For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదివారం దినఫలాలు : ఈ రాశుల వారికి శుభవార్తలు వినిపిస్తాయి...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, ఆషాఢ మాసంలో ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope July 18, 2021

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Venus Transit in Leo On 17 July 2021: సింహరాశిలోకి శుక్రుడి సంచారం.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!Venus Transit in Leo On 17 July 2021: సింహరాశిలోకి శుక్రుడి సంచారం.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంద. ఉద్యోగులు మరియు వ్యాపారులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధించే అవకాశం ఉంది. మీరు కష్టపడి పని చేయడంలో వెనక్కి తగ్గకండి. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా బాగుంటుంది. అయితే, మీరు చాలా అజాగ్రత్తగా ఉండొద్దు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బాగుంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైనవారి మానసిక స్థితి చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:20 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, కచ్చితంగా మీ పెద్దల అభిప్రాయాన్ని తీసుకోండి. మీ వైవాహిక జీవితంలో కొంత తిరుగుబాటు ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో కొన్ని మార్పులు ఉంటాయి. మీ ప్రియమైన వారిని ప్రేమతో ఒప్పించడానికి ప్రయత్నిస్తే మంచిది. శృంగార జీవితంలో మంచిగా ఉంటుంది. ఒకరిపై మీకున్న నమ్మకం బలపడుతుంది. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఎలక్ట్రానిక్స్ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఈరోజు మంచి ఆర్థిక లాభాలను పొందగలరు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీరు ఏ పని అయినా బాగా ఆలోచించి చేయాలి. ఆర్థిక పరమైన విషయాల్లో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు రుణాలు ఇవ్వడం మానుకోండి. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే మీ తోబుట్టువులతో సంబంధాలు బాగుంటాయి. మీరు వారి పూర్తి మద్దతు పొందుతారు. పని విషయంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు

సింహంలోకి శుక్రుడి సంచారం.. ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనం... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!సింహంలోకి శుక్రుడి సంచారం.. ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనం... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. మీకు చాలా ఫలితాల్లో సానుకూలంగా ఉంటుంది. మీరు కొత్తగా మరియు సృజనాత్మకంగా ఏదైనా చేయాలని ఆలోచిస్తుంటే, ఈరోజు దానికి మంచి రోజు. కార్యాలయంలో పని చేసే ఉద్యోగులకు ఈరోజు మంచి గౌరవం లభిస్తుంది. ఇవన్నీ మీ కృషి ఫలితమే. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలు సంపాదించేందుకు మంచి అవకాశం పొందుతారు. చమురుకు సంబంధించి పనిచేసే వ్యక్తులు విపరీతమైన లాభాలను పొందవచ్చు. మీ జీవిత భాగస్వామితో గొడవ పడకుండా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి సాయంత్రం 4:25 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారికి ఈరోజు విశ్రాంతి తీసుకోవడానికి తగినంత అవకాశం లభిస్తుంది. ఇది మీకు చాలా రిఫ్రెష్ గా అనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీ ఖర్చులు పెరగొచ్చు. మీరు మీ బడ్జెట్ ప్రకారం, ఖర్చు చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ మధ్య ప్రేమ మరింత తీవ్రమవుతుంది. ఈరోజు, మీ జీవిత భాగస్వామి సహాయంతో, మీరు చాలాకాలంగా ఇరుక్కున్న ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో వాదనలు మరియు మరియు ఘర్షణలను నివారించాలి. వ్యాపారులు ఈరోజు తెలివిగా పెట్టుబడులు పెట్టాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 11 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా అదృష్టం కలిసి వస్తుంది. మీరు కొత్త వనరుల నుండి డబ్బు సంపాదించగలరు. ఇది కాకుండా, ఈరోజు మీరు ఏదైనా పాత అప్పుల నుండి కూడా బయటపడొచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఇంటి సభ్యులతో ప్రేమ పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి భావోద్వేగ మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు ఒకరితో ఒకరు తగినంత మరియు మంచి సమయాన్ని గడుపుతారు. ఉద్యోగం చేసేవారికి బాస్ మద్దతు లభిస్తుంది. మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి మీరు కృషి చేస్తారు. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు

