శుక్రవారం మీ రాశిఫలాలు (21-02-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఎక్కువ పని ఒత్తిడి ఉండొచ్చు. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మీ వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. మీరు ఈరోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఈరోజు కుటుంబ జీవితంలో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుందిద. మీకు ఈరోజు అన్ని విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 33

లక్కీ టైమ్ : ఉదయం 11:15 నుండి రాత్రి 8:45 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబం విషయంలో ఆనందంగా ఉంటుంది. చాలా కాలం తర్వాత మీకు ఇలాంటి అవకాశం దక్కుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అయితే మీరు కొంచెం కష్టపడితే సమస్య నుండి బయటపడగలరు. వ్యాపారులకు ఈరోజు కొంత హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. అయితే మీరు ఖర్చులు తక్కువగా చేయాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:45 నుండి రాత్రి 8:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా గొప్పగా ఉంటుంది. దీని ప్రభావంతో ఈరోజు చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. కార్యాలయంలో ఈరోజు మీ పనితీరు ప్రశంసించబడుతుంది. మీరు పని విషయంలో ఈరోజు చాలా నమ్మకంగా ఉంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు ముమ్మరం చేయబడతాయి. సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సరదాగా గడిపేందుకు బయటకు వెళ్లొచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రోజు మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 43

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 9 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ఆనందంగా ఉంటుంది. మీరు ఈరోజు మీ భాగస్వామితో కలిసి ఏదైనా మంచి ప్రదేశానికి వెళతారు. ఈరోజు చిరస్మరణీయంగా గడిపేందుకు ప్రయత్నిస్తారు. వివాహితుల జీవితంలో ఈరోజు బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గానే ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మరింత ఆరోగ్యంగా ఉండటానికి, తేలికపాటి వ్యాయామం చేయండి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. మీరు సానుకూల ఆలోచనలతో మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీరు ఖచ్చితంగా గెలుస్తారు. ఈ రాశి వారిలో కొందరికి చాలా కాలం తరువాత ఈరోజు కుటుంబ సభ్యులను కలిసే అవకాశం లభిస్తుంది. మీ ప్రియమైన వారితో సమయం గడపడం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు. ఈ రోజు పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు తప్పవు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కొంత నిరాశకు లోనవుతారు. మీరు ఈరోజు ఒంటరిగా ఉండాలి అనుకుంటారు. మీ ప్రియమైన వారితో అవసరమైన సమయంలో సహాయపడకపోవడంతో వారు మీపై కోప్పడతారు. అయితే క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా మీ ప్రయత్నాలు విఫలం కావచ్చు. అయితే ప్రయత్నిస్తూనే ఉండండి.. మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 8:15 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో వివాహితులకు ఈ రోజు వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. పిల్లల వైపు నుండి ఈరోజు మీకు ఆనందం లభిస్తుంది. పని విషయంలో కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితిలో మీరు చాలా ఓపికగా ఉండాలి. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. గొప్ప ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 8:45 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా బాగా ఉంటుంది. మీ ప్రణాళిక ప్రకారం పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ అవసరమైన స్నేహితుడు లేదా బంధువులలో ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులకు కూడా కొన్ని బహుమతులు కొనుగోలు చేయవచ్చు. జీవిత భాగస్వామితో సంబంధాలు తీవ్రమవుతాయి. అదే సమయంలో, ఈ రోజు శృంగార జీవితంలో ఒక సమస్య ఉండవచ్చు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 5:55 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో కొందరు ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా కొన్ని సంస్కరణలు చేయాల్సి ఉంటుంది. అయితే తొందరలో ఎలాంటి పని చేయకండి. ఆర్థిక పరంగా ప్రతిదీ ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పరంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 9:50 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఈరోజు కొందరికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే మీకు ఎవరైనా ఏదైనా బాధ్యత అప్పగిస్తే, దానిని చాలా జాగ్రత్తగా మరియు నిజాయితీగా నెరవేర్చడానికి ప్రయత్నించండి. మరోవైపు ఈరోజు మీ జీవిత భాగస్వామి వైఖరి కూడా మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైన రోజు అవుతుంది. ఈరోజు మీరు ఎక్కువ డబ్బును ఖర్చు చేయవచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:05 నుండి రాత్రి 9:05 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో కొందరు ఈరోజు కోర్టు కేసులో విజయం సాధించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వారి సమస్యలు ఈరోజు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు ప్రయోజనం కూడా లభిస్తుంది. మీరు ఈ రోజు పెట్టుబడి పెట్టాలనుకుంటే, మొదట చిన్న స్థాయిలో పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కొత్త ప్రాజెక్ట్‌లో పనిచేయాలని ఆలోచిస్తుంటే, మీ తండ్రి నమ్మకాన్ని పొందటానికి ఈరోజు మంచిది. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి గరిష్ట ప్రయత్నాలు చేయాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో పరస్పర స్నేహం మరియు ప్రేమ పెరుగుతాయి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఒత్తిడి లేకుండా జీవించేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రియురాలితో ఏదైనా విహారయాత్రకు ప్లాన్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:25 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

Story first published: Friday, February 21, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion