For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం మీ రాశిఫలాలు (17-07-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope July 17, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

కర్కాటకంలోకి సూర్యుడు.. మకరంలోకి శని ప్రవేశిస్తే... 12 రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి...కర్కాటకంలోకి సూర్యుడు.. మకరంలోకి శని ప్రవేశిస్తే... 12 రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు మతపరమైన మనసులపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే లేదా మీరు సొంతంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మీ కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా బిజీగా ఉంటుంది. మీరు తొందరపడితే మీకు పనిలో అవాంతరాలు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఏదైనా విషయంలో భయం ఉంటే, అది ఈరోజు పోయే అవకాశం ఉంది. మీరు మీ పనిని శ్రద్ధగా చేస్తారు. వ్యాపారులు ఈరోజు మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. మీరు పెట్టుబడిపై దృష్టి పెట్టాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 8:05 నుండి రాత్రి 8 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంి. మీరు అదనపు ఆదాయం సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారులు ఈరోజు పని నిమిత్తం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీ ఇంటి వాతావరణం బాగానే ఉంటుంది. మీ కుటుంబంతో ఈరోజు ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీరు శృంగార పరంగా మంచి అనుభూతిని పొందుతారు. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 4:15 నుండి రాత్రి 10 గంటల వరకు

Rangam bhavishyavani 2020 : కరోనాపై అమ్మవారు ఏమి చెప్పారంటే...!Rangam bhavishyavani 2020 : కరోనాపై అమ్మవారు ఏమి చెప్పారంటే...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది. అయితే, మీరు ఆశించిన ఫలితాలను పొందలేకపోతే, మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే త్వరలో మీకు అదృష్టం దక్కబోతోంది. ఈ రోజు మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎక్కువగా తొందరపడకుండా ఉండాలి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీ పెరుగుతున్న బరువును నియంత్రించాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5:10 నుండి రాత్రి 9:50 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా అదృష్టంగా ఉంటుంది. మరోవైపు ఈ రాశి నిరుద్యోగులలో, చాలాకాలంగా ఉపాధి కోసం ఎదురు చూస్తున్నట్లయితే, త్వరలో మీకు శుభవార్త వినిపిస్తుంది. ఈ రోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. ఇది కాకుండా, ఈ రోజు తల్లి నుండి ప్రయోజనం పొందడం సాధ్యమవుతుంది. మీరు మీ వివాహ జీవితంలో ఆనందం మరియు శాంతిని కాపాడుకోవాలనుకుంటే, మీ కోపాన్ని నియంత్రించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : ఉదయం 8:55 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా ఏదైనా గందరగోళం ఉంటే, మీరు ధ్యానం చేయాలి. అలాగే ప్రతికూల ఆలోచనలు మీ మనసులో రానివ్వకండి. అప్పుడే మీరు మంచి అనుభూతి చెందుతారు. ఉద్యోగులు ఈరోజు పనిపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8:55 గంటల వరకు

<strong>మీ రాశిని బట్టి మీ వివాహ జీవితం రొమాంటిక్ గా ఉండాలంటే...</strong></p><p>మీ రాశిని బట్టి మీ వివాహ జీవితం రొమాంటిక్ గా ఉండాలంటే...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేస్తారు. అంతేకాదు సీనియర్లను కూడా బాగా ఆకట్టుకుంటారు. ఈ రోజు కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. మరోవైపు, మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ వ్యాపారంలో నష్టపోవాల్సి వస్తుంది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. పిల్లల వైపు నుండి శుభవార్త పొందవచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఏ పని అయినా చాలా నిజాయితీగా మరియు శ్రద్ధగా చేస్తే, కచ్చితంగా విజయం పొందుతారు. ఉద్యోగులు ఆఫీసులో సహోద్యోగులతో మరియు సీనియర్లతో సమన్వయం కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఇది మీకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వివాహితులకు ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధం మరింతగా పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ ఆరోగ్యం కూడా ఈరోజు మెరుగుపడుతుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు ఒక శుభవార్త వినిపించవచ్చు. ఉద్యోగులలో ప్రభుత్వ విభాగం పని చేసేవారు ప్రయోజనం పొందవచ్చు. మరోవైపు వ్యాపారులకు ఈరోజు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థిక పరమైన విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఇంటి వాతావరణం క్షీణిస్తుంది. ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఇది కాకుండా, మీరు మీ పిల్లలపై కూడా శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో వారికి సరైన మార్గదర్శకత్వం అవసరం. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీకు తక్కువ పని భారం ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు చాలా మంచి లాభం వస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పెరుగుతున్న ఖర్చులు మీ బడ్జెట్ ను పాడు చేస్తాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 44

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి చాలా విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. మీరు తక్కువ కష్టంతో మంచి ఫలాలను పొందవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు విజయం సాధించేందుకు బలమైన అవకాశం ఉంది. ఒక పెద్ద కంపెనీలో మీరు ఉన్నత స్థానం పొందవచ్చు. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీకు ఒక సువర్ణావకాశం రావచ్చు. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులతో మీ సంబంధం బాగుంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా చిరస్మరణీయమైన రోజును గడుపుతారు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో ఈరోజు సాఫ్ట్‌వేర్ కంపెనీలలో పనిచేసే ప్రజలకు చాలా బిజీగా ఉంటుంది. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే, మీ కృషి ఫలించదు. కానీ త్వరలో మీరు దాని మంచి ఫలాలను పొందుతారు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకండి. మరోవైపు వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాలి. మీ ఆరోగ్యంపై చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope July 17, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Thursday, July 16, 2020, 19:43 [IST]
Desktop Bottom Promotion