For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (26-02-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope February 26, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...ఈ 5 రాశి చక్రాల వారికి జోడి ఎప్పటికీ కుదరదని

ఈ 5 రాశుల వారికి జోడి ఎప్పటికీ కుదరదని తెలుసా...!ఈ 5 రాశుల వారికి జోడి ఎప్పటికీ కుదరదని తెలుసా...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు. మీరు ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచిస్తుంటే, మీ ప్రయత్నాలన్నీ విఫలం అవ్వొచ్చు. ఇది మిమ్మల్ని చాలా నిరాశకు గురి చేస్తుంది. ఆర్థిక లావాదేవీల పట్ల ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ భాగస్వాములు ఓ విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. వివాహితులు తమ వివాహ జీవితంలో ఆనందం మరియు శాంతిని కాపాడుకోవడానికి ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోవాలి. ప్రతి విషయంలో మీ ఇద్దరి మధ్య ఉన్న వివాదం కారణంగా మీ సంబంధం బలహీనపడుతోంది. అధిక ఒత్తిడి వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం ఉండొచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఈ రోజు మీరు పరిష్కరించాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. విద్యార్థులకు కూడా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. మీరు చదువును అశ్రద్ధ చేయవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 37

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి. ఇందుకోసం తగినంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. ఈరోజు కుటుంబ జీవితం బాగుంటుంది. వివాహిత జంటలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతో ప్రేమతో చూస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు చాలా బాగా ఉంటుంది. ఈరోజు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు మీ పనిపై శ్రద్ధ పెట్టాలి. కోర్టు కేసుల వంటి వాటిలో ఈరోజు విజయం సాధించవచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి ఉదయం 11:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో కలిసి మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి ఆనందిస్తారు. ఈ రోజు మీరు మీ భాగస్వామికి బహుమతి కూడా ఇవ్వవచ్చు. అయితే, ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు పెరుగుతున్నట్లు అనిపిస్తాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉండదు. పని విషయంలోనూ ఈరోజు బిజీగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

2020లో ఓ రాశి వారికి రెండు లక్కీ డేస్... మిగిలిన రాశులకు అదృష్ట రోజు ఎప్పుడంటే...2020లో ఓ రాశి వారికి రెండు లక్కీ డేస్... మిగిలిన రాశులకు అదృష్ట రోజు ఎప్పుడంటే...

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో ఈరోజు ప్రేమ జీవితానికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీరు మీ భాగస్వామిని కలుసుకుని ఎక్కువగా ఆనందిస్తారు. పని విషయంలో ఈరోజు మీకు నిరాశ ఎదురవ్వచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు లక్కీ కలిసి వస్తుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఇబ్బందుల్లో ఉన్నట్టు అనిపిస్తే, మీరు మీ ప్రియమైన వారి సహాయం తీసుకోవాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకులైన పరిస్థితులు ఎదురవుతాయి. సమయానికి డబ్బు రాకపోవడంతో మీపై ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. వివాహితులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీకు ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీరు మీ భాగస్వామిని ప్రేమతో ఒప్పించడానికి ప్రయత్నించాలి. మీ ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

ప్రేమ జాతకం ఫిబ్రవరి 2020 : ఈ 2 రాశుల వారు ప్రేమలో మునిగి తేలుతారట! మీ రాశి కూడా ఉందేమో చూడండి...ప్రేమ జాతకం ఫిబ్రవరి 2020 : ఈ 2 రాశుల వారు ప్రేమలో మునిగి తేలుతారట! మీ రాశి కూడా ఉందేమో చూడండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు తమ పనిలో వేగం పెంచుకోవాలి. ముఖ్యమైన పనులు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనాలు చేకూరతాయి. మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మీరు లాభం పొందవచ్చు. ప్రేమ విషయంలో ఈరోజు జంటలకు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. అదనపు డబ్బు సంపాదించేందుకు మీరు అనేక ప్రయత్నాలు చేస్తారు. అందులో విజయం సాధిస్తారు. అయితే మీరు మనస్సు పెట్టి పని చేయాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు వారి రంగంలో ప్రతిభను చాటుకునే అవకాశాన్ని పొందవచ్చు. పనిలో ఉండే వారికి ఈరోజు గొప్ప రోజు అవుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు కొంత మెరుగుదల ఉంటుంది. ఈరోజు కొన్ని ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. విద్యార్థులకు ఈరోజు చాలా గొప్పగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు చాలా గొప్ప విజయాన్ని సాధిస్తారు. ప్రేమ విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 4:40 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అయితే మీరు ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి. దీని వల్ల మీరు చాలా చురుకుగా ఉంటారు. కుటుంబ పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈరోజు కొన్ని శుభవార్తలు కూడా వింటారు. దీని వల్ల మీ ఇంటి వాతావరణం మరింత మెరుగవుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటుంది. ఆర్థిక పరంగా కొంత మెరుగుదల ఉంటుంది. కొన్ని లాభాలు కూడా రావచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో చాలా బిజీగా ఉంటారు. వ్యాపారస్తులు ఈరోజు అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వివాహితులకు ఈరోజు ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు మీ శక్తిని సరిగ్గా వినియోగించుకోవాలి. ఏ విషయమైన కష్టపడి అధ్యయనం చేయాలి. అప్పుడే మీకు కావాల్సిన ఫలితం లభిస్తుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీ ఆర్థిక ప్రయత్నాలు విఫలం కావచ్చు. ఈరోజు మీకు మంచి లాభం లభించే అవకాశం ఉండొచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మంచి రోజు గడుపుతారు. మీ భాగస్వామి ప్రేమ మరియు సహకారం క్లిష్ట పరిస్థితులలో కూడా మీకు ఉపశమనం కలిగిస్తుంది. కుటుంబ జీవితంలో ఈరోజు అంతా సాధారణంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఈరోజు అకస్మాత్తుగా ప్రయాణించాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 10:10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి సరిగ్గా ఉండదు.మీరు వారి నుండి ఊహించిన మద్దతును పొందలేకపోవచ్చు. ఇది వారి కోపానికి కారణం కావచ్చు. పని విషయంలో మీ శక్తి, సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. ఇది మీకు మానసికంగా మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈ రోజు మీరు శత్రువు వైపు ఆధిపత్యం చెలాయిస్తారు. మీ ప్రత్యర్థులు ఓడిపోతారు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తే మీరు ఎలాంటి ఆర్థిక సమస్యను ఎదుర్కోరు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

English summary

Daily Horoscope February 26, 2020

Read your daily horoscope to get all the information related to your fate today. Let's see what the stars have in store for you.
Story first published:Tuesday, February 25, 2020, 18:16 [IST]
Desktop Bottom Promotion