For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం దినఫలాలు : ఓ రాశి వారు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి...!

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, మాఘమాసం బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Venus Transit in Aquarius: కుంభంలోకి శుక్రుడి సంచారం... 2 రాశుల వారు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు రోజంతా ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. మీరు ఈరోజు ఏదైనా కొన్ని ముఖ్యమైన పని చేయబోతున్నట్లయితే, అస్సలు తొందరపడకండి. ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం బాగుంటుంది. మీకు సహోద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది.

వ్యాపారులు ఈరోజు ఎలాంటి ప్రమాదకర నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా మంచిగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో విశ్వాసంతో ఉంటారు. అలాగే, మీరు మీ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మరోవైపు ఉద్యోగులకు ఏదైనా సమస్యలుంటే, ఆ విషయంపై మీ ఉన్నతాధికారులతో మాట్లాడండి. ఇంకోవైపు చిన్న వ్యాపారులు మంచి ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీరు పాత రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఈరోజు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం రాకపోవచ్చు. ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :6

లక్కీ టైమ్ : ఉదయం 7:50 నుండి రాత్రి 8:18 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో విద్యార్థులు ఈరోజు అధ్యయనాలపై ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే, అంత మంచి ప్రయోజనాలు వస్తాయి. వ్యాపారులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. చిన్న విషయాలపై వాదనలు మానుకోండి. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈరోజు మీకు కొంత బలహీనత అనిపించవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

Sun Transit in Aquarius : సూర్యుడు కుంభంలోకి ఆగమనం వల్ల ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో అడ్డంకులు రావొచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా బ్యాలెన్స్ గా వ్యవహరించాలి. మీ కష్టాలన్నీ త్వరలోనే అంతం అవుతాయి. ఈ సమయంలో మీరు ఓపికగా పనిచేయాలి. మీకు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మీరు ఈ నిర్ణయాన్ని ఆలోచనాత్మకంగా తీసుకుంటే, మీకు కచ్చితంగా ప్రయోజనం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు ఇంటి పెద్దల ఆశీర్వాదం పొందుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధం మాధుర్యాన్ని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులలో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ :17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు సీనియర్ అధికారుల నుండి మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. వారి సహకారంతో, మీరు ఈరోజు కష్టతరమైన పనులను కూడా పూర్తి చేయగలరు. బ్యాంకింగ్ రంగంలో శ్రామిక ప్రజలకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు ఈరోజు పురోగతి సాధించే అవకాశం ఉంది. ఇవన్నీ మీ కృషి ఫలితమే. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ, మీరు మీ ఉన్నతాధికారులతో గొడవ పడకుండా ఉండాలి, లేకపోతే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు. వ్యాపారులు ఈరోజు ఆర్థికంగా నష్టపోవచ్చు. ఈరోజు తల్లిదండ్రులతో సంబంధం మరింత బలంగా ఉంటుంది. మీ తోబుట్టువుల పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఈరోజు కొన్ని కారణాల వల్ల, జీవిత భాగస్వామి చాలా ఒత్తిడికి లోనవుతారు. మీ మధ్య కొంత గందరగోళం ఉండవచ్చు. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మీకు చిన్న సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 40

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

Mars Transit in Taurus : కుజుడు వృషభంలోకి సంచారం... ఈ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకంటే మీ యజమాని ఫోకస్ మీపై ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పిల్లలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వీలైతే, ఈరోజు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. సాయంత్రం ఏదో ఒక మత స్థలాన్ని సందర్శించే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా పవిత్రమైనది. మీరు వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు వ్యాపారం చేస్తే మీ కోసం మంచి లాభం పొందుతారు. మీ వ్యాపారం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు మంచి పురోగతి సాధించవచ్చు. మీరు ఒక విదేశీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే, మీరు ఉన్నత పదవిని పొందే అవకాశం ఉంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మరియు కుటుంబంతో మీ విభేదాలను కూడా అధిగమించవచ్చు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా శృంగార సమయాన్ని కలిగి ఉంటారు. మీరు మీ ప్రియురాలి కోసం విలువైన బహుమతిని కూడా కొనుగోలు చేయవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12:50 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. .మీరు ఇప్పటికే అనారోగ్యంతో ఉంటే, నిర్లక్ష్యంగా ఉండకండి. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా నష్టాలు రావొచ్చు. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు ఈ రోజు కొత్త స్టాక్‌లను ప్లాన్ చేయవచ్చు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో కష్టపడాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా మీకు పని ఒత్తిడి పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ ఇంటి సభ్యులతో సంబంధం సామరస్యంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల నుండి ఆప్యాయత మరియు మద్దతు పొందడం ప్రతికూల పరిస్థితులలో కూడా మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు అవివాహితులైతే, మీ వివాహం ఇంట్లో చర్చించబడవచ్చు. అయితే, ఇలాంటి సందర్భాల్లో మీరు తొందరపడాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:55 నుండి సాయంత్రం 6:50 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు వైవాహిక జీవితంలో సంతోషాన్ని పొందుతారు. అయితే ఈరోజు మీ జీవిత భాగస్వామికి ఎలాంటి అబద్ధాలు చెప్పకండి. లేకపోతే మీ సంబంధంలో చీలిక రావచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. ఔషధ వ్యాపారులు ఎక్కువ లాభాలను పొందుతారు. కలప వ్యాపారులు కూడా మంచి ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో రోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : ఉదయం 5:25 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో పరస్పర అనుబంధం పెరుగుతుంది. మరోవైపు, స్నేహితుడితో క్షీణించిన సంబంధంలో ఈ రోజు కొంత మెరుగుదల ఉంటుంది. ఈ రోజు మీరు సానుకూలత మరియు విశ్వాసంతో నిండి ఉంటారు. అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా పని పూర్తవుతుంది. ఉద్యోగులు ఆఫీసులో పని పట్ల చాలా సంతృప్తి చెందుతారు. మీరు అదే వేగంతో మరియు కష్టపడి పనిచేయడం కొనసాగిస్తే, త్వరలో మీరు పురోగమిస్తారు. వ్యాపారులు కూడా లాభం పొందే అవకాశం పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు మీరు చాలా సందర్భాలలో సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు మరియు మీ కోసం, మీరే తీసుకున్న నిర్ణయాలు ఇతరులకన్నా ఎక్కువ ముఖ్యమైనవి. మీ వైవాహిక జీవింలో మీరు నిజమైన ప్రేమను అనుభవిస్తారు. మీరు ఒంటరిగా ఉంటే ఈ రోజు ప్రేమ ప్రతిపాదన వచ్చే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఆర్థిక రంగంలో మంచి రోజు అవుతుంది. ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీ సహోద్యోగులు మరియు కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంచి సమన్వయం కారణంగా, మీ పని సులభం అవుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 37

లక్కీ టైమ్ : ఉదయం 4:25 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope February 24, 2021

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published: Wednesday, February 24, 2021, 5:00 [IST]