Latest Updates
-
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం!
మంగళవారం మీ రాశిఫలాలు (14-01-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, పుష్యమాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. చాలా కాలం తరువాత, మీ ప్రియమైనవారి మధ్య ఇలా గడపడం ద్వారా మీ ఒత్తిడి బాగా తగ్గుతుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం సామరస్యంగా ఉంటుంది. అయితే మీ పని విషయంలో మీ మనసులో గందరగోళం ఉంటుంది. ఆర్థిక పరంగా సంతృప్తికరంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో వ్యాపారవేత్తలు ఈ రోజు మీరు పెద్ద ప్రాజెక్టును పొందవచ్చు. ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలు మీ మనసులోకి వస్తాయి. మీరు కష్టపడి పనిచేయడం మంచిది. మీ ఆలోచనను సానుకూలంగా ఉంచండి. ఈ రోజు మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో విజయం సాధించవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ మరియు అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులలో సైద్ధాంతిక భేదాలు మరియు అపార్థాలు ఉండవచ్చు. కొంతకాలం ప్రశాంతంగా ఉండాలి. మీ పని విషయంలో మీ ఉన్నతాధికారులు కూడా మీతో సంతోషంగా ఉంటారు. మీరు వ్యాపారం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. మీ వివాహ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. ప్రేమ విషయంలో ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు నిరంతరం చేస్తున్న ముఖ్యమైన పనిలో మీకు విజయం లభిస్తుంది. దీని కారణంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఈరోజు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా వ్యాపారవేత్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 34
లక్కీ టైమ్ : సాయంత్రం 6:40 నుండి రాత్రి 8:25 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారు ఈరోజు డబ్బులను ఆచితూచి ఖర్చు చేయాలి. మీ స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో సమయాన్ని గడపండి. కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా గొప్ప ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు పని విషయంలో చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే మీరు కొంత సమయం వేచి ఉండాలి. ఈ సమయంలో మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రోజు వ్యాపారవేత్తలకు సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:45 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22
ఈ రాశి వారిలో వ్యాపారవేత్తలకు ఈరోజు ముఖ్యమైన రోజు. కొత్త ప్రతిపాదన మీ వద్దకు రావడంతో అది మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. అన్ని అంశాలను బాగా అర్థం చేసుకోండి. ఆపై ఒక అడుగు ముందుకు వేయండి. ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రత్యర్థులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మంచి రోజు.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 8:55 నుండి మధ్యాహ్నం 2:20 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈ రోజు భావోద్వేగానికి లోనవుతారు. చిన్న విషయాలు కూడా ఈ రోజు మిమ్మల్ని బాధపెడతాయి. అటువంటి పరిస్థితిలో, మీ భావోద్వేగాలను నియంత్రించడానికి ప్రయత్నించాలి. వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్దలు రావచ్చు. మీ జీవిత భాగస్వామి మీ ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎక్కువ ఖర్చులు చేయడానికి మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ పొదుపుపై దృష్టి పెట్టాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:05 నుండి రాత్రి 9:40 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం బలహీనపడొచ్చు. పెరుగుతున్న ఒత్తిడి కూడా మీ
ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. మీరు మరింత చింతించటం మానేయడం మంచిది. పని విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ సహోద్యోగులతో ప్రతికూలంగా వ్యవహరించడం మానుకోండి. వ్యాపారవేత్తలకు కొన్ని తగాదాలు వచ్చే అవకాశం ఉన్నందున, మీరు ప్రశాంతంగా ఉండటం మంచిది. మీ వ్యక్తిగత జీవితం సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 11 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ వ్యక్తిగత జీవితంలో సంతృప్తి చెందుతారు. మీరు మీ వివాహ జీవితంలో ప్రశాంతంగా ఉండాలనుకుంటే, మీ జీవిత భాగస్వామికి దేని గురించి ఒత్తిడి చేయొద్దు. చిన్న విషయాలను పట్టించుకోకండి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయ వృద్ధిలో కూడా పెరుగుదల ఉంటుంది. అందువల్ల, ఈ రోజు మీరు మీ కోసం చాలా ఎక్కువ ఖర్చు చేయవచ్చు.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 27
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈ రోజు గొప్ప రోజు అవుతుంది ఎందుకంటే ఈ రోజు మీరు మీలో వేరే ఉత్సాహాన్ని మరియు శక్తిని అనుభవిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలపై మీ విశ్వాసం బలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి అవకాశాలను పొందుతారు. మీ భాగస్వామి ముఖంలో మీరు ఎప్పుడూ చూడాలనుకున్న ఆనందాన్ని తప్పకుండా చూస్తారు. మీరు శారీరక సమస్యతో బాధపడుతుంటే మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు.
లక్కీ కలర్ : లైట్ ఎల్లో
లక్కీ నంబర్ : 34
లక్కీ టైమ్ : ఉదయం 5:25 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు అనవసరంగా కోపం తెచ్చుకుంటారు. దీనివల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు దూరమయ్యే అవకాశం ఉంది.పని ఒత్తిడి మిమ్మల్ని చికాకుపెడుతుంటే, కొన్ని రోజులు పనిని పక్కన పెట్టండి. మీ వ్యక్తిగత జీవిత విషయానికొస్తే మీకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 7:50 నుండి రాత్రి 8:18 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు నిరుపేదలకు నిస్వార్థంగా సహాయం చేస్తారు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ కుటుంబ సభ్యుల మద్దతు మరియు ఆప్యాయతతో మీరు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. మీరు ఈ రోజు మానసికంగా మరియు శారీరకంగా మంచి అనుభూతి చెందుతారు. ఇది ఈ రోజు మీ పనిపై కూడా ప్రభావం చూపుతుంది. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసించబడుతుంది. మరోవైపు మీ వ్యాపార ప్రణాళికలు అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తున్నందున వ్యాపారవేత్తలకు ఈ రోజు చాలా లాభం వస్తుంది. ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 40
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు



Click it and Unblock the Notifications











