For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం మీ రాశిఫలాలు (14-02-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఈ ఏడు రాశుల వారు ప్రేమలో చాలా అదృష్టవంతులవుతారట...! మీ రాశి కూడా ఉందేమో చూడండి...ఈ ఏడు రాశుల వారు ప్రేమలో చాలా అదృష్టవంతులవుతారట...! మీ రాశి కూడా ఉందేమో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు డబ్బుకు సంబంధించి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శ్రామిక ప్రజలు తమ భాషను చాలా ఆలోచనాత్మకంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ రోజు మీ సీనియర్లు మీ పనిలో లొసుగులను కనుగొంటే, వారితో వాదించడానికి బదులు, మీరు వారి మాటలపై దృష్టి పెట్టాలి. కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య పరమైన సమస్యలు కూడా ఎదురు కావచ్చు.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు వైవాహిక జీవితంపై శ్రద్ధ పెట్టాలి. లేకపోతే మీ భాగస్వామి మీ పట్ల ఆసక్తిని కోల్పోతారు. ఈరోజు వారితో కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్లండి.వ్యాపారుస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు మీరు కష్టపడి పనిచేసిన తరువాత మంచి ఫలితాలను పొందవచ్చు. విద్యార్థులు ఈరోజు పరీక్షలో గొప్ప విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 7:20 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు కుటుంబానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోండి. తప్పు నిర్ణయం మీ భవిష్యత్తును కూడా పాడు చేస్తుందని గుర్తుంచుకోండి. ఇది మీ మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి అవకాశం ఉంది. పని విషయంలో బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు వారికి ఇష్టమైన ప్రదేశానికి బదిలీ చేయడం సాధ్యపడుతుంది. వివాహ జీవితంలో కలహాలు ఉంటాయి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సంభాషణ సమయంలో అనవసరంగా సమస్యలను లేవనెత్తకపోతే మంచిది. ఈ రోజు ప్రయాణానికి శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చేయండి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో వాతావరణం మంచిగా ఉంటుంది. మీ యజమాని ఈరోజు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు చిన్న చిన్న విషయాలపై ఇబ్బందులు పడతారు. దీంతో మీకు కోపం వస్తుంది. మీ దూకుడు మానసిక స్థితి కారణంగా, మీరు ఈ రోజు కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా సోదరుడు లేదా సోదరితో విభేదాలు కలిగి ఉండవచ్చు. మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడం మంచిది. ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా ఆలోచనాత్మకంగా నిర్ణయాలను తీసుకోవాలి. లేదంటే లాభాల స్థానంలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. మీ వైవాహిక జీవితం బాగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు ఉంటుంది. ఇది మాత్రమే కాదు, చాలా కాలం తరువాత మీరిద్దరూ శృంగార దినాన్ని ఆనందిస్తారు. శృంగార జీవితంలో స్థిరత్వం కూడా ఉంటుంది. ఈ రోజు మీరు మీ ప్రేమికుడు / ప్రేయసితో మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళవచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈ రోజు మీరు చాలా రిలాక్స్ గా ఉంటారు. మీరు చాలా మంచిగా మరియ నమ్మకంగా ఉంటారు. చాలా కాలం తరువాత మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. ఇది మనస్సును చాలా ఆనందపరుస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఏ పని అయినా పూర్తవుతుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. కుటుంబంతో సంబంధాలు బలపడతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈ రోజు మీ జీవితంలో పెద్ద మార్పు సంకేతాలు కనబడుతున్నాయి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ మార్పు మీ జీవితానికి కొత్త దిశను ఇస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం సామరస్యంగా ఉంటుంది. దేశీయ బాధ్యతలను నెరవేర్చడంలో మీరిద్దరూ ఒకరికొకరు సహకరిస్తారు. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్య విషయం అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ముఖ్యంగా పంటి నొప్పి వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామికి విలువైన బహుమతిని ఇవ్వవచ్చు. ఈరోజు వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు కొంత నష్టం ఉండవచ్చు. కుటుంబ జీవితంలో కొంత ఉద్రిక్తత సాధ్యమే. ప్రియమైన వారితో సంబంధం చేదును కలిగిస్తుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే సమయానికి డబ్బు అందుతుంది. కానీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు అడ్డంకులు రావచ్చు. ఈ రోజు మీ వివాహ జీవితంలో ఒక పెద్ద సమస్య అకస్మాత్తుగా తలెత్తవచ్చు. ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. మీ జేబు నిండా డబ్బులు ఉంటాయి. మీరు ఆందోళన చెందకుండా ఉంటారు. మీరు కొత్త వాహనాన్నికొనాలని ఆలోచిస్తుంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. పని విషయంలో గొప్పగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమ విషయంలో, మీరు ఈ రోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కుటుంబం మీ సంబంధాన్ని ఆమోదించకపోవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:25 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు ఈరోజు ఆశించిన ఫలితాలను పొందుతారు. మీరు ఈరోజు మీ లక్ష్యాన్ని సాధించగలుగుతారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తోబుట్టువులతో సంభాషించడం మంచిది. ఈ రోజు మీరు మీ కుటుంబంతో ఈ రోజును పూర్తిగా ఆనందిస్తారు. మీ కుటుంబం మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో మీకు తెలుస్తుంది. ఆర్థిక పరంగా సంకేతాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు బాగానే ఉంటుంది. పెద్ద సమస్య ఉండదు.

లక్కీ కలర్ : లైట్ బ్లూ

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 10:10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా ప్రయోజనాలు దక్కుతాయి. మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే, మీ జీతం పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీరు చాలా ఆనందించండి. పని ఒత్తిడి తగ్గడంతో మీకు విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది. మీరిద్దరూ సంతోషంగా ఉంటారు.ఈ రోజు ఆరోగ్యం పరంగా ఉపశమనం కలుగుతుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు

English summary

Daily Horoscope February 14, 2020

Read your daily horoscope to find out what the stars of fate have in store for you. There will be hurdles and opportunities so it is best to know them beforehand.
Story first published:Friday, February 14, 2020, 0:06 [IST]
Desktop Bottom Promotion