. అయితే ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనకంగా ఉంటుంది. మీకు సంబంధించిన ముఖ్యమైన పని ఈరోజు పూర్తవుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు రావచ్చు. ఈరోజు ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా అనుకూలంగా ఉండదు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 7:05 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఊహించని సంఘటన జరుగుతుంది. వివాహితులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు కొత్త వాహనం కొనాలనుకుంటే షోరూమ్‌కి వెళ్లి కారును చూడటం మంచిది. పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంచడంలో మీకు సమస్యలు రావచ్చు. అయితే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీరు మీ సీనియర్ల నుండి సలహా పొందుతారు. దాని ద్వారా పెద్ద ప్రయోజనం పొందవచ్చు. మీరు ఏ కష్టమైన పనిని అయినా ఈరోజు సులభంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రోజు, మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది.ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా కష్టమైన పనులు ఎదురవుతాయి. అయినా కూడా మీరు మీ పనిని సమర్థవంతంగా చేయడానికి ప్రయత్నిస్తారు. ఇందుకోసం మీకు మంచి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మీరు సీనియర్లు మరియు సహచరుల నుండి సహాయం ఆశించవచ్చు. వ్యాపారవేత్తలకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి.మీరు ఈరోజు ఎక్కువ డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంది. నిరాశ పడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు త్వరలో మీకు అనుకూలంగా మారతాయి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3:45 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీ తండ్రి మీతో చాలా సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

కన్య ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. మీరు వ్యాపారస్తులైతే నిర్ణయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఉపాధిలో ఉన్న వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గానే ఉంటుంది. ఈ రోజు మీరు మీ తల్లిదండ్రులతో గొప్ప సమయం గడుపుతారు. వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు, మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. అయితే మీరు ఈరోజు చాలా కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైతే ఏదైనా విషయంలో మిమ్మల్ని ఎంతగా రెచ్చగొట్టినా మీరు నిగ్రహం కోల్పోకుండా ఉండాలి. ఈరోజు మీరు మంచి ప్రయోజనాలను పొందే అవకాశాలను కూడా ఉన్నాయి. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీరు పూర్తి మద్దతు పొందుతారు. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండండి. బయట తిండి ఎక్కువగా తినకండి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కొన్ని కొత్త ప్లాన్స్ వేస్తారు. అంతేకాదు వాటిని అతి త్వరలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకు సంబంధించిన ఫలితాలు కూడా త్వరలోనే వస్తాయి. ఈరోజు పనిలో చాలా కష్టపడతారు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంతే కాదు పొదుపుపై కూడా శ్రద్ధ పెడతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. మీరు ఆరోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలున్నాయి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు రొమాంటిక్ పరమైన రోజు అవుతుంది. మీరు ఈరోజు తొలి చూపులోనే ఒకరితో ప్రేమలో పడే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఇప్పటికే సంబంధంలో ఉంటే, ఈ రోజు మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. మరోవైపు, వివాహితులు తమ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 4:35 నుండి రాత్రి 7:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. మీరు ఆఫీసులో కష్టపడి పనిచేస్తారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తోబుట్టువులు బాగుంటారు. ఈ రోజు మీరు మీ కుటుంబంతో ఈ రోజును పూర్తిగా ఆనందిస్తారు. మీ కుటుంబం మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో మీకు అర్థమవుతుంది. ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. ఈరోజు ఎక్కువ డబ్బునే సంపాదిస్తారు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఆకస్మికంగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం కూడా ఉంటుంది. ఈరోజు వ్యాపారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ సానుకూలతతో ప్రజలు బాగా ఆకట్టుకుంటారు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

Story first published: Thursday, February 6, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion