శుక్రవారం మీ రాశిఫలాలు (05-06-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పనిలో పవిత్రంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా ఉత్సాహంగా పని చేస్తారు. మీరు మంచి టీమ్ లీడర్ అని కూడా నిరూపిస్తారు. మీ సీనియర్లు కూడా మీ పని విషయంలో సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, వెంటనే దాన్ని పరిష్కరించుకోవడం మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈరోజు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు పనిలో బిజీగా ఉంటారు. అయితే వీరు మీ వ్యక్తిగత జీవితంపై శ్రద్ధ చూపకపోతే, కనీసం మీ ప్రియమైన వారి కోసం సమయం కేటాయించాలి. ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని ప్రతికూల ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. మీరు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి. మీ ఆలోచనను సానుకూలంగా ఉంచడం మంచిది. ఈరోజు మీ పనిలో అతి విశ్వాసం మీకు హానికరంగా మారుతుంది. వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. మీరు అదనపు బాధ్యతలు తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంబంధం బలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో గొడవ పడే అవకాశం ఉన్నందున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఈరోజు పని తేలికగా ఉంటుంది. మీ బాస్ మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఇది మీకు భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనం లభిస్తుంది. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8:20 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా వ్యక్తులు వారి ప్రయోజనం కోసం మిమ్మల్ని ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా ఆలోచించి ఓపికగా ఉండాలి. వ్యాపారులు కూడా ఈరోజు ఆశించిన ఫలితాలను పొందలేరు. మీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ మనసును మీ ప్రియమైన వారితో పంచుకుంటే, మీకు చాలా మంచి అనుభూతి కలుగుతుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి ఉదయం 11:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు కూడా ఆపీసులో ఉత్సాహంగా పని చేస్తారు. అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈరోజు పెద్ద పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అయితే మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఎదురుకావచ్చు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ఓవైపు మీ మనసులో ప్రతికూల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఈ సమయంలో మీరు చాలా ఓపిక కలిగి ఉండాలి. త్వరలోనే మీ సమస్య పరిష్కారమవుతుంది. ఉద్యోగులు కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారుల ప్రయత్నాలు ఈరోజు విజయవంతమవుతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు బాగుంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8:45 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఆస్తి వ్యవహారాలకు సంబంధించి మీరు పెద్ద క్లయింట్లను కలుసుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గానే ఉంటుంది. మీ ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 32

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు. ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఈరోజు పని విషయంలో కొంత ఉపశమనం కూడా పొందవచ్చు. వ్యాపారులకు ఈరోజు వ్యాపారంలో లాభాలుంటాయి. విద్యార్థులు ఈరోజు ఆన్ లైన్ తరగతుల యొక్క ప్రయోజనాన్ని పొందండి. లేకపోతే మీరు అధ్యయనాలలో వెనుకబడిపోతారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు కుటుంబంతో తగినంత సమయం గడపడానికి అవకాశం ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. దీని వల్ల మీ ప్రణాళికలు దెబ్బ తినే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. ఈరోజు ఆర్థిక పరంగా ఎవరితో అయినా వివాదాలు ఉండొచ్చు. ఈరోజు పని విషయంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు స్థానికంగా ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 10:45 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఇబ్బందులను ఎదుర్కొంటుంటే, మీ ప్రియమైన వారి నుండి సహాయం లభిస్తుంది. మీ సంబంధాలు బలంగా ఉంటాయి. మీ ప్రియమైన వారిపై మీ నమ్మకం కూడా పెరుగుతుంది. ఉద్యోగులకు ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:45 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈరోజు మీ మనసులో ఏదో తెలియని భయం ఉంటుంది. మీరు ఇలాగే ప్రతికూలంగా ఆలోచిస్తే.. మీ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు వివాహం చేసుకుంటే చాలా కాలం తరువాత మీ జీవిత భాగస్వామితో కొంత మంచి సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని ఆస్వాదించండి. ఆర్థిక పరంగా ఈరోజు బాగుంటుంది. ఈ రోజు మీరు ఏదైనా ఆర్థిక లావాదేవీలు కూడా చేయవచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Friday, June 5, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion