సోమవారం మీ రాశిఫలాలు (13-01-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, పుష్యమాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొంత విభేదాలు రావచ్చు. ఈ పరిస్థితి మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది. దీంతో ఒత్తిడి పెరిగి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే మీ కోసం కొంత సమయం కేటాయించి విశ్రాంతి తీసుకోండి. కుటుంబసభ్యులతో కొన్ని సైద్ధాంతిక విభేదాలు ఉండే అవకాశం ఉంది. మీరు మీ మనసుతో ఆలోచించి పని చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు వివాహం విషయంలో శుభవార్త వస్తుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం అందమైన మలుపు తీసుకుంటుంది. ఈ రోజు మీరు జీవిత భాగస్వామి యొక్క శృంగార శైలిని చూసి చాలా ఆశ్చర్యపోతారు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. దీని వల్ల మీరు కొంత బలహీనం అవుతారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకలు ఉంటాయి. పరిస్థితి మరింత దిగజారకుండా మీరు ఓపికగా పని చేయాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఇది మీకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:25 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు శక్తివంతంగా ఉండటం వల్ల మంచి అనుభూతి చెందుతారు. కుటుంబంతో ఈరోజు సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా లాభదాయకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది మరియు మీ ప్రేమ కూడా పెరుగుతుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 32

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. ఈ విషయాన్నే ముందే పసిగట్టే ప్రయత్నంచేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు చేస్తారు. పనిలో మీ సీనియర్ల సలహాలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : రాత్రి 7:30 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ఓ విషయంలో నిర్ణయం తొందరపడి తీసుకోకూడదు. ఎందుకంటే దీని ప్రభావం భవిష్యత్తులో ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అప్పులను కూడా ఈరోజు చెల్లించగలరు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో చాలా ప్రశాంతమైన రోజు గడుపుతారు. కానీ మీ జీవిత భాగస్వామితో సంభాషణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ఇల్లు లేదా కార్యాలయంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ కుటుంబం ఓ విషయం గురించి మీపై కోపంగా ఉంటుంది. అయితే మీ జీవిత భాగస్వామి మీకు పూర్తి మద్దతు ఇస్తుంది.ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ రోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీ దీర్ఘకాలిక అధ్యయనాలను వ్రాయడంలో ఏవైనా అడ్డంకులను తొలగించడం ద్వారా మీరు ముందుకు సాగడానికి పెద్ద అవకాశాన్ని పొందవచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 7:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పనికి సంబంధించి ప్రయాణించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. పాత అప్పులు మీపై ఒత్తిడిని పెంచుతాయి. కుటుంబ జీవితంపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. ఆరోగ్యం పరంగా ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో అనుకూలత ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ప్రశాంతమైన రోజు గడపగలుగుతారు. పని విషయంలో అనవసరమైన వాదనలు పెంచుకోవద్దు. వ్యాపారులు ఈరోజు కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ భావాలను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు మీ ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. ఈ రోజు ప్రేమ విషయంలో శృంగారభరితంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ భాగస్వామితో చిరస్మరణీయ సమయాన్ని గడుపుతారు. మీరు ఆరోగ్యంగా ఉంటారు.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నంలో ఈరోజు మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఈరోజు మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు కార్యాలయంలో ఉన్నతాధికారుల ప్రతికూల ప్రవర్తన మిమ్మల్ని బాధపెడుతుంది. కొంత పొరపాటు వల్ల వారు మీపై అసంతృప్తిగా ఉండవచ్చు. ఈ రోజు ప్రేమ జీవితంలో ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి, మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. దీని వల్ల మీపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ రోజు ఎలాంటి ఆర్థిక సమస్య ఉండదు. ఈ రోజు మీరు మీ వినోదం కోసం కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. జీవిత భాగస్వామి ప్రవర్తనలో కొన్ని పెద్ద మార్పులు ఉంటాయి. ఈ రోజు కూడా మీరు మీ కుటుంబంతో కొంత సమయం గడపవచ్చు. ఈ రోజు మీరు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరంగా, మానసికంగా చాలా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

Story first published: Monday, January 13, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion