Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
మంగళవారం మీ రాశిఫలాలు (18-02-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధం విషయంలో గందరగోళంలో ఉంటారు. మీ మనస్సులో అసంతృప్తి భావన ఉంటుంది. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. మీ సంబంధం గురించి తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఈ రోజు, స్నేహితులతో ప్రయాణించడం వినోద కార్యక్రమంగా మారుతుంది. ఈ రోజు మీరు చాలా ఎక్కువ ఖర్చు చేయవచ్చు.
లక్కీ కలర్ : లైట్ ఎల్లో
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 7 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు పనిలో శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార రంగంలో అన్ని వేగంగా పూర్తవుతాయి. మీకు మంచి లాభాలు కూడా లభిస్తాయి. మీరు మీ ప్రియురాలితో సంతోషకరంగా గడపవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో ప్రణాళిక పరంగా ముందుకెళ్లాలి. ఒక క్రమ పద్ధతిలో పని చేయాలి. లేదంటే పని భారం పెరిగి ఒత్తిడిని అనుభవిస్తారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ, మీరు ఎక్కువ ఖర్చులు చేయకూడదు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో శృంగార పరంగా కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఈ రోజు మీరు మీ భాగస్వామి గురించి ఏదైనా సరైన విషయం తప్పుగా నిరూపించడానికి కూడా ప్రయత్నించవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీ మధ్య చాలా గందరగోళం ఉండవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తారు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 8:20 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపగలుగుతారు. మీరు మానసికంగా చాలా మంచి అనుభూతి చెందుతారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహ జీవితం బలంగా మరియు ఆనందంగా ఉంటుంది. కార్యాలయ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీరు మీ పనిని శ్రద్ధతో పూర్తి చేస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి 5 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ప్రశాంతంగా ఉండటం వల్ల మీరు చాలా సమస్యలను అధిగమించగలుగుతారు. మీరు మీ కుటుంబంతో మంచిగా ఉండండి. పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ నిరంతర పని వల్ల మీరు ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిద్రలేమి సమస్య కూడా ఎదురుకావచ్చు. ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 5:50 నుండి రాత్రి 2:15 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈ రోజు కొత్త ఆలోచనలతో నిండి ఉంటారు. మీ పనిని వేగవంతం చేయడానికి, మీరు కొన్ని కొత్త మార్గాలను అన్వేషిస్తారు. మీ పనిలో మీరు పురోగతిని నిర్ణయించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే మీ ఆదాయం చాలా వేగంగా ఖర్చవుతుంది. ఈ రోజు మీరు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అక్కడ మీరు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:25 నుండి రాత్రి 10:10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు విద్య పట్ల ఆసక్తిని తగ్గించుకునే అవకాశం ఉంది. అయితే ఇంకోసారి మీరు శ్రద్ధగా అధ్యయనం చేయగలుగుతారు. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఇది మిమ్మల్ని చాలా ఉత్సాహపరుస్తుంది. చాలా కాలం తర్వాత స్నేహితులతో సరాదాగా గడుపుతారు. ఈ రోజు మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, మీరు దానిని పూర్తి విశ్వాసంతో మరియు ధైర్యంతో ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా అనుకూలంగా బాగుంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే, వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధాలు బాగుంటాయి. ఈ రోజు వివాహితులకు చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు ఎక్కువ లాభాలు వచ్చే నిర్ణయాలను తీసుకుంటారు. పనిలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని మార్చాలని అనుకుంటారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.మీరు మీ పాత ఆస్తిని అమ్మవచ్చు. మీరు చాలా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండండి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 25
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 7:45 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండదు. సరైన సమయం కోసం మీరు కొంత కాలం వేచి చూడాలి. వ్యాపారస్తులకు ఈరోజు లాభం మితంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. తొందరలో మీరు ఈరోజు ఏదైనా తప్పులు చేయవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైనది. ఈరోజు మీరు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు కొత్త పనిని ఈరోజు ప్రారంభించే అవకాశం ఉంది. మీకు ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి అన్ని విషయాల్లో మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి రాత్రి 7 గంటల వరకు



Click it and Unblock the Notifications