Latest Updates
-
స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇంట్లోనే..ఎలాంటి సాస్ లు లేకుండానే అదిరిపోయే వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్.. -
పెసరపప్పు వెజిటేబుల్ ఇడ్లీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కేవలం 15 నిమిషాల్లో రెడీ! -
ఎప్పుడూ అలసిపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ విటమిన్ తగ్గినట్లే..డాక్టర్ చెప్పిన సంచలన నిజం! -
కరకరలాడే కాకరకాయ కాజు ఫ్రై..ఒక్కసారి వండితే రుచి మర్చిపోలేరు..అన్నం, పప్పు, రసంలోకి కేక! -
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే..
శుక్రవారం దినఫలాలు : వృషభరాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, పుష్యమాసం శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Kumbh Mela 2021: సరిగ్గా 83 ఏళ్ల తర్వాత కుంభమేళాలో మళ్లీ ఇప్పుడు అది రిపీట్ అయ్యింది...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితం ఉంటుంది. పని విషయంలో ఈరోజు మీరు మంచి ఫలితాలను పొందొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది లేదా ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో పని చేయడానికి మీకు అవకాశం రావచ్చు. వ్యాపారులకు ఈరోజు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ఇంటి సభ్యులతో సంబంధం మరింత బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అంతా బాగుంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు సానుకూల శక్తితో ఉంటారు. వ్యాపారులకు మరియు ఫైనాన్స్ సంబంధిత వ్యక్తులకు ఈరోజు మంచి ప్రయోజనాలు దక్కొచ్చు. మరోవైపు కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులొస్తాయి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే, రాబోయే రోజుల్లో మీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆర్థిక పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది. ఈరోజు మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తారు. మీ బడ్జెట్ కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. లేకపోతే, భవిష్యత్తులో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ప్రశాంతమైన మనస్సుతో, మీరు మీ పనిని సమయానికి మరియు విజయవంతంగా పూర్తి చేయగలరు. మరోవైపు మీరు మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. మీ కుటుంబ జీవితంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 9:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే నిర్లక్ష్యంగా ఉండకండి. ఏ చిన్న సమస్య వచ్చినా, వెంటనే మంచి వైద్యుడి సలహా తీసుకోవాలి. ఈరోజు ప్రైవేట్ ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. మీకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈరోజు మంచి లాభం తీసుకునేందుకు అవకాశం రావచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామి జీవితంలో తీవ్రత ఉంటుంది. మీరు మీ ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. లేకపోతే మీ ఇంటి శాంతికి భంగం కలుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10:15 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారిలో నిరుద్యోగులకు ఈరోజు కష్టంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మంచి ఫలితాలను పొందొచ్చు. మీరు ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. దీని వల్ల మీరు కొంత ఒత్తిడికి లోనవుతారు. మీరు అనవసరమైన చర్చ యొక్క వాదనలకు, గందరగోళానికి దూరంగా ఉండాలి. ఈరోజు మీకు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు పొదుపుపై దృష్టి పెట్టగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 31
లక్కీ టైమ్ : ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు మానసికంగా చాలా బలంగా ఉంటారు. మీరు సంక్లిష్టమైన పనులను సులభంగా పూర్తి చేయగలరు. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో ఎక్కువ పనిభారం ఉంటుంది. మీరు ఒకేసారి చాలా పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ మీరు మీ పనిని పూర్తి విశ్వాసంతో పూర్తి చేయాలి. వ్యాపారులు తమ ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది. అయితే మీరు రుణాలు ఎవ్వరికీ ఇవ్వకూడదు. మీ ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది. మీరు చాలా రిఫ్రెష్ అవుతారు.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 9:05 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో శుభప్రదంగా ఉంటుంది. మీరు ఏదైనా విషయం గురించి ఆందోళన చెందుతుంటే, మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీంతో మీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టగలుగుతారు. వ్యాపారులకు ఈరోజు ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో మరియు ప్రేమ జీవితంలో మీరు ఒకరితో ఒకరు తగినంత సమయం గడపడానికి కూడా అవకాశం పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచి ఫలితాలు ఉండొచ్చు. ఉద్యోగులకు ఈరోజు పెండింగులో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తే, ఎలాంటి సమస్య ఉండదు. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా చాలా బలంగా ఉంటారు.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ముఖ్యంగా మీరు వ్యాపారంలో ఏదైనా మార్పు గురించి ఆలోచిస్తుంటే, మీరు వ్యాపారం చేస్తే, సమయం దానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీకు వ్యతిరేక నిర్ణయాలు వస్తాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో మీకు మంచి సంబంధం ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు పవిత్రంగా ఉంటుంది. మీరు మీ పనిని కష్టపడి, నిజాయితీతో కొనసాగిస్తే, త్వరలో మీకు ప్రశంసలు లభిస్తాయి. మీరు మీ పనిని కష్టపడి, నిజాయితీతో కొనసాగిస్తే, త్వరలో మీరు పెద్ద పురోగతిని పొందవచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతుంటే మీకు మంచి అవకాశం లభిస్తుంది. మరోవైపు, వ్యాపారులు కూడా ఆశించిన ఫలితాలను పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు గృహ సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. మీరు వారి ఆశీర్వాదం పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : కుంకుమ
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఈరోజు మీ సంబంధాన్ని మెరుగుపర్చడానికి బలమైన అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ ప్రియమైనవారితో గొప్ప సమయాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమపూర్వక ప్రవర్తన మీ ఆనందాన్ని పెంచుతుంది. ఈరోజు ఆర్థిక పరంగా చాలా ఖరీదైనది. ఆలోచించకుండా ఖర్చు చేసే మీ అలవాటు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. మీరు దీన్ని గుర్తుంచుకోండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి రాత్రి 8:45 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు తొందరపాటు మరియు భయాందోళనలను నివారించడానికి ముందుగానే మీ ప్రణాళికలను ముందుగానే తయారు చేసుకోవడం మంచిది. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో చేసే పనుల్లో ఎలాంటి తప్పు చేయకూడదు. మరోవైపు వ్యాపారులు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











