శనివారం మీ రాశిఫలాలు (22-02-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు పనిలో మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగావకాశాన్ని పొందవచ్చు. వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొంతమంది కొత్త వ్యక్తులతో మీకు వ్యాపార సంబంధాలు కూడా ఏర్పడతాయి. మరోవైపు కుటుంబ జీవితంలో సమస్య ఉండవచ్చు. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి రాత్రి 9:30 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఒడిదుడుకులు ఉంటాయి. ఈరోజు మానసికంగా మీరు చాలా బాధపడతారు. ఈరోజు మీ ఇంటి వాతావరణం కూడా అంతగా బాగుండదు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొంత కోపంగా ఉంటారు. కానీ మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ పట్ల ప్రేమ కూడా పెరుగుతుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ రోజు మీరు ఎక్కువ మానసిక మరియు శారీరక శక్తిని అనుభవిస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో మీ పనిని వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు ఈరోజు కొన్ని ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి. మీరు మీ తోబుట్టువులతో గొప్ప సమయం గడుపుతారు. వివాహితులు ఈరోజును పూర్తిస్థాయిలో ఆనందిస్తారు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు చాాలా బిజీగా ఉంటుంది. మీరు ఈరోజు ఏవైనా పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. తొందరపాటులో ఎలాంటి పనులు చేయకండి. ఈరోజు మీ ప్రవర్తనలో చిరాకు ఉంటుంది. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. అయితే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు పొదుపుపై శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 7:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు అన్ని విషయాలను అవగాహనతో సులభంగా ఎదుర్కొంటారు. ఈరోజు మీరు ఎలాంటి ఇబ్బందుల్లోనైనా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగస్తులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఉన్నతాధికారులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు అవివాహితులైతే, ఈ రోజు ఇంట్లో మీ వివాహం గురించి చర్చించే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని షాకింగ్ వార్తలు వినబడతాయి. ముఖ్యంగా ఉద్యోగులకు బదిలీ వంటి ఆశ్చర్యకరమైన వార్తలు వినబడొచ్చు. వ్యాపారులు ఈరోజు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది. మీకు మీ తల్లి యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. వివాహితులకు ఈ రోజు జీవిత భాగస్వామితో కొంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 6:15 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు సానుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారవేత్తలకు అంతర్జాతీయ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. అయితే మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీరు మీ వ్యక్తిగత జీవితంపై కూడా చాలా బ్యాలెన్స్ డ్ గా ఉండాలి. మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామితో కలవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా ఆరోగ్యంగా ఉంటారు. దీని వల్ల మీరు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుది. మీకు డబ్బు సంపాదించే అవకాశం వస్తే, మీరు చాలా తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకండి. ఈ సమయంలో పరిస్థితి మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో వాతావరణం చాలా బాగుంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఈరోజు వివాహం అయిన వారికి ఏవైనా సమస్యలు ఎదురైతే, వారి జీవిత భాగస్వామికి పూర్తి మద్దతుగా ఉంటుంది. అయితే మీరు వారిని అనుమానించడం మానుకోవాలి. ఈ రోజు వ్యాపారవేత్తలు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు సరైన అవగాహనతో ఆదాయాన్ని ఆర్జించగలుగుతారు. ఈరోజు మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. మీరు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని అనుభవిస్తారు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు కొత్త అవకాశం ఎదురుచూస్తుంటే, సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. పని విషయంలో ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీరు వ్యాపారం విషయంలో చాలా కష్టపడతారు. దీని వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కరించబడతాయి. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు కుటుంబం మరియు స్నేహితులతో చాలా ఆనందించే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారితో గడిపిన ఈ క్షణాలు మీకు బాగా గుర్తుండిపోతాయి. వైవాహిక జీవితంలో ఫలితాలు మీరు ఊహించిన విధంగానే ఉంటాయి. మీరు కోరుకున్న ఫలితం పొందుతారు. విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే, మీరు గురువుల మద్దతు పూర్తిగా పొందుతారు. ఆర్థిక పరంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. అప్పుడే సానుకూల ఫలితాలు వస్తాయి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు వైవాహిక జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. మీ జీవిత భాగస్వామి పాత విషయాలన్నీ మరచిపోవచ్చు. మరోసారి మీతో ప్రేమగా ఉండే అవకాశం ఉంటుంది. మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతిని కొనసాగించడానికి, మీరు మీ ప్రియమైన వారి ఆలోచనలకు మరియు భావాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

Story first published: Saturday, February 22, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion