For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదివారం మీ రాశిఫలాలు (26-07-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, శ్రావణమాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope July 26, 2020
ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Mercury Transit in Cancer : ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!Mercury Transit in Cancer : ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పనులన్నీ వేగంగా పూర్తి చేయాలి. మరోవైపు మీరు వ్యాపారం చేస్తుంటే, మీ పోటీదారులు మీకు కఠినమైన పోటీని ఇవ్వగలరు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ పని అంతా మంచి ప్రణాళిక ప్రకారం చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఈ రోజు ఆర్థిక సమస్య అనేదే ఉండదు. ఆరోగ్యం పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9:45 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగవ్వడంతో, మీరు మంచి అనుభూతిని పొందుతారు. ఈరోజు మీకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. అయితే, సహోద్యోగుల సహాయంతో, నేడు అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. కాబట్టి పెద్దగా చింతించకండి. మరోవైపు, ఈ రోజు వ్యాపారులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. డబ్బు విషయంలో, మీరు ఆలోచనతో మీ అడుగు ముందుకు వేయడం మంచిది. కుటుంబ జీవితంలో అసమ్మతి సాధారణమే.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:45 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొంత నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయకపోవడమే మంచిది. కార్యాలయంలో ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు ఉన్నతాధికారులతో మాట్లాడాలి. మీకు ఈరోజు కుటుంబ జీవితంలో మరియు స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 10 గంటల వరకు

మీ రాశిని బట్టి, మీ నిజమైన మిత్రులు మరియు శత్రువులు ఎవరో తెలుసుకోండి...!మీ రాశిని బట్టి, మీ నిజమైన మిత్రులు మరియు శత్రువులు ఎవరో తెలుసుకోండి...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఏ విషయంలో అయినా పూర్తి విశ్వాసంతో ఉండాలి. మీరు మీ యజమానిని ఆకట్టుకోవడంలో విజయవంతమైతే, మీకు త్వరలో ప్రయోజనం లభిస్తుంది. మరోవైపు, మీరు ఇటీవల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, ఈ రోజు మీరు విపరీతమైన లాభాలను పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా పవిత్రంగా ఉంటుంది. మీరు పెద్ద విజయాన్ని పొందవచ్చు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. కార్యాలయంలో మీ సహోద్యోగులకు సహాయం చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈ రోజు చిన్న వ్యాపారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా లాభపడవచ్చు. ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీకు తల్లిదండ్రులు, తోబుట్టువులు మరియు అందరి నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 5:15 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో తమ ీసనియర్ల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు మీకు పని ఒత్తిడి కారణంగా, మీరు ఓవర్ టైమ్ కూడా పని చేయాల్సి ఉంటుంది. కానీ మీరు నిరుత్సాహపడరు. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది.ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యా ఉండదు.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

ఏఏ రాశి చక్రాలవారు ఏవిధంగా రహస్యాలను కాపాడుకుంటారో చూడండి...ఏఏ రాశి చక్రాలవారు ఏవిధంగా రహస్యాలను కాపాడుకుంటారో చూడండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు పిల్లల విద్య గురించి ఆందోళన చెందుతారు. మీ పిల్లలు చిన్నవారైతే మీరు ఈ సమయంలో వారి చదువులపై దృష్టి పెట్టాలి, లేకపోతే వారు చాలా వెనుకబడిపోతారు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. అయితే మీరు అనవసరమైన ఖర్చులను నివారించాలి. ఈరోజు మీరు పనిలో బిజీగా ఉంటారు. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు పెరుగుతాయి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆశించిన ఫలితాలు రాకపోతే, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ ఒకేలా ఉండదని మీరు అర్థం చేసుకోవాలి. మీ తరపున ప్రయత్నించడం కొనసాగించండి. త్వరలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు సహోద్యోగులతో గొడవ పడకుండా ఉండండి.

మీరు బంగారం మరియు వెండి వ్యాపారం చేస్తే, ఈ రోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంటి సభ్యులతో సంబంధం సామరస్యంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగులు ఈరోజు ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. మీ ఇంటి వాతావరణం బాగానే ఉంటుంది. ఈరోజు మీరు తల్లిదండ్రుల ఆందోళన నుండి బయటపడవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. పెద్దగా ఖర్చు చేయడానికి ఈరోజు అనుకూలంగా లేదు.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారులకు గొప్పగా ఉంటుంది. ఈరోజు మీరు ఓ శుభవార్తను వినొచ్చు. ఉద్యోగులు ఈరోజు సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆదాయం విషయంలో ఎలాంటి సమస్యా ఉండదు. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరింత శృంగార మానసిక స్థితిలో ఉంటారు. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈ రోజు మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఆనందంగా ఉంటారు. మీ పనులన్నీ ఈరోజు చాలా సులభంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో మీకు అనుకూలంగా ఉంటుంది. మీ తోబుట్టువులు మీకు మద్దతు ఇస్తారు. మీ సంబంధంలో ప్రేమ మరియు అనురాగం, ఆప్యాయత కనిపిస్తాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా సమస్యలు ఎదురవుతాయి. అకస్మాత్తుగా పెద్ద వ్యయం మీ బడ్జెట్ అసమతుల్యతకు కారణమవుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఈ సమయాన్ని ఆలోచనాత్మకంగా గడపాలి. మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీ పనిలో సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope July 26, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Saturday, July 25, 2020, 23:37 [IST]
Desktop Bottom Promotion