For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం మీ రాశిఫలాలు (14-07-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope July 14, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

నవ్వును బట్టి ఎదుటివారి స్వభావం గురించి ఈజీగా తెలుసుకోవచ్చా?నవ్వును బట్టి ఎదుటివారి స్వభావం గురించి ఈజీగా తెలుసుకోవచ్చా?

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలేయడానికి ప్రయత్నిస్తుంటే, మీరు చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఊహించిన ఫలితాలను పొందలేకపోవచ్చు. మరోవైపు, చాలా కష్టపడిన తరువాత వ్యాపారులు లాభం పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతిని కొనసాగించడానికి ప్రయత్నించాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి రాత్రి 7:45 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు పూర్తి ఏకాగ్రతతో అధ్యయనం చేయడానికి ప్రయత్నించాలి. మరోవైపు ఉద్యోగులు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఆర్థిక పరిమితుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 8:20 నుండి మధ్యాహ్నం 2:55 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అయితే ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా పని చేయాలి. మీపై ఉన్నతాధికారుల నిఘా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మంచి అవకాశం ఉంటుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని తేడాలు ఉండవచ్చు. ఈ గ్లోబల్ అంటువ్యాధిని దృష్టిలో ఉంచుకుని, మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

మీ రాశిని బట్టి మీ వివాహ జీవితం రొమాంటిక్ గా ఉండాలంటే...మీ రాశిని బట్టి మీ వివాహ జీవితం రొమాంటిక్ గా ఉండాలంటే...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు డబ్బు విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు. లేకపోతే

లాభాల స్థానంలో మీరు నష్టం చవిచూడాల్సి వస్తుంది. మీరు మానసికంగా పరధ్యానంలో ఉన్నట్లు భావిస్తే, మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ కుటుంబ జీవితంలో సాధారణంగా ఉంటాయి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు ఎవరికైనా సహాయం చేయడానికి అవకాశం లభిస్తే, దాన్ని ఉపయోగించుకోవాలి. ఉద్యోగులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ మానసిక స్థితి సరిగ్గా ఉండకపోవడంతో మీరు మీ పనిపై దృష్టి పెట్టలేరు. అయితే మీరు సహోద్యోగులతో చాట్ చేయడం తగ్గించాలి. మరోవైపు, ఈ రోజు వ్యాపారులకు కొంత ఉపశమనం కలుగుతుంది. కొన్ని రోజులుగా మీరు మీ వ్యాపారం గురించి ఆందోళన చెందుతుంటే, ఈ రోజు మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 8:40 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులకు ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. దీంతో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అయితే, మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ పనులు సమయానికి పూర్తవుతాయి. వ్యాపారులు ఈరోజు లాభాలను పొందడానికి మంచి అవకాశం దక్కొచ్చు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. కుటుంబంతో సంబంధంలో సామరస్యం ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 7:40 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు చాలా కష్టపడి పని చేయాలి. ప్రతికూల ఆలోచనలు మీ మనసులోకి రానివ్వొద్దు. కార్యాలయంలో మీ ఖ్యాతి పెరుగుతోందని త్వరలో మీరు గ్రహిస్తారు. ఆర్థిక పరంగా ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీ ఖర్చులు తక్కువగా ఉంటాయి. వ్యాపారులకు ఈరోజు పెట్టుబడి పెట్టడానికి మంచిగా ఉంటుంది. మీరంతా స్నేహితులతో కలిసి కొంత సమయం గడపడానికి అవకాశం ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు

హస్తసాముద్రికం : వేళ్ల మధ్య దూరం కూడా అనేక రహస్యాలను తెలుపుతుంది...హస్తసాముద్రికం : వేళ్ల మధ్య దూరం కూడా అనేక రహస్యాలను తెలుపుతుంది...

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ రోజు మీ ఉన్నతాధికారులతో ఒక ముఖ్యమైన సంభాషణ చేయబోతున్నట్లయితే, మీకు సానుకూల సమాధానాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార వ్యక్తులు కూడా విపరీతమైన లాభాలను పొందవచ్చు. కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ రోజు తోబుట్టువులతో చాలా సరదాగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏవైనా సమస్యలుంటే, మీరు కుటుంబంతో గడపండి. ఈరోజు వారితో మీరు సంతోషకరంగా గడపడాన్ని ఆస్వాదించండి. మరోవైపు మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో భవిష్యత్తు ప్రణాళికలను చర్చించవచ్చు. మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఈరోజు మీరు పని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తే, ఈ రోజు మీకు పెద్ద అవకాశం లభిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, మీ కెరీర్‌కు కొత్త దిశ లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఆస్తి విషయంలో ఏదైనా బేరం చేసేటప్పుడు తొందరపడకండి. లేకపోతే మీకు నష్టాలు సంభవించవచ్చు. మరోవైపు, శ్రామిక ప్రజలు ఈ రోజు కొన్ని శుభవార్తలను పొందవచ్చు. కానీ మీ వ్యక్తిగత జీవితంలో కష్టాలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు వాహనాన్ని వినియోగించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఆర్థిక పరంగా పెద్ద ప్రయోజనాలు పొందవచ్చు. భాగస్వామితో వ్యాపారులు చేసేవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఏదైనా ముఖ్యమైన పనిని శ్రామిక ప్రజలకు అప్పగించినట్లయితే, దానిని సకాలంలో మరియు జాగ్రత్తగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ రోజు మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభించదు. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామి నుండి అందమైన ఆశ్చర్యం పొందవచ్చు. ఇది మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ప్రత్యతర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఈరోజు మీరు ఎవ్వరిని ద్వేషించకండి. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. వ్యాపారులకు ఈరోజు కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే మీరు వాటిని అధిగమిస్తారు. మరోవైపు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు తల్లిదండ్రులు మరియు తోబుట్టువుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు వివాహం చేసుకుంటే, ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చాలా గుర్తుండిపోయే రోజు అవుతుంది. ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండాలి. బయటి ఆహారం తినడం మానుకోవాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 4:30 నుండి మధ్యాహ్నం 12:35 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope July 14, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Monday, July 13, 2020, 21:22 [IST]
Desktop Bottom Promotion