Latest Updates
-
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం!
మంగళవారం మీ రాశిఫలాలు (21-01-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, పుష్యమాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు.అయితే ప్రేమలో ఉన్నవారికి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు సులభంగా డబ్బు సంపాదించగలుగుతారు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది. మీరు సానుకూల శక్తితో ఉంటారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. మీ జీతం పెరగడానికి బలమైన అవకాశం ఉంది. వివాహితులకు ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. వీరు భావోద్వేగ మద్దతును కూడా పొందుతారు. ఆరోగ్యం బాగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:40 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. వీటి వల్ల మీ పనులన్నీ పెండింగులో పడిపోతాయి. పనిలో కూడా ప్రతికూలంగా ఉంటుంది. పెరుగుతున్న మానసిక ఒత్తిడి కారణంగా, మీరు పనిపై దృష్టి పెట్టలేరు. ఈ రోజు మీరు మీ తండ్రితో సైద్ధాంతిక విభేదాలు కలిగి ఉండవచ్చు. ఇది ఇంట్లో అశాంతిని కలిగిస్తుంది. అయితే మీ జీవిత భాగస్వామి మీకు పూర్తి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : ఉదయం 5:30 నుండి సాయంత్రం 3 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు చాలా రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. వివాహ జీవితంలో గతంలో లాగా ప్రేమను అనుభవిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల కూడా ఉండొచ్చు. మీరు ఏదైనా పెద్ద లావాదేవీలను చేయవచ్చు. ఈరోజు మీ పనిని వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు తేలికపాటి వ్యాయామం చేయాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీకు నచ్చిన ప్రదేశంలో మీరు మీ భాగస్వామితో శృంగార సమయాన్ని గడుపుతారు. మరోవైపు ఈ రోజు కార్యాలయంలో మీ యజమాని మీ కృషిని అభినందిస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 36
లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 11 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. మీరు వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. మీ జీవిత భాగస్వామి మీ సమస్యలను అర్థం చేసుకుంటారు. మీ తరపున పూర్తి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మరోవైపు, మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా పొందుతారు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు పొదుపుపై ఎక్కువ దృష్టి పెడతారు. కుటుంబంలో శాంతి వాతావరణం ఉంటుంది. మీ ప్రియమైనవారిలో ఐక్యతను చూస్తే మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు విద్యార్థులకు చాలా పవిత్రమైన రోజు. మీరు కొన్ని గొప్ప విజయాలను పొందవచ్చు. ఇది మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది. మీ ధైర్యాన్ని కూడా పెంచుతుంది. ప్రేమ విషయంలో ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండండి.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి రాత్రి 9:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి సన్నద్ధమవుతుంటే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంది. మీ ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. కుటుంబసభ్యులలో ఐక్యత మరియ ప్రేమ ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి కూడా మారుతుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి రాత్రి 7:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు కొంత ఒత్తిడిగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో సహోద్యోగులతో గొడవ పడొచ్చు. ఇలాంటి సమయంలో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి. ఈ రోజు వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి కార్యకలాపాలపై నిఘా ఉంచండి. ఆర్థిక రంగంలో ఈ రోజు బాగానే ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంబంధంలో అనుకూలంగా ఉంటుంది. తొందరపడి ఏ పనీ చేయకండి.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 13
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:15 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో కొంచెం కష్టంగా ఉంటుంది. వివాహ జీవితంలో కలహాలు ఉంటాయి. జీవిత భాగస్వామి నుండి తేడాలు లోతుగా ఉంటాయి. ఇది మిమ్మల్ని చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. మీ కోపాన్ని మీరిద్దరూ నియంత్రించాలి. కార్యాలయంలో జరుగుతున్న రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ పనిపై దృష్టి పెట్టండి. ఈ రోజు మత మరియు ఆధ్యాత్మిక పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు మీరు ఏదైనా మత ప్రదేశానికి వెళ్ళవచ్చు.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి రాత్రి 11:50 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో అద్భుతంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. నిరంతర పని కారణంగా, ఈ రోజు మీరు వెన్నునొప్పితో బాధపడతారు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1:50 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు ఏదైనా విషయంలో కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెట్టకూడదు.ఆర్థిక పరిస్థితి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అయితే పనిలో మాత్రం ఈరోజు పవిత్రంగా ఉంటుది. మీ సామర్థ్యం పట్ల మీకు విశ్వాసం పెరుగుతుంది. వ్యాపారులు ఊహించిన విధంగా లాభాలను పొందుతారు. మీ వివాహ జీవితం ఆసక్తికరంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి 11:30 గంటల వరకు



Click it and Unblock the Notifications











