Latest Updates
-
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్!
బుధవారం దినఫలాలు : ఉద్యోగులకు ఈరోజు పని భారం తక్కువగా ఉంటుంది...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, పుష్యమాసం బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారిలో మార్కెటింగ్ రంగంలో ఉండే వారికి ఈరోజు చాలా పవిత్రంగా ఉంటుంది. మీరు ఈరోజు మంచి ఫలాలను పొందవచ్చు. ఎలక్ట్రానిక్ వ్యాపారులు కూడా ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీరు ఇంటి పెద్దల ఆశీర్వాదం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఒక సమస్య ఉండొచ్చు.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 31
లక్కీ టైమ్ : సాయంత్రం 5:55 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో వ్యాపారవేత్తలు ఈరోజు వ్యాపార నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. ఉద్యోగులు ఈరోజు ముందుకు సాగడానికి గొప్ప అవకాశాన్ని పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఈరోజు కొంత నిరాశగా ఉంటుంది. మీ వ్యక్తిగత విషయాలలో బయటి వ్యక్తులు జోక్యం చేసుకోకుండా చూసుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 30
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ పూర్తవుతాయి. ఈరోజు మీరు మీ లక్ష్యాన్ని సకాలంలో సులభంగా పూర్తి చేయగలరు. రిటైల్ వ్యాపారులు మంచి ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైనవారు చాలా మంచి మానసిక స్థితిలో ఉంటారు. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ ఇంటి పెద్దలను ప్రేమతో, గౌరవంగా చూసుకోవాలి. మరోవైపు ఈరోజు కలప వ్యాపారవేత్తలకు చాలా అదృష్టం ఉంటుంది. మరోవైపు, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వారు ఈరోజు చాలా బిజీగా గడుపుతారు. ఈరోజు మీరు పనిభారం పెరగొచ్చు. మీరు మీ పనులన్నింటినీ నిజాయితీగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే మంచిది. ఈరోజు మీ కృషి రాబోయే రోజుల్లో మీ కోసం కొత్త మార్గాలను తెరవవచ్చు. ఈరోజు ఆర్థిక పరంగా ఎంతో ఖరీదైనది. మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండాలి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలుంటాయి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారిలో నిరుద్యోగులుగా ఉన్న వారికి ఈరోజు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల మీకు గొప్ప అవకాశం లభిస్తుంది. మీరు ఇప్పటికే పనిచేస్తుంటే, కార్యాలయంలో మీ పని పట్ల జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యం మీకు హానికరంగా ఉంటుంది. ఆహార మరియు పానీయాల వ్యాపారులు ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీ ఆందోళన పెరుగుతుంది. మీరు ఏదైనా మంచి వైద్యుని సలహాలు పాటించాలి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 29
లక్కీ టైమ్ : ఉదయం 4:35 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు పని భారం తక్కువగా ఉంటుది. ఈరోజు మీరు సమయానికి ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయగలుగుతారు. మీ ఉత్తమ పనితీరుకు బాస్ నుండి చాలా ప్రశంసలు పొందుతారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వారు ఈరోజు ఆర్థికంగా లాభపడతారు. మీరు చాలాకాలంగా చట్టపరమైన విషయం గురించి ఆందోళన చెందుతుంటే, ఈరోజు దాని నుండి మీరు కొంత ఉపశమనం పొందవచ్చు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తారు. తల్లిదండ్రులతో సంబంధం మరింత బలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు మద్దతు మీకు లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. వివాహితులకు ఈరోజు మీ భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగయ్యే పరిస్థితులు ఉంటాయి. మీరు మీ ఆర్థిక నిర్ణయాలు స్పృహతో తీసుకుంటే, త్వరలో మీ ఆర్థిక సమస్యలన్నీ అంతమవుతాయి. ఈరోజు వ్యాపారులు కష్టపడి పనిచేస్తే, తప్పకుండా ప్రయోజనాలు పొందుతారు. మీరు ఐటి కంపెనీలో పనిచేస్తుంటే, ఈరోజు మీకు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామితో మీకు మంచి సంబంధం ఉంటుంది. ప్రతికూల పరిస్థితులలో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఈరోజు ప్రేమ విషయంలో చాలా రొమాంటిక్ గా ఉంటుంది. చాలా కాలం తరువాత మీరు ఈరోజు మీ భాగస్వామితో గొప్ప సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉండదు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో నిరుద్యోగులు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు మీ ప్రయత్నాలను మరింత పెంచాలి. మీరు పూర్తి సానుకూలతతో ముందుకు సాగండి. త్వరలో మీకు మంచి విజయం లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు ఏదైనా ఆటంకాలు ఉంటే మీ సమస్యలకు ముగింపు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ప్రేమ విషయంలో ఈరోజు మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే మీకు ప్రేమ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 6:55 నుండి సాయంత్రం 4 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో విద్యార్థులు ఈరోజు ఏదైనా పోటీ పరీక్షలకు ప్రయత్నిస్తుంటే, మీరు కష్టపడి అధ్యయనం చేయాలి. అప్పుడే మీరు మీ కృషికి సరైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల కారణంగా వ్యాపారులకు సమస్యలు ఎదురవుతాయి. మీరు కొత్త పనుల కోసం బ్యాంకు నుండి రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే, ఈరోజు మీరు నిరాశకు గురవుతారు. కార్యాలయంలో ఉన్న సీనియర్ అధికారులతో గొడవ పడకుండా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో మీకు మంచి సంబంధం ఉంటుంది. ఆశ్చర్యకరంగా మీ విరోధులు ప్రతికూల పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. మీ శృంగార జీవితంలో కొంత గందరగోళం ఉండవచ్చు. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు ఉండొచ్చు. వ్యాపారులు ఈరోజు కొన్ని కొత్త ప్రణాళికలను రూపొందించొచ్చు. ఉద్యోగులకు ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు మీ పనిని ఎటువంటి ఒత్తిడి లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు పాత రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. మీరు తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపొచ్చు. మీరు తల్లి నుండి మంచి బహుమతిని కూడా పొందవచ్చు. మీరు వివాహం చేసుకుంటే, మీ వివాహ జీవితంలో మీ అభిరుచి మరియు ప్రేమ మరియు ఉత్సాహాన్ని కొనసాగించడానికి, మీ భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఎవరితో అయినా వివాదం ఉండొచ్చు. కాబట్టి మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవావలి. మరోవైపు మీరు చట్టపరమైన కేసులలో చిక్కుకోవచ్చు. ఉద్యోగులు ఈరోజు కొత్త ఆలోచనలను చేయాలి. తద్వారా మీ పురోగతి కల త్వరలో నెరవేరుతుంది. ఈరోజు వ్యాపారులు పెద్దగా బేరసారాలు చేయకుండా ఉండాలి. చాలా కాలం తరువాత, మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో శృంగార సమయాన్ని గడుపుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు ఏదైనా విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇతరుల మాటల్లో విని తొందరపడకండి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే, మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి. ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది మరియు మీ మధ్య దూరాన్ని కూడా తగ్గిస్తుంది. మీ శృంగార జీవితంలో ఒక అందమైన మలుపు ఉంటుంది. మీ భాగస్వామి పెళ్లి కోసం మిమ్మల్ని ప్రతిపాదించవచ్చు. ఈరోజు మీరు మంచి విజయాన్ని సాధించగలరు. ఈరోజు ఆరోగ్య పరంగా మిశ్రమంగా ఉంటుంది.
లక్కీ కలర్ : కుంకుమ
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











