ఆదివారం మీ రాశిఫలాలు (19-01-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, పుష్యమాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు పనిలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే మీరు మీ పనిలో మరింత కష్టపడాలి. ఆర్థికంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పెట్టుబడులు పెట్టడానికి ముందు అన్ని రకాల సమాచారాన్నిసేకరించండి. ఈరోజు మీ ప్రతికూల వైఖరి మీ ప్రియమైన వారిని అసంతృప్తికి గురి చేస్తుంది. మీకు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభించదు. ఆరోగ్య పరంగా అంతా బాగుంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో సహోద్యోగుల నుండి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు ఈరోజు కొంత డబ్బును ఆదా చేయగలుగుతారు. మీ శృంగార జీవితం కూడా చాలా బాగుంటుంది. మీ భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా లాభం వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ యజమాని మీ పని వల్ల సంతోషంగా ఉంటారు. ఈ రోజు వివాహిత జంటలకు చాలా శృంగారభరితంగా ఉంటుంది. మీరు ఈరోజు ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యంగా మీకు బాగా తెలిసిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశముంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 6:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు ఈరోజు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మీరు వ్యాయామం చేయాలి. అలాగే, మీరు జిడ్డుగల లేదా కారంగా ఉండే ఆహారాన్ని మానుకోవాలి. ఈ రోజు మీరు వ్యాపార విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ పోటీదారుల కార్యకలాపాలపై నిఘా ఉంచండి. ఈ రోజు ఉపాధి ప్రజలకు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వివాహిత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో కష్టపడాల్సి ఉంటుంది. మీరు మీ పనిని సమయానికి పూర్తి బాధ్యతతో చేయాలి. దీని వల్ల భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఈ రోజు వివాహ జీవితంలో సాధారణంగా ఉంటుంది. కానీ ఈ రోజు మీ ప్రేమ జీవితంలో కొంత సమస్య ఉండవచ్చు. ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీ వివాహ జీవితంలో కలహాలు ఉంటాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు పెద్ద పోరాటం ఉండవచ్చు. పరస్పర అవగాహన లేకపోవడం మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ఈ రోజు మీరు మీ తల్లి ఆశీర్వాదం పొందుతారు. ఈ రోజు ఆమె మీతో కొన్ని ముఖ్యమైన విషయంపై మాట్లాడవచ్చు. పనిలో కొంత ఒత్తిడి ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 42

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది.ఈరోజు మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ప్రేమ విషయంలో ఈ రోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. మీరు ప్రతి విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయరాదు. కొన్ని కారణాల వల్ల ఆఫీసులో కొన్ని ముఖ్యమైన పనులు ఈ రోజు పూర్తి కావు. ఇది మీ ఒత్తిడిని పెంచుతుంది. ఆర్థిక పరంగా అనుకూంటా ఉంటుంది. మీకు కొత్త ఆదాయ వనరు లభిస్తుంది. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : ఉదయం 7:05 నుండి మధ్యాహ్నం 12:10 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉన్నతాధికారుల సహకారం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఇది మీ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అకస్మికంగా భారీ లాభాలను పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ రోజు మీ వివాహ జీవితంలో కొంత సమస్య ఉండవచ్చు. ఆరోగ్యం మెరుగుపడటంతో మీరు పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:15 నుండి రాత్రి 9:35 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్య పరంగా కొన్నిసమస్యలు ఉండొచ్చు. ఈ కారణంగా మీరు పనిలో కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు తేలికపాటి వ్యాయామం చేయాలి. తగిన విశ్రాంతి తీసుకోవాలి. ఈ రోజు మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. మీ ప్రియమైనవారిని సఖ్యతగా చూసుకోవడం మంచిది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గోల్డ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 7:25 నుండి మధ్యాహ్నం 12:40 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. కొంత ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. అయితే మీ పని విషయంలో మీరు ఈరోజు సంతృప్తి చెందుతారు. మరోవైపు ఇంటి వాతావరణం బాగుంటుంది. కుటుంబంతో గడపడం ద్వారా మీకు మానసిక శాంతి లభిస్తుంది. ఈ రోజు మీరు కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడటంతో మీరు మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 44

లక్కీ టైమ్ : సాయంత్రం 4:20 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఖర్చులు పెరగొచ్చు. ఆర్థిక సంబంధిత విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీరు లాభాలను పొందవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. సమయానికి భోజనం చేయండి. మీ పట్ల జీవిత భాగస్వామి నిర్లక్ష్యం మీ మధ్య దూరాన్ని పెంచుతుంది. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తోబుట్టువులతో మీ సంబంధాలు కూడా స్నేహపూర్వకంగా ఉంటాయి. విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:05 నుండి రాత్రి 8 గంటల వరకు

Desktop Bottom Promotion