Latest Updates
-
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.!
ఆదివారం మీ రాశిఫలాలు (19-07-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. ఈరోజు మీకు పనిభారం తక్కువగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజు మీరు కూడా క్రొత్తదాన్ని నేర్చుకుంటారు. ఈ చిన్న లాభాలను పొందవచ్చు. కుటుంబ జీవితంలో అనుకూలత ఉంటుంది. ఈరోజు మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఆరోగ్య పరంగా రోజు బాగుంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ :10
లక్కీ టైమ్ : ఉదయం 9:55 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో ఉద్యోగులకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు కొంతకాలంగా కష్టపడి పనిచేస్తున్న విధానాన్ని చూసి, మీ ఉన్నతాధికారులు మీ జీతం పెంచాలని నిర్ణయించుకోవచ్చు. వ్యాపారులకు ఈరోజు కొన్ని లాభాలు ఎక్కువగా పొందవచ్చు. ముఖ్యంగా బట్టల వ్యాపారులు భారీ లాభం పొందుతారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి నడవడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 24
లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబం విషయంలో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో మీరు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. పని విషయంలో కూడా ఈరోజు కొంత గందరగోళంగా ఉండొచ్చు. మీరు ముందుకు సాగడానికి ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. మీ వైవాహిక జీవితంలో కూడా ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొన్ని మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు బదిలీ వంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే విదేశాలలో ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి ఈరోజు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయం వ్యాపారులకు చాలా ముఖ్యమైన రోజు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత త్వరగా అన్నింటినీ పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు తండ్రి నుండి సహాయం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ :4
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రమాదం ఏర్పడవచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో పని చేసే వాతావరణం మంచిగా ఉంటుంది. మీ యజమాని మీ పనితో సంతోషంగా ఉండరు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ పనిని జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య ఉండేందుకు తగినంత విశ్రాంతి కూడా పొందాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 31
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:10 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పనిలో కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ త్వరలో తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. మీరు ఆర్థిక పరమైన నిర్ణయాలు సక్రమంగా తీసుకుంటే, డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు ఏవైనా సమస్యలకు పరిష్కారం కావాలంటే, కుటుంబ సభ్యులతో మాట్లాడితే, పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్య పరంగా మీకు కొంత ఇబ్బందిగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :5
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు చాలా శక్తివంతంగా సానుకూలంగా ఉంటారు. మీ విశ్వాసం బలంగా ఉంటుంది. మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేస్తారు. ఉద్యోగులు సహోద్యోగులతో కలిసి పనిచేస్తే మంచిది. వ్యాపారులకు ఏవైనా సమస్యలుంటే, తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. మీకు ఏవైనా అనుమానాలుంటే, అనుభవం ఉన్న వారిని సంప్రదించాలి. త్వరలో మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ :15
లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే, మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో ప్రతికూలతలను ఎదుర్కొంటారు. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే, మీరు ప్రస్తుతం పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు నిద్రకు సంబంధించిన సమస్యలు మరియు అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఏదైనా పని సంబంధిత సమస్య ఈ రోజు పరిష్కరించబడుతుంది. ముఖ్యంగా వ్యాపార వ్యక్తులు ఈ రోజు మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రోజు శ్రామిక ప్రజలకు సాధారణంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే, మీరు వివాహం చేసుకుంటే మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం పెరుగుతుంది. మీ ప్రియమైన వారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఈరోజు విద్యార్థులకు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 27
లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలతో చుట్టముట్టబడతారు. మీరు ప్రశాంతంగా ఉండటం ద్వారా, మీరు వాటిని అధిగమించవచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన మీ పట్ల చాలా మంచిది. మీకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. పని విషయంలో మీరు చాలా సంతృప్తి చెందుతారు. మీరు వ్యాపారం చేస్తే ఈ రోజు మంచి లాభం పొందవచ్చు. ఆర్థిక విషయానికొస్తే, బహిరంగంగా ఖర్చులు చేయకుండా ఉండాలి. ఆర్థిక విషయాలలో మీ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీరు మీ చింతలన్నీ మరచిపోయి మీ పని మీద దృష్టి పెడితే మంచిది. అనవసరమైన చర్చకు దూరంగా ఉండండి. మీ సమస్యలకు శాంతితో పరిష్కారం కోసం ప్రయత్నించండి. కొన్ని కారణాల వల్ల మీరు మీ జీవిత భాగస్వామికి దూరంగా ఉంటే, మీరు చాలా కోల్పోతారు. అటువంటి పరిస్థితిలో, ఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా వారితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా చేయండి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీకు బోనస్ వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా, మీ కృషి ఎంతో ప్రశంసించబడుతుంది. వ్యాపారంలో ప్రతి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మార్కెట్లో మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఈ రోజు మీరు వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ప్రియమైనవారిని అనవసరంగా అనుమానించడం మానుకోండి. మనస్సులో ఏదైనా సందేహం ఉంటే, బహిరంగంగా చెప్పండి. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications