గురువారం మీ రాశిఫలాలు (09-01-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ధనుర్మాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు ఎలాంటి కారణం లేకుండా బాధపడే అవకాశం ఉంది. దీని నుండి తప్పించుకునేందుకు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కొంత సమయం గడపడం మీకు మంచిది. కార్యాలయంలో మీ సీనియర్ల మద్దతుతో మీరు అద్భుతమైన విజయాన్ని పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. అయితే మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన మిమ్మల్ని బాధపెడుతుంది.

లక్కీ కలర్ : లైట్ పింక్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కష్టాలు ఎదురవ్వచ్చు. దీంతో మీరు తీవ్ర నిరాశలో పడొచ్చు. ఇలాంటి విషయాల వల్ల మీపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామిని గుడ్డిగా నమ్మొద్దు. ఉద్యోగులు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఈరోజు మీ ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ సమస్యలను అర్థం చేసుకుంటారు. అయితే మీ ఆరోగ్యం కూడా ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారి ఇంట్లో ఈరోజు వాతావరణం సరిగా ఉండదు. ఈరోజు కుటుంబ విషయాలను పరిష్కరించడానికి మీరు ప్రయత్నిస్తారు. నిర్ణయాలు మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. లేదంటే మీరే చింతిస్తారు. ఈరోజు మీ పని విషయంలో ఒత్తిడి లేకుండా ఉంటారు. వ్యాపారవేత్తలు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 5:40 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగంగా మంచిగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుండి ప్రేమ మరియు మద్దతు పొందుతారు. దీని వల్ల మీరు మంచి అనుభూతి చెందుతారు. మీరు జీవితంలో విజయం సాధించాలంటే, ప్రతికూల ఆలోచనలు మీ మనసులోకి రానివ్వద్దు. ఈరోజు ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. పనిలో అనుకూలంగా ఉంటుంది. మీరు మీ వైవాహిక జీవితంలో ప్రేమను తిరిగి పొందాలంటే, మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపండి. ఈ రోజు మీరు మీ శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:45 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు కొత్త ప్రాజెక్టులను పొందవచ్చు. ఈరోజు ప్రతి ఒక్కరూ మీ ప్రతిభను చూస్తారు. మీ కుటుంబంలో శాంతి వాతావరణం ఉంటుంది. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో సరదాగా ఉండే రోజు అవుతుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. కానీ డబ్బు విషయంలో తొందరపడకండి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 8:20 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారిలో ఈరోజు ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారవేత్తలు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వ్యాపార నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాలి. కుటుంబంలో ఈరోజు అంతా బాగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల నుండి మీకు మద్దతు ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలను ఈరోజు క్లియర్ చేసే అవకాశం ఉంది. ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారి ఇంట్లో ఈరోజు శాంతి వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ఎవరికి అయినా డబ్బు అప్పు ఇచ్చి చాలా కాలంగా తిరిగి రాకుండా ఉంటే ఈరోజు తిరిగి పొందవచ్చు. ఆఫీసులో అదనపు ఉత్సాహంతో పనిని పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు కూడా ఈరోజు కొన్ని ఉద్యోగావకాశాలు రావచ్చు. వ్యాపారవేత్తలకు కూడా కావాల్సిన లాభం వస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుడుపడుతుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారి ఆరోగ్యం ఈరోజు బాగా ఉంటుంది. మీరు ఒత్తిడి లేకుండా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు షాపింగ్ కూడా చేయవచ్చు. ఇది మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. మీ వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటుంది. పని విషయంలో కూడా అంతా అనుకూలంగానే ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9:45 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అంతా బాగా ఉంటుంది. అయితే మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అప్పులు తీసుకోవడం గానీ, ఇవ్వడం గానీ చేయొద్దు. వ్యాపారవేత్తలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు అకస్మాత్తుగా ఒక గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు. ఉద్యోగం చేసే వారు సీనియర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ అభిప్రాయాలతో వారు ఏకీభవించరు.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు వారి పనిపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. మీకు ఈరోజు ప్రేమ విషయంలో ప్రత్యేకంగా ఉంటుంది. శృంగార పరంగా కూడా ఈరోజు చాలా అనుకూలత కనిపిస్తోంది. ఈరోజు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. అయితే మీ అన్ని పనులను చాలా వేగంగా పూర్తి చేస్తారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి రాత్రి 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా నిరాశ ఎదురవుతుంది. ఆర్థిక పరిమితుల వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. భవిష్యత్తు గురించి చింతిస్తూ, మీ వర్తమానాన్ని నాశనం చేయొద్దు. ఈ అందమైన రోజును ఆస్వాదించండి. మీ భవిష్యత్తును ప్రకాశవంతంగా ఉంచుకోండి. పని విషయంలో సాధారణంగా ఉంటుంది. మీరు మీ సీనియర్ల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీ శారీరక ఆరోగ్యం కూడా ఈరోజు బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 5:15 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో వివాహం చేసుకున్న వారికి ఈరోజు ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని సాధ్యమైనంత వరకు సున్నితంగా ఉంచేందుకు ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో మీపై ఒత్తిడి పెరుగుతుంది. మీరు కార్యాలయంలో సీనియర్లతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

Story first published: Thursday, January 9, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion