For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం మీ రాశిఫలాలు (30-07-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, శ్రావణమాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Mercury Transit in Cancer : ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ వ్యక్తిగత సంబంధాలు బలంగా ఉంటాయి. మీరు మీ స్వభావాన్ని కొంచెం మార్చుకుంటే, మీ సంబంధం అద్భుతంగా ఉంటుంది. పని విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. మీ పెరుగుతున్న బరువు గురించి మీరు ఆందోళన చెందుతుంటే, మీరు దీని కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

లక్కీ కలర్ : ఇండిగో

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : ఉదయం 6:45 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు ఎదురవుతాయి. మీ మంచి లక్షణాలు ప్రశంసించబడతాయి. మీ విశ్వసనీయతను చూడటం ద్వారా ప్రజలు మీపై విశ్వాసం పెంచుకుంటారు. ఉద్యోగులు ఈరోజు ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టేయాలి. వ్యాపారులు ఈరోజు కొన్ని ప్రయోజనాలను పొందొచ్చు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ప్రేమ మరియు సంబంధం ఉంటుంది. మీరు ఈ రోజు మానసికంగా చాలా బలంగా ఉంటారు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి సాయంత్రం 5:55 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు పనులకు ఆటంకం ఏర్పడవచ్చు. ఉద్యోగులు ఈరోజు పూర్తి విశ్వాసంతో పని చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగుదల ఉంటుంది. మీ ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. మీ కుటుంబ జీవితంలో కొన్ని ఆందోళనలు అధిగమించే ప్రయత్నించవచ్చు. వివాహితులు ఈరోజు జీవిత భాగస్వామితో వాదనలు మానుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

మీ రాశిని బట్టి, మీ నిజమైన మిత్రులు మరియు శత్రువులు ఎవరో తెలుసుకోండి...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీరు ఊహించిన విధంగా ఆర్థిక సహాయం అందకపోవచ్చు. ఇలాంటి సమయంలో మీరు నిరాశ చెందకుండా, చాలా ఓపికగా ఉండాలి. మీరు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవాలి. అప్పుడే మీరు మానసికంగా బలంగా ఉంటారు. పని విషయంలో ఈరోజు మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆరోగ్యం పరంగా ఈరోజు కష్టాలు పెరుగుతాయి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు చాలా కష్టపడి పని చేస్తారు. వ్యాపారులు ఈరోజు పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఇది కాకుండా, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు మీరు బాగా ఆలోచించాలి. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ప్రతికూలతను ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పనిలో చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. మీ యజమాని మీకు అనుకూలంగా ఉండే కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు కూడా ఈరోజు మంచి ఫలితాలను పొందవచ్చు. మీ వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నంలో మీరు విజయం సాధించవచ్చు. ఈ రోజు మీకు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు ఆందోళన పోయి ఉపశమనం లభిస్తుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 4:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

ఏఏ రాశి చక్రాలవారు ఏవిధంగా రహస్యాలను కాపాడుకుంటారో చూడండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పనిలో మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. అయితే ఉద్యోగులకు ఈరోజు మంచి ప్రయోజనాలు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో కొన్ని వివాదాలు రావచ్చు. అయితే ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతుంటే, మీరు మందులను సకాలంలో తీసుకోవాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు చాలా పవిత్రంగా ఉంటుంది. గ్రహాల స్థానాలు పెద్ద పురోగతిని సూచిస్తున్నాయి. మీరు ఈరోజు చాలా నిరాశకు గురవుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ వంటివి కొన్ని కారణాల వల్ల వాయిదా వేయొచ్చు.అయితే,మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఈ శుభవార్త వినిస్తుంది. వ్యాపారులు ఎక్కువ లాభం పొందొచ్చు. ఈరోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 10:15 నుండి మధ్యాహ్నం 2:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు తమ పనులపై సరిగా దృష్టి పెట్టలేరు. ఇలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. మరోవైపు ఉద్యోగులకు సంబంధించిన పనులు పెండింగులో పడిపోవచ్చు. దీని వల్ల మీకు మానసిక స్థితి మరింతగా దిగజారిపోవచ్చు. మరోవైపు వ్యాపారులకు ఈరోజు ఆశించిన ఫలితాలు రావాలంటే, మీరు కొన్ని ప్రణాళికలను రూపొందించుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీరు ఈరోజు మందుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయొచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు మీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. జిడ్డుగల మరియు కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. బీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. తల్లిదండ్రులు మీకు సరిగ్గా మార్గనిర్దేశం చేస్తారు. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు ఆర్థిక పరంగా సంతృప్తికరంగా ఉంటుంది. అయితే, ఈ సమయంలో మీరు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా కొంత సమస్య ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఊహించిన విధంగా ఫలితాలను పొందలేరు. అయితే మీరు ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. మీరు మీ ప్రయత్నాలను కొనసాగించాలి. త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా కనిపిస్తాయి. మరోవైపు ఈరోజు మీ కృషి మరియు పని పట్ల అంకితభావం చూసి, మీ యజమాని మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో ముఖ్యమైన రోజు అవుతుంది. వ్యాపారులు ఈరోజు మంచి ఫలితాలను పొందవచ్చు. ఈరోజు మీ పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. అయితే మీరు ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆదాయం విషయంలో ఎవరితో అయినా వివాదం పెంచుకుంటే, మీరే నష్టపోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10:05 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope July 30, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published: Thursday, July 30, 2020, 6:00 [IST]