For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (29-01-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈరోజు ఏవైనా ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీరు మీ అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మీ వివాహ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమపూర్వక రోజును గడుపుతారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలోనూ అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్: బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈ రోజు మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. దీని వల్ల మీ ఇంట్లో ప్రశాంతతకు భంగం కలుగుతుంది. వీటి నుండి డైవర్ట్ అయ్యేందుకు మీ స్నేహితులతో కొంత సమయం గడపండి. ఆర్థిక పరంగా ఈ రోజు కొంత మెరుగుదల ఉంటుంది. ప్రేమ మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని శాసిస్తుంది. ఈ రోజు మీకు మీ భాగస్వామితో కొన్ని సంతోషకరమైన క్షణాలు గడపడానికి అవకాశం లభిస్తుంది.

లక్కీ కలర్: పసుపు

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీ పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీ విశ్వాసం పెరుగుతుంది. మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు. పని విషయంలో మీరు చాలా కష్టపడతారు. ఉద్యోగస్తులకు లేదా వ్యాపారులకు ఈరోజు మీకు మంచి విజయం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ రోజు ఏదైనా విలువైన వస్తువు కోసం కూడా షాపింగ్ చేయవచ్చు. పెళ్లి కాని వారికి ఈరోజు వివాహ ప్రతిపాదన రావచ్చు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 5:20 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ కుటుంబంలో కొందరి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. కానీ మీ నిరంతర ప్రయత్నాల వల్ల ఈ రోజు వాతావరణం కొంత బాగుంటుంది. ఈరోజు పనిలో బాగా ఉంటుంది. మీరు మీ సహోద్యోగులతో పనిని వేగవంతం చేయాలి. ఇది వారికి బాగా సహాయపడుతుంది. ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్: ఆరెంజ్

లక్కీ నంబర్ : 43

లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బలహీనపడుతోంది. కాని ఈ రోజు మీకు మంచిది. ఈ రోజు మీరు సానుకూల శక్తితో చుట్టుముట్టబడతారు. మీ పనిని శ్రద్ధగా చేస్తారు. మీరు ఉద్యోగం చేస్తుంటే, ఈరోజు మీ ఉద్యోగంలో కొంత మార్పు ఉంటుంది. మరోవైపు, మీరు ఈ రోజు వ్యాపారంలో పెద్ద లాభం పొందవచ్చు. ఈ రోజు వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్: పర్పుల్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థికంగా పరిస్థితులు మెరుగవుతాయి. మీరు మీ పనిలో మంచి విజయం పొందవచ్చు. పని విషయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఈరోజు కుటుంబ జీవితం కొంత ఆనందంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈరోజు విజయం దక్కుతుంది. ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగి ఉండవచ్చు. ఇది మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది.

లక్కీ కలర్: గ్రీన్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలను పొందవచ్చు. అయితే మీరు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ ఇంట్లో శాంతిని నెలకొల్పడానికి, మీరు కోపం పడకుండా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధం సాధారణంగా ఉంటుంది. మీరు మీ అన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలరు. ఆరోగ్యం పరంగా ఏవైనా సలహాలు ఉంటే, డాక్టర్ ను వెంటనే సంప్రదించండి.

లక్కీ కలర్: రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉంటారు. మీరు ఈరోజు మీ కుటుంబంతో చాలా మంచి సమయం గడుపుతారు. ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు ఈరోజు మీ తెలివితేటలతో అదనపు ఆదాయం సంపాదించగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ప్రేమ మరియు సంబంధం ఉంటుంది. మీరు మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టగలుగుతారు. మీరు ఈరోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే, ఈ రోజు మీకు ఎలాంటి సమస్య ఉండదు.

లక్కీ కలర్: కుంకుమ

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8:25 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. మరోవైపు, మీ ఆందోళన కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుడి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల, మీరు చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. వ్యాపారవేత్తలు ఈరోజు కొంత ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని నిరాశ పరుస్తుంది. అయినప్పటికీ మీరు ఓపిక పట్టాలి. మీరు ప్రయత్నిస్తూ ఉంటే, త్వరలో విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీ భాగస్వామి పాత విషయాలన్నీ మరచిపోయి మీతో వారి సంబంధాన్ని మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తారు.

లక్కీ కలర్: రెడ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో కొందరికి ఈరోజు వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చాలా రిలాక్స్ గా గడుపుతారు. ఈరోజు మీరు చాలా రొమాంటిక్ మూడ్‌లో ఉంటారు. మీ కార్యాలయంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ రోజు అదృష్టవంతులు అవుతారు. మీ పురోగతికి సంబంధించిన శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలంగా ఉంటాయి.

ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలు ఉంటాయి.

లక్కీ కలర్: క్రీమ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా మంచి మానసిక స్థితిలో ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచి ఫలితాలను పొందవచ్చు. ఈరోజు మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో మీకు మంచి బంధం ఉంటుంది. ఈరోజు మీ పని విజయవంతంగా పూర్తవుతుంది. మీ ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది.

లక్కీ కలర్: బ్రౌన్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వివాహ జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ప్రతికూల పరిస్థితుల్లో మీకు మద్దతు ఇస్తుంది. పని విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు వ్యాపారవేత్తలు అదనపు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు రావచ్చు. దీంతో మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఈ రోజు మీరు మీ కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవుతారు.

లక్కీ కలర్: పింక్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

English summary

Daily Horoscope January 29, 2020

For some zodiac signs, there will be a lot of happiness and for others, there will be challenges. Therefore, it is better for you to be ready to face anything that comes your way. Read your daily horoscope to find out what the stars have in store for you.
Desktop Bottom Promotion