బుధవారం మీ రాశిఫలాలు (01-01-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ధనుర్మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. వివాహితులకు జీవిత సమస్యలు ఈ రోజు పరిష్కరించబడినట్లు అనిపిస్తాయి. మీ జీవిత భాగస్వామి పాత విషయాల గురించి మరచిపోయి మీతో మంచిగా ప్రవర్తిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించిన విధంగా డబ్బు అందుతుంది. ఈ రోజు ఆఫీసులో అనవసరంగా ఎవరితోనైనా వివాదం పెట్టుకోవద్దు.

అలాంటి పరిస్థితులను నివారించడానికి మీ పనిపై దృష్టి పెట్టాలి. కోర్టు కేసులో మీరు విజయం సాధించొచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం12:45 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు పెద్ద ఇబ్బందుల్లోపడే అవకాశముంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ ఆర్థిక పరిస్థితి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయం బాగుంటుంది. కొత్త ఆదాయ వనరులను పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సహాయంతో పెండింగులో ఉన్న పనిని పూర్తి చేయడంలో విజయవంతమవుతారు. కార్యాలయంలో మీ ఉన్నతాధికారులు ఇచ్చిన బాధ్యతలను నిజాయితీగా నెరవేర్చడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీ తండ్రి ఆరోగ్యం క్షీణించవచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి సాయంత్రం 6:45 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరగడం వల్ల కొంత ఇబ్బంది పడతారు. అలాగే మీరు ఊహించిన విధంగా డబ్బు రాకపోవడం వల్ల మీపై ఒత్తిడి పెరుగుతుంది. ఈరోజు వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. మీరు మీ తెలివితేటలతో కొన్ని సమస్యలను పరిష్కరించగలుగుతారు. మీ వైవాహిక జీవితం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :16

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో తొందరపాటులో ఏదైనా పెద్ద తప్పు చేసే అవకాశం ఉంది. మీరు మీ పనిలో విజయం సాధించాలంటే మీరు మరింత కష్టపడాలి. ఈరోజు ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఈరోజు మీ మాటలను ఆలోచనాత్మకంగా ఉపయోగించుకోండి. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ :32

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి. ముందుగా పనిపై దృష్టి పెట్టండి. విద్యార్థులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీకు గందరగోళంగా అనిపిస్తే కాసేపు స్నేహితులతో సరాదాగా గడపండి. అలాగే ధ్యానం చేయండి. దీని వల్ల మీకు కచ్చితంగా ప్రయోజనం లభిస్తుంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కాబట్టి మీరు విపరీతంగా ఖర్చు చేయకపోవడమే మంచిది. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8:45 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు ఈరోజు అన్ని పనులను పూర్తి ఉత్సాహంతో పూర్తి చేస్తారు. మీ సానుకూల ఆలోచనలే మీరు ముందుకు సాగడానికి సహాయపడుతుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల సహాయంతో కొన్ని మంచి ఫలితాలను సాధించవచ్చు. ఈరోజు వ్యాపారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంతో సంబంధాలు మెరుగుపడటంతో ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో సమయం గడపడం ద్వారా మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ :13

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో వేగం పెంచుకోవాలి. ముఖ్యంగా నిరుద్యోగులు చాలా జాగ్రత్తగా పనులు పూర్తి చేయాలి. ఈరోజు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మీరు లాభం పొందవచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి యొక్క అజాగ్రత్త వైఖరి మీకు భంగం కలిగించవచ్చు. ప్రేమలో ఉన్న జంటలకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు అదనపు డబ్బు సంపాదించగలుగుతారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :20

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి మధ్యాహ్నం 11:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు మీరు తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇది మిమ్మల్ని చురుకుగా ఉండేలా చేస్తుంది. ఈరోజు కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఇది మీ ఇంటి వాతావరణాన్ని మరింత మెరుగ్గా చేస్తుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం మరియు ఇతర కుటుంబాల ప్రేమను పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో కొంత మెరుగుదల ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :14

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 7:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కార్యాలయంలో మీ ఉన్నతాధికారుల ముందు బాగా నడుచుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మీ చిన్న అజాగ్రత్త పెద్ద ఇబ్బందిని కలిగిస్తుంది. వ్యాపారస్తులు కూడా ఆర్థిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు రుణాలు ఇవ్వడం మానుకోవాలి. వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి శృంగార భరితంగా ఉంటుంది. మీరు ఒకరితో ఒకరు కలవడం ద్వారా ఈరోజు అద్భుతంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ :9

లక్కీ టైమ్ : ఉదయం 4:40 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు సానుకూల ఆలోచనలతో ఉంటారు. ఆర్థిక రంగంలో ఈరోజు మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు కుటుంబంతో గడపడానికి మీరు విహారయాత్రకు కూడా వెళ్ళవచ్చు. వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి సాధారణంగా ఉంటుంది. ప్రేమ గల జంటలకు ఈ రోజు శృంగార భరితంగా ఉంటుంది. మరోవైపు ఈ రోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. లేకపోతే మీరు పెద్ద నష్టాన్ని చవిచూడవచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :9

లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు మంచి పనితీరు కనబరుస్తారు. వ్యాపారస్తులకు ఈరోజు పెద్ద లాభం రావచ్చు. కోర్టు కేసులో పరిష్కారం లభించడం ద్వారా మీకు గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఈరోజు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. వివాహ జీవితంలోనూ ఈరోజు గొప్పగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం మరియు ప్రేమ మీ సంబంధాన్ని మిమ్మల్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ రోజు, పిల్లలతో సమయం గడపడం ద్వారా, మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. ఈరోజు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ :22

లక్కీ టైమ్ : సాయంత్రం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు మీ పనిలో విజయం సాధించాలంటే మీరు మీ మనసులో ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టేయ్యాలి. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారస్తులు లేదా ఉద్యోగస్తులు ఈరోజు అంకితభావంతో పని చేస్తారు. ఇది మీకు ఆశించిన ఫలితాన్ని ఇస్తుంది. మీరు మీ వైవాహిక జీవితంలో ప్రేమను తిరిగి పొందాలంటే, మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపండి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ :21

లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి సాయంత్రం 6:45 గంటల వరకు

Desktop Bottom Promotion