Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
గురువారం మీ రాశిఫలాలు (20-02-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది.
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులను వాయిదా వేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి కూడా మీకు ఎక్కువ అవకాశం లభించదు. అయితే ప్రతికూల పరిస్థితులలో మీ భాగస్వామి మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది.ఈ రోజు ఖర్చులు తక్కువగా ఉంటాయి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈ రోజు మానసిక స్థితి చాలా బాగుంటుంది. ఈరోజు మీరు పూర్తి స్థాయిలో ఆనందిస్తారు. మీరు మీ స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా ఈరోజు మీరు పని ఒత్తిడిని వదిలేస్తారు.ఇది స్వేచ్ఛగా జీవించే సమయం, కాబట్టి అనవసరమైన గజిబిజిలో సమయాన్ని వృథా చేయకండి. మీ శృంగార జీవితంలో, మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కార్యాలయంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు ఎటువంటి ఒత్తిడి లేకుండా మీ పనిని పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా మీరు ఈరోజు అదృష్టవంతులు అవుతారు. మీ ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. మీరు మానసికంగా కూడా బలంగా ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడటం మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఈ రోజు మీరు మీ మీద దృష్టి పెట్టగలుగుతారు. ఈ రోజు మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీ వివాహ జీవితంలో అనుకూలత ఉంటుంది. మీరు మీ భాగస్వామితో కలిసి ఉండటం ఆనందంగా ఉంటుంది.
లక్కీ కలర్ : కుంకుమ
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:35 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా చాలా బాధపడతారు. మీ మనస్సులో చాలా ఆందోళనలు ఉంటాయి. ఈ రోజు మీ ఒత్తిడిని పెంచే చాలా విషయాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, మీరు ఓపికగా ఉండాలి. అయితే భయపడకుండా మీరు కుటుంబానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరుమీ ముఖ్యమైన సమస్యలపై శ్రద్ధ చూపుతారు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 36
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 7:05 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈ రోజు సంతృప్తికరమైన రోజు అవుతుంది. మీ పట్టుదల మరియు సహనం యొక్క బలం మీద మీరు మీ సమస్యలకు పరిష్కారం కనుగొనగలుగుతారు. మీ శృంగార జీవితం గురించి మాట్లాడితే, మీ భాగస్వామితో సంబంధంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వివాహిత జంటలు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు మీరు ఎక్కువ ఆదా చేయలేరు. మీ కార్యాలయంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా ఆలోచనాత్మకంగా ఉండాలి.మీ వ్యక్తిగత సమస్యలను సాధ్యమైనంతవరకు బయటి వ్యక్తులతో పంచుకోకండి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ శృంగార జీవితంలో, ఈ రోజు మీకు కొద్దిగా నిరాశ ఉండవచ్చు. ఈ రోజు మీకు మీ భాగస్వామిని కలిసే అవకాశం రాదు. మీరు వివాహం చేసుకుంటే మీ జీవిత భాగస్వామిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:20 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజుప్రతిదానిలో చాలా సంతృప్తి చెందుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడే అవకాశం ఉంది. ఈ రోజు, మీ ప్రియమైన వారి ప్రవర్తనలో కొన్ని మార్పులు కూడా సాధ్యమవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.ఈ రోజు మీ దృష్టి అంతా మీ పని పైనే ఉంటుంది. మీరు ఈ రోజు ఆరోగ్యంగా ఉంటారు.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 43
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు చాలా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక సమస్యల వల్ల ఇంట్లో కూడా ఇబ్బందులు ఎదురుకావచ్చు. దీని వల్ల కుటుంబ బాధ్యతలు కష్టమవుతాయి.మీరు ఈ రోజు మీ పిల్లల గురించి చాలా ఆందోళన చెందుతారు. వారి ప్రవర్తన ఈ రోజు సరిగ్గా ఉండదు. మీకు కష్టపడి పనిచేయగల సామర్థ్యం ఉంది. వ్యాపారవేత్తలు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు కొంత ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు మీ ప్రవర్తనలో మంచిగా నడుచుకోవాలి. ఎందుకంటే ఈరోజుమీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి సరిగ్గా ఉండదు. వారు కోపంగా ఉండవచ్చు లేదా ఈ రోజు చిరాకు అనుభూతి చెందుతారు. మీరు సున్నితమైన సమస్యను చర్చిస్తే, మీకు ఖచ్చితంగా ఘర్షణ ఉంటుంది. పనిలో కొంచెం కష్టమవుతుంది. ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరిమితుల కారణంగా, అనేక ప్రతికూల ఆలోచనలు మనస్సులోకి రావచ్చు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 27
లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో నిరుద్యోగులకు ఈరోజు అాద్భుతమైన రోజు కానుంది. ఈరోజు వీరు ఉద్యోగానికి సంబంధించిన వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఈరోజు చాలా ఆలోచనాత్మకంగా గడపండి.మీ వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల నుండి మీకు మద్దతు మరియు ఆప్యాయత లభిస్తుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపలేరు.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఖరీదైన రోజు అవుతుంది. మీరు అవసరం కంటే ఎక్కువ ఖర్చు చేయవచ్చు. వ్యాపారులకు ఒత్తిడి ఉన్నప్పటికీ సులభంగా పని చేయగలరు. వివాహితులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ప్రయాణం చేయవచ్చు.మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 23
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 8:05 గంటల వరకు



Click it and Unblock the Notifications











