For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం మీ రాశిఫలాలు (31-07-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, శ్రావణమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope July 31, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Mercury Transit in Cancer : ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!Mercury Transit in Cancer : ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు ప్రత్యర్థులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మీ ప్రత్యర్థులు మీ చర్యలకు ఆటంకం కలిగించవచ్చు. మరోవైపు కార్యాలయంలో ఉద్యోగులకు ఈరోజు పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీకు ఉన్నతాధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. మరోవైపు ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో తొందరపడకూడదు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు పొదుపు చేయడంపై దృష్టి పెడితే, మీ ఆర్థిక సమస్యలన్నీ త్వరలోనే ముగుస్తాయి. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు పెరుగుతాయి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఎవ్వరికీ అప్పులు ఇవ్వకుండా ఉండాలి. ఉద్యోగులు ఈరోజు సమస్యలన్నింటినీ అధిగమిస్తారు. మీరు మీ పనిని శ్రద్ధగా మరియు వేగంగా కొనసాగిస్తే, మీ పురోగతి కల త్వరలో నెరవేరుతుంది. మరోవైపు వ్యాపారులు ఈరోజు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటుంటే, ఈ సమయంలో మీరు చాలా తెలివిగా పని చేయాల్సి ఉంటుంది. క్రమంగా, మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటి వాతావరణం చక్కగా ఉంటుంది. మీకు కుటుంబంతో మంచి సంబంధం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేస్తారు. మీ మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను ఆశించివచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు తొలగిపోతాయి. మీ ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది. మరోవైపు, మీ జీవిత భాగస్వామి మీ పనిలో పాలుపంచుకుంటే, ఈ రోజు మీరు వారి అవగాహన నుండి పెద్ద ప్రయోజనం పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఇబ్బంది పడకూడదంటే పని ఒత్తిడిని పెంచుకోకండి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

మీ రాశిని బట్టి, మీ నిజమైన మిత్రులు మరియు శత్రువులు ఎవరో తెలుసుకోండి...!మీ రాశిని బట్టి, మీ నిజమైన మిత్రులు మరియు శత్రువులు ఎవరో తెలుసుకోండి...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఆఫీసులో అనేక ప్రయోజనాలు పొందొచ్చు. ఏదైనా కష్టమైన పనిని సైతం తేలికగా పూర్తి చేసే అవకాశం ఉంది. మరోవైపు మీరు వ్యాపారాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశాన్ని పొందవచ్చు. మీ ఇంట్లో వాతావరణం కొంత ఆందోళనకరంగా ఉంటుంది. అయితే, మీ భాగస్వామితో మీరు ఈరోజు ఎక్కువ సమయం గడుపుతారు. అది మీ సంబంధాలకు మంచిది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 4:10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే మీకు మానసిక శాంతి లభిస్తుంది. రిటైల్ వ్యాపారులు ఈరోజు మంచి ప్రయోజనం పొందవచ్చు. మరోవైపు, ఉద్యోగులు కార్యాలయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో మీరు ఓపికగా వ్యవహరించాలి. మీ కుటుంబ జీవితంలో కూడా కొంత ఆందోళనకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో, వారికి మీ ప్రేమ మరియు మద్దతు చాలా అవసరం. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, కళ్ళు మరియు చెవులకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉండవచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో శుభప్రదంగా ఉంటుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్ను నడిపించడానికి మీకు అవకాశం రావచ్చు లేదా మీరు పనికి సంబంధించి విదేశాలకు కూడా వెళ్ళవచ్చు. అలాగే రాబోయే రోజుల్లో మీకు మంచి ఫలాలు లభిస్తాయి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు కొంత మెరుగ్గానే ఉంటుంది. అకస్మాత్తుగా మీరు మంచి సంపదను పొందుతారు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ఏఏ రాశి చక్రాలవారు ఏవిధంగా రహస్యాలను కాపాడుకుంటారో చూడండి...ఏఏ రాశి చక్రాలవారు ఏవిధంగా రహస్యాలను కాపాడుకుంటారో చూడండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు మీ సంపద కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ రోజు మీరు మీ పనులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ రోజు పనిభారం ఎక్కువగా ఉండవచ్చు. సమయం లేకపోవడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మరోవైపు, ఈ రోజు ఉద్యోగం గురించి మనస్సులో తెలియని భయం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, ఈ సమయంలో మీరు మీ పని గురించి తీవ్రంగా ఆలోచించాలి. మీరు శ్రద్ధగా పనిచేయాలి. మీ ఇంట్లో వాతావరణం మంచిగా ఉండదు. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అజీర్ణం సమస్యలు ఉండవచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలను తీసుకోకండి. మరోవైపు, ఉద్యోగులకు కార్యాలయంలో ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగిస్తే, దాన్ని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. లేదంటే అది మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. మానసిక ఒత్తిడి పెరిగినందున మీకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు. మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు పనులపై పూర్తి శ్రద్ధ చూపుతారు. మీ ఇల్లు మరియు కార్యాలయం యొక్క వాతావరణం బాగుంటుంది. ఈ రోజు మీ యజమాని చాలా మంచి మానసిక స్థితిలో ఉంటాడు. మీరు వారితో ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటే, ఈ రోజు దానికి అనుకూలమైన రోజు. అదే సమయంలో, వ్యాపారులు కూడా ఈ రోజు పెద్ద ఉపశమనం పొందవచ్చు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాల యొక్క పూర్తి ప్రయోజనం మీకు లభిస్తుంది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ ప్రియమైనవారితో గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మీరు సానుకూలంగా ఆలోచిస్తే, మీకు మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు శుభవార్తలు వినిపిస్తాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు కొంత మెరుగుదల ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ప్రతికూలతకు భయపడకుండా, సమస్యలను విశ్వాసంతో ఎదుర్కొంటే, త్వరలో పరిష్కారం లభిస్తుంది. ఈ రోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ పనిని పూర్తి కృషి మరియు శక్తితో చేయాలి. అదే సమయంలో, వ్యాపారులు పెద్ద సవాలును ఎదుర్కొంటారు. మీ ప్రత్యర్థులు గట్టిగా పోటీ ఇవ్వొచ్చు. మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 6:45 నుండి రాత్రి 10 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope July 31, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Thursday, July 30, 2020, 20:15 [IST]
Desktop Bottom Promotion