శుక్రవారం మీ రాశిఫలాలు (03-07-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope July 03, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు పిల్లల నుండి ఏదైనా శుభవార్తలు వినొచ్చు. ఆర్థిక పరంగా మీరు ఊహించిన విధంగా పనులు జరుగుతాయి. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో సాధారణంగా ఉంటుంది. మీరు పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : ఉదయం 6:46 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పనిలో చాలా మంచిగా ఉంటుంది. మీ పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. మరోవైపు, వ్యాపారులు ఈరోజు నిరాశ చెందుతారు. ఈ రోజు మీరు కొంత ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అయితే మీరు నిరుత్సాహపడకుండా ధైర్యంగా వాటిని అవగాహనతో ఎదుర్కొంటారు. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులుంటాయి. ఈరోజు ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. మీరు ఈరోజు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఆరోగ్య పరంగా మాత్రం ఈరోజు బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:20 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో సమస్యలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మీ జీవిత భాగస్వామి విమర్శతో మీరు చాలా బాధపడతారు. ఇలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరు ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా మీ కృషి ఫలాలను పొందుతారు. కానీ మీరు కొంత సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచి అనుభూతి కలుగుతుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో ప్రేమ మరియు అనుబంధం పెరుగుతుంది. మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. వ్యాపారులకు వ్యాపారం బాగానే ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైర రోజు అవుతుంది. కానీ దీని వల్ల పెద్ద సమస్యలేమీ ఉండవు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈ రోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కొన్ని పెద్ద ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. మరోవైపు, ఉద్యోగులకు వారి ఉన్నతాధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఇటీవల మీకు అప్పగించిన కొత్త బాధ్యతలును, మీరు సకాలంలో నెరవేర్చగలుగుతారు. మీ ఇంటి వాతావరణం బాగానే ఉంటుంది. మీ ఆరోగ్యం ప్రభావితం కాకుండా మీ కోసం కూడా సమయం కేటాయించాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :16

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. కానీ మీరు రోజూ తేలికపాటి వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇది మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది. ఈ రోజు కుటుంబపరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు వింటారు. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు కొంత మెరుగుదల ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ బ్లాక్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 6:15 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు మానసిక స్థితి సరిగా ఉండకపోవచ్చు. విద్యార్థులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు మీ లక్ష్యాన్ని సాధించాలనుకుంటే, మీరు మీ వంతు కృషి చేయాలి. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీరు డబ్బును విపరీతంగా ఖర్చు చేయకపోతే మంచిది. ఈరోజు మీ శత్రువులు చురుకుగా ఉంటారు. మీకు ఎక్కువ ఇబ్బంది కలిగించే అవకాశమున్నందున, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ :14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:20 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

 వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు గొప్పగా ఉంటుంది. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి బయటపడటం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు. దీని వల్ల మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది. అయితే ఈరోజు మీకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ ఆదాయం బాగుంటుంది. అయితే, ఈ రోజు మీరు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. తల్లిదండ్రుల నుండి భావోద్వేగ మద్దతు ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :34

లక్కీ టైమ్ : ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 2:25 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో కష్టపడి పని చేయాలి. అయితే మీరు తొందరలో కొన్ని తప్పులు చేయవచ్చు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి ఎక్కడా పెట్టుబడులు పెట్టకండి. ఆరోగ్యంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6:40 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు గొప్పగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు కస్టమర్లతో సక్రమంగా వ్యవహరిస్తే, మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సమయంలో మీరు వారి గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తొందరపడి ఎలాంటి పని చేయకండి. ఆర్థిక పరంగా ఈరోజు అకస్మాత్తుగా ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :7

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచిస్తుంటే, మీ ప్రయత్నాలు విఫలం కావచ్చు.ఇది మిమ్మల్ని చాలా నిరాశకు గురి చేస్తుంది. అలాగే, ఈరోజు మీరు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో సమస్యలు పెరగకుండా, మీ ప్రియమైనవారితో మాట్లాడటం మంచిది. మౌనంగా ఉండటం ద్వారా మీరు అపార్థాలను పెరుగుతాయి తప్ప, తగ్గవని గుర్తుంచుకోవాలి. అధిక ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ :15

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు పనిలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఉద్యోగులు మీ జీతం పెరుగుదల వంటి శుభవార్తను వింటారు. వ్యాపారులు ఆర్థికంగా ప్రయోజనం పొందొచ్చు. పరిస్థితులు ఈరోజు మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి.

మీరు దాదాపు ప్రతిదానిలోనూ విజయం సాధిస్తారు. కొంచెం కష్టపడితే, మీరు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. మీ వైవాహిక జీవితంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మీ రోజును ఆనందిస్తారు. ఆరోగ్య పరంగా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పీచ్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Friday, July 3, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion