ఆదివారం మీ రాశిఫలాలు (12-01-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, పుష్యమాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు మంచి అనుభూతిని పొందుతారు. మీ వైవాహిక జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆందోళన నుండి బయటపడేస్తుంది. నిరుద్యోగులకు ఈరోజు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించాలి. దీని వల్ల మీరు సంతోషంగా ఉంటారు. వ్యక్తిగత జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి మీరు తెలివిగా, నిజాయితీ పని చేయాలి. ఆరోగ్యం పట్ల అస్సలు నిర్లక్ష్యం చేయరాదు. పని విషయంలో సాధారణంగా ఉంటుంది. వ్యాపారం కోసం ఈరోజు ఏదైనా ప్రయాణం చేస్తే మీకు తగిన ఫలితం లభిస్తుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. మీ భాగస్వామి పట్ల కొంచెం సున్నితంగా ఉండండి. దీని వల్ల పరిస్థితి అదుపులో ఉంటుంది. పని విషయంలో కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు తెలివిగా పనిచేస్తే, ఈరోజు మీ సీనియర్ల నుండి మద్దతును పొందుతారు. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఆలోచించి ఖర్చులు చేయండి. ఆరోగ్య విషయానికొస్తే, ఈరోజు అలసటగా అనిపిస్తుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి రాత్రి 9:40 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు బాగా కష్టపడాలి. మీ పెద్దలు మరియు ఉపాధ్యాయుల సహాయం కూడా తీసుకోవచ్చు. మీరు ఆరోగ్యం పరంగా మంచిగా అనుభూతి చెందారు. మీ పనులన్నింటినీ ఉత్సాహంగా పూర్తి చేస్తారు. భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు అదనపు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు. మీ వ్యక్తిగత సంబంధాలలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ వివాహ జీవితం ఆనందంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి రాత్రి 7:20 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు అద్భుతంగా గడుపుతారు. మీరు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. అయినా స్నేహితుల కోసం సమయం కేటాయిస్తారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి, మీరు ఈరోజు ఇంటి పనులను కూడా చేస్తారు. ఈరోజు ప్రేమలో ఉన్న వారికి శృంగారపరంగా అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 5:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబం విషయంలో కొన్ని గొడవలు ఉండొచ్చు. ఈరోజు ఇంటి వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది. మీరు విభేదిస్తున్నవారితో ఈరోజు మాట్లాడకపోవడమే మంచిది. పని విషయంలో ఒడిదుడుకులు ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. ఆరోగ్యంపైనా మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది. ఈ రోజు మీకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా మీరు కొత్త ఆదాయ వనరులను కూడా పొందవచ్చు. పనిలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు ఈరోజు బిజీగా ఉండటం వల్ల మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేరు.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : రాత్రి 7:30 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల పట్ల ఆందోళన చెందుతారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఈరోజు ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు కూడా ఈరోజు కఠినంగా ఉంటుంది. అయితే మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. అలాగే, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ ఉంటుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీరు కూడా విశ్రాంతి తీసుకోవాలి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 8:20 నుండి మధ్యాహ్నం 3:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు వారి వ్యక్తిగత పరిస్థితులు దిగజారే అవకాశం ఉంది. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. పని విషయంలో ఈరోజు అవకాశాలు మరియు సవాళ్లతో నిండి ఉంటుంది. వ్యాపారవేత్తలు ఈరోజు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. మీ భాగస్వామిని అతిగా నమ్మి మోసపోవద్దు. మీ ఆరోగ్యం క్షీణించడం వల్ల కొంచెం ఆందోళన చెందుతారు.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఓ ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. దీని వల్ల మీ విశ్వాసం పెరుగుతుంది. మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు వ్యాపారవేత్తలకు కొంత ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యుల నుండి ఈరోజు మద్దతు పొందలేకపోతారు. దీంతో నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థి సాధారణంగా ఉంటుంది. అయితే మీ ఖర్చులపై శ్రద్ధ చూపడం మంచిది. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఉంటాయి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. మీరు ఎక్కువగా ఒత్తిడి తీసుకోకుండా.. విశ్రాంతి తీసుకోండి. పని విషయంలో మీరు కష్టపడాలి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతును పొందుతారు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 8:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా అనుకూలగా ఉంటుంది. మీరు ఈరోజు భారీ లాభం పొందే అవకాశం ఉంది. మీ ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రులు ఈ రోజు మీతో చాలా సంతోషంగా ఉంటారు. అయితే ప్రేమ విషయంలో మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వివాదస్పద అంశాలపై మీ ప్రియుడు లేదా ప్రియురాలితో మాట్లాడకండి. ఆరోగ్యంగా ఉండేందుకు మీ దినచర్యను మార్చుకోవాలి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

Story first published: Sunday, January 12, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion