శుక్రవారం మీ రాశిఫలాలు (07-02-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు వారి పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు. దీని ఫలితంగా మీకు విజయాలు లభిస్తాయి. వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ ప్రాంతంలోని కొత్త వ్యక్తులతో కనెక్ట్ కావచ్చు. ఆర్థిక పరంగా బాగుంటుది. మీరు ఎవరైనా పేదవారికి ఈరోజు సహాయం కూడా చేయవచ్చు.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాపారులు నిజాయితీగా పని చేయాలి. పని ప్రదేశంలో తోటి వారితో ఎక్కువగా మాట్లాడకుండా పనిపై శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. కుటుం జీవితం సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : సాయంత్రం 6:40 నుండి రాత్రి 8:25 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు వివాహిత జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రవర్తనపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ప్రేమికులు ప్రేమ విషయంలో మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీ సమావేశం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలే ఉంటాయి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా మంచిగా ఉంటుంది. అయితే అనవసరంగా మీరు రుణం వంటివి తీసుకోకూడదు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలంగా ఉంటాయి. మీరు అందరి నుండి ప్రేమ మరియు మద్దతు పొందుతారు. మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో విశ్రాంతి సమయాన్ని గడుపుతారు. పని విషయంలో కొంత ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు పెద్దగా ప్రయోజనాలేమీ ఉండవు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9:40 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతుంటే, కొన్ని చిట్కాలను పాటించాలి. వైద్యుడిని సంప్రదించకుండా మందులను తీసుకోకండి. కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితో అపార్థాలను పెంచుకుంటే, మీ సంబంధం బలహీనపడుతుంది. మీ వివాహ జీవితంలో మళ్ళీ అదే ప్రేమ మరియు శాంతిని మీరు కోరుకుంటే, మొదట మీరు మీ దూకుడు స్వభావాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండదు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కార్యాలయంలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. మీ సహోద్యోగులు అనవసరంగా మిమ్మల్ని సమస్యల్లోకి లాగే ప్రయత్నం చేస్తారు. మీరు ఉత్సాహంతో పాటు అప్రమత్తంగా పని చేయాలి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనుకుంటే, ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్లాలి. అనవసరమైన ఖర్చులను చేయాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 5:55 నుండి ఉదయం 11:20 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. ఈరోజు మీ ప్రియురాలు మీపై చాలా ప్రేమ చూపుతారు. మీరు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. అయితే మీరు ఆశించి ఫలితాలు రావు. దీంతో మీరు నిరాశ చెందుతారు.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:45 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ పరంగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు మీరు ఒంటరిగా ఉంటే, మీకు ప్రేమ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది. ఎందుకంటే వారు మీకు సన్నిహితుడే కావచ్చు. పని విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా కష్టపడి పని చేస్తారు. ఆరోగ్యం విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 10:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఒత్తిడి పెంచుకోకండి. ముఖ్యంగా విశ్రాంతిపై శ్రద్ధ పెట్టండి. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. మీరు ఈ రోజు కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఈ రోజు మీరు కుటుంబజీవితంలో మంచి ఫలితాలను పొందవచ్చు. విద్యార్థులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:50 నుండి రాత్రి 8:18 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు మంచి మానసిక స్థితిలో ఉంటారు. విద్యార్థులు కొందరు స్నేహితులతో కలిసి సినిమా చూడాలని అనుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఈరోజు బలంగానే ఉంటుంది. ఆర్థిక నిర్ణయాలు కూడా ఆలోచనాత్మకంగా తీసుకోవాల్సి ఉంటుంది. మీకు త్వరలో సరైన ప్రయోజనాలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో పరిస్థితులు ఒత్తిడితో కూడుకుని ఉంటాయి. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : ఉదయం 5:25 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఏదైనా ఆందోళన ఉంటే, మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే గ్రహాల కదలికలు మీకు కొన్ని మంచి సంకేతాలు ఇస్తున్నాయి. ఈరోజు మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. పని విషయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు. ఈ రోజు మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా మంచి ఉపశమనం పొందుతారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు అనవసరంగా కోపం పడతారు. మీరు ఈరోజు చుట్టుపక్కల వారితో విభేదాలు కలిగి ఉంటారు. పని విషయంలో ఈరోజు విజయం సాధించడానికి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 11 గంటల వరకు

Story first published: Friday, February 7, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion