For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదివారం మీ రాశిఫలాలు (12-07-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope July 12, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నిర్లక్ష్యంగా ఉంటే, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు పని విషయంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కార్యాలయంలో మీ ప్రవర్తన సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. బట్టల వ్యాపారులకు ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 4:50 నుండి మధ్యాహ్నం 12:05 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పనులపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు ఇతరులపై ఆధారపడితే, మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. పని విషయంలో ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారు. తాత్కాలిక ఉద్యోగులు ఈరోజు శుభవార్తలను వింటారు. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఆశిస్తున్న ఆర్థిక లాభాలను పొందలేకపోవచ్చు. అయితే మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. కాబట్టి, మీరు అన్ని పనుల జాబితాను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీకు తల్లిదండ్రుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మీ రాశిని బట్టి మీ వివాహ జీవితం రొమాంటిక్ గా ఉండాలంటే...మీ రాశిని బట్టి మీ వివాహ జీవితం రొమాంటిక్ గా ఉండాలంటే...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. మీ పనులన్నీ పూర్తి వేగంగా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఏవైనా సమస్యలుంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. లేదంటే మీరు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో ఈ రోజు వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈరోజు ఉద్యోగులు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ, మీకు మంచి ఫలితాలు రావు. సీనియర్ ఆఫీసర్లు మీరు చేసే పనిలో చాలా లోపాలను ఎత్తి చూపుతారు. అలాంటి వాటితో ఇబ్బంది పడకుండా, మీరు మీ పనిపై పూర్తి సానుకూలతతో దృష్టి పెట్టాలి. మరోవైపు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబంతో చాలా సరదాగా గడుపుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మనసు విచారంగా ఉంటుంది. మీకు పెద్దగా పని చేయాలనిపించకపోతే, మంచి పుస్తకాన్ని చదవండి. దీని వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో కొంత ఇబ్బందిగా ఉంటుంది. అయితే మీపై ప్రతికూలత ఆలోచనలు ఆధిపత్యం చేయనివ్వకుండా ఉండాలి. వ్యాపారులు కూడా ఊహించిన దాని కంటే తక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

హస్తసాముద్రికం : వేళ్ల మధ్య దూరం కూడా అనేక రహస్యాలను తెలుపుతుంది...హస్తసాముద్రికం : వేళ్ల మధ్య దూరం కూడా అనేక రహస్యాలను తెలుపుతుంది...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఉద్యోగులకు పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. మీకు సీనియర్ అధికారులు మరియు సహోద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు ఒక సువర్ణావకాశం లభిస్తుంది. అయితే మీరు ప్రతి పెట్టుబడి గురించి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్థిక పరమైన విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం మాధుర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 9:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఇది మీపై ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి, మీరు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు వ్యాపారులు ఈరోజు ఓపికగా పని చేయాలి. మీరు ఆశించిన ఫలితాలను పొందకపోతే, మీ వ్యాపార ప్రణాళికలపై మరోసారి పునరాలోచించాలి. మీరు చిన్న చిన్న విషయాలపై కోపం తెచ్చుకోకూడదు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు సానుకూలంగా ఉంటారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఈరోజు విజయం సాధిస్తారు. వ్యాపారులు కూడా ఈరోజు మంచి లాభాలను పొందుతారు. అయితే ఇందుకు మీరు చాలా ఆలోచనాత్మకంగా పని చేయాలి. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఈ రోజు మీకు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:05 నుండి సాయంత్రం 4:40 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు సౌకర్యవంతమైన విషయాలకు ఎక్కువ ఖర్చు చేయవచ్చు. వ్యాపారులు ఈరోజు ఎక్కువ లాభాలను పొందవచ్చు. మరోవైపు మీరు మీ వైవాహిక జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ పని మరియు వృత్తి జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం మంచిది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి ఉదయం 11:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తారు. విదేశాలలో ఉద్యోగం చేయడానికి ప్రయత్నిస్తే, మీకు ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి, అయితే మీరు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే, మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. వ్యాపారులు ఈరోజు ఆర్థిక పరంగా కొంత నష్టం చవిచూడవచ్చు. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మీ వివాహ జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిమితుల కారణంగా, ముఖ్యమైన పనులన్నీ పెండింగులో పడిపోతాయి. మీ రోజువారీ పనులలో కూడా అడ్డంకులు ఉండవచ్చు. ఇవన్నీ మీ నిర్లక్ష్యం యొక్క ఫలితంగానే ఉంటుంది. వ్యాపారులు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. త్వరలో మీరు ఈ సమస్య నుండి బయటపడతారు. ఇంటి వాతావరణం బాగుంటుంది. ప్రేమ మరియు కుటుంబంతో సంబంధంలో ఉంటుంది. మీరు వివాహం చేసుకుంటే, ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగార మరియు చిరస్మరణీయమైన రోజు గడుపుతారు. మీ ఆరోగ్య విషయాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి సాయంత్రం 6 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

నవ్వును బట్టి ఎదుటివారి స్వభావం గురించి ఈజీగా తెలుసుకోవచ్చా?నవ్వును బట్టి ఎదుటివారి స్వభావం గురించి ఈజీగా తెలుసుకోవచ్చా?

English summary

Daily Horoscope July 12, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Sunday, July 12, 2020, 1:22 [IST]
Desktop Bottom Promotion