సూర్యుడు కర్కాటకంలోకి సంచారం... ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే...సూర్యుడు కర్కాటకంలోకి సంచారం... ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు నిరంతరం పని చేయకుండా ఉండాలి. మధ్య మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. వ్యాపారులు ఈరోజు డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగులపై ఆఫీసులో బాస్ నిఘా ఎక్కువగా ఉంటుంది. మీకు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన బాధ్యత మీ నుండి తిరిగి తీసుకునే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, మీరు సహనంతో పని చేయాలి. మీ పనిని ప్రశాంతంగా పని చేయాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అయితే మీరు పొదుపుపై ​​ఎక్కువ దృష్టి పెట్టాలి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మీ ఈ ప్రయాణం పనికి సంబంధించినది కావొచ్చు. మీరు ఉద్యోగం చేస్తే మరియు మీ ప్రమోషన్ చాలా కాలం నుండి కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఉంటే, ఈరోజు మీకు శుభవార్త వచ్చే అవకాశం ఉంది. హోటళ్ళు మరియు రెస్టారెంట్లకు సంబంధించిన వ్యక్తులు కొంత ఉపశమనం పొందొచ్చు. మీ పనిలో కొంత వేగం వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో అసమ్మతి ఉండొచ్చు. సోదరులతో విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మీ ఒత్తిడి చాలా పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా అలసటతో మరియు భారంగా భావిస్తారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు సరదాగా ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆర్థికంగా, మీరు దగ్గరగా ఉన్నవారికి కూడా సహాయపడొచ్చు. సోదరులు మరియు సోదరీమణులు మార్గనిర్దేశం చేయవలసి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఏదైనా సమస్య ఉంటే.. మీరు వెంటనే మంచి వైద్యుడిని సంప్రదించాలి. వ్యాపారులు ఈరోజు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో వాదన కలిగి ఉండొచ్చు. మీ కోపాన్ని నియంత్రించమని మీకు సలహా ఇస్తారు. అదే సమయంలో, ఈ రాశిచక్రం యొక్క వివాహితుల రోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఒత్తిడి ఉంటుంది. త్వరలో మీ సమస్య పరిష్కరించబడుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం అకస్మాత్తుగా పెరుగుతుంది. మీరు ఈరోజు ఓవర్ టైం కూడా పని చేయాల్సి ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, మీరు మీ భాగస్వామిపై మీ నమ్మకాన్ని బలోపేతం చేసుకోవాలి. చిన్న విషయాలపై విభేదాలు మీ వ్యాపారంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారి ఇంటికి ఈరోజు అకస్మాత్తుగా ఓ అతిథి రావొచ్చు. వారి రాక సందర్భంగా మీరు చాలా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇతరులను మెప్పించడానికి మీరు అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేయకపోవడమే మంచిది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే ప్రజలకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు కానుంది. వ్యాపారులు ఈరోజు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు పెద్ద ఆర్డర్‌ను పొందవచ్చు. ప్రత్యేకించి మీరు బట్టల వ్యాపారి అయితే, ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ అజాగ్రత్త వైఖరి మీ తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారిని గౌరవంగా చూడాలి. మీ ప్రియమైన వారిపై ఇతరుల కోపాన్ని తీర్చకుండా ఉండండి. ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు బ్యాంకు నుండి రుణం తీసుకున్నట్లయితే, దాని వాయిదాలను వీలైనంత త్వరగా తిరిగి చెల్లించడానికి ప్రయత్నించండి. వ్యాపారులు ఈరోజు ప్రయాణించకుండా ఉండాలి. ఉద్యోగులు ఈరోజు పెండింగ్ పనులపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope July 18, 2021

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published:Saturday, July 17, 2021, 21:28 [IST]
Desktop Bottom Promotion