For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kumbh Mela 2021: సరిగ్గా 83 ఏళ్ల తర్వాత కుంభమేళాలో మళ్లీ ఇప్పుడు అది రిపీట్ అయ్యింది...

2021లో కుంభమేళా విశేషాల గురించి తెలుసుకుందాం...

|

మన దేశంలో నిర్వహించే కుంభమేళా ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని పుష్కర కాలాని (12 సంవత్సరాలు)కి ఒకసారి నిర్వహిస్తారు.

Kumbh Mela 2021: Starting and End Date, Time, Places, Maha Kumbh Dates For Ganga Snan or Shahi snan

నాలుగేళ్ల క్రితమే మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, క్రిష్ణా పుష్కరాలు ఘనంగా జరిగాయి. ఇటీవలే మన తెలుగు రాష్ట్రాల్లో తుంగభద్ర పుష్కరాలు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు తాజాగా హరిద్వార్, ప్రయాగ్ రాజ్, ఉజ్జయిని, నాసిక్ లలో జనవరి 14వ తేదీన కుంభమేళా ప్రారంభమైంది.

Kumbh Mela 2021: Starting and End Date, Time, Places, Maha Kumbh Dates For Ganga Snan or Shahi snan

ఈ మహత్తర ఘట్టం మకర సంక్రాంతి రోజున ప్రారంభమైంది. ఈ గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం ఏప్రిల్ 2021వరకు కొనసాగుతుంది. హిందూ మతాన్ని విశ్వసించే వారికి అత్యంత పవిత్రమైన మరియు అతి పెద్ద ఆచారాలలో కుంభమేళా ఒకటి.

Kumbh Mela 2021: Starting and End Date, Time, Places, Maha Kumbh Dates For Ganga Snan or Shahi snan

ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచం, దేశవ్యాప్తంగా నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ సందర్భంగా కుంభమేళాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను మరియు ఏయే తేదీలలో.. ఏ శుభ ముహుర్తంలో స్నానం చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

83 ఏళ్లలో ఇదే తొలిసారి..

83 ఏళ్లలో ఇదే తొలిసారి..

మన దేశంలో ప్రతిసారీ కుంభమేళాను 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. కానీ కుంభమేళా చరిత్రలో తొలిసారిగా 12కి బదులుగా 11వ సంవత్సరంలో జరుగుతోంది. వాస్తవానికి, ఇలాంటి సమయం చాలా అరుదుగా వస్తుంటుంది. ఈసారి గ్రహాలలో మార్పుల కారణంగా, ప్రత్యేకంగా 11 సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నారు. 83 సంవత్సరాల తర్వాత ఇలాంటి పరిస్థితి తలెత్తింది. అంతకుముందు ఇలాంటి సంఘటనలు 1760, 1885 మరియు 1938 సంవత్సరాల్లో జరిగాయి.

గంగానది స్నానం యొక్క ప్రాధాన్యత..

గంగానది స్నానం యొక్క ప్రాధాన్యత..

హిందూ మతంలో, గంగానదికి ఎంతో విశిష్టత. పురాణాల కాలం నుండి గంగానదిని ప్రతి ఒక్కరూ తల్లిగా భావిస్తారు. లేఖనాల ప్రకారం, కుంభమేళా సమయంలో గంగానదిలో స్నానం చేసే ఎవరైనా మోక్షం పొందుతారు.

నాలుగు రాజస్నానాలు..

నాలుగు రాజస్నానాలు..

గంగానది స్నానం చేయడం వల్ల సకలపాపాలు తొలగిపోతాయని మరియు అనేక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. హరిద్వార్ కుంభమేళలాలో 2021లో నాలుగు రాజస్నానాలు జరుగుతాయి. 13 అఖారాలు దీనిలో పాల్గొంటాయి. ఈ అఖారాల పట్టిక కూడా తొలగించబడుతుంది ఈ పట్టికలో నాగబాబా ముందంజలో ఉంటారు. వీటి తర్వాత మహంత్, మండలేశ్వర్, మహామండలేశ్వర్, ఆచార్య మహమండలేశ్వర్ ఉన్నారు.

ముఖ్య తేదీలివే..

ముఖ్య తేదీలివే..

హరిద్వార్ కుంభమేళా 2021లో మకర సంక్రాంతి రోజుతో పాటు మౌని అమావాస్య అంటే ఫిబ్రవరి 11వ తేదీన మరియు వసంత పంచమి ఫిబ్రవరి 16వ తేదీ, మాఘ పూర్ణమి ఫిబ్రవరి 27, మార్చి 11వ తేదీ అంటే మహాశివరాత్రి సమయంలో, ఏప్రిల్ 14వ తేదీ బైసాఖి (రాయల్ బాత్), ఏప్రిల్ 21వ తేదీన శ్రీరామ నవమి రోజున, చివరిగా చైత్రపూర్ణిమ (రాయల్ బాత్) నాడు అంటే ఏప్రిల్ 27వ తేదీన స్నానం చేస్తే సకల సంపదలు పెరిగి, ఆయురారోగ్యాలతో పాటు అందరికీ శ్రేయస్కరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

English summary

Kumbh Mela 2021: Starting and End Date, Time, Places, Maha Kumbh Dates For Ganga Snan or Shahi snan

Kumbh Mela 2021 Time, Dates: All You Need to Know About Ganga Snan, Shahi Snan or Bathing at Haridwar Kumbh in Telugu.
Desktop Bottom Promotion