For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోమవారం మీ రాశిఫలాలు (08-06-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

చంద్ర గ్రహణం తర్వాత మంచి రోజులెప్పుడో చూడండి...చంద్ర గ్రహణం తర్వాత మంచి రోజులెప్పుడో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం సామరస్యంగా ఉంటుంది. వారి సహాయంతో మీకు ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. మరోవైపు, మీ తల్లి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, ఈ రోజు మీరు ఆమె ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు. ఉద్యోగులకు ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకేసారి చాలా పనులను చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడొచ్చు. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మరోవైపు వ్యాపారులు ఈరోజు ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కొత్త దాంట్లో వ్యాపారం పెట్టాలని చూస్తే, సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పని విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రశాంతమైన మనసుతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు ఈరోజు సమస్యలు ఎదురవుతాయి. మీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీకు కుటుంబ సభ్యుల నుండి ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి సాయంత్రం 4:50 గంటల వరకు

గ్రహణం వల్ల ఏఏ రాశిచక్రాలు ఎక్కువగా ప్రభావితమవుతాయో తెలుసా?ఏఏ రాశులు అదృష్టవంతులో చూద్దాం..గ్రహణం వల్ల ఏఏ రాశిచక్రాలు ఎక్కువగా ప్రభావితమవుతాయో తెలుసా?ఏఏ రాశులు అదృష్టవంతులో చూద్దాం..

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. మీరు సిగరెట్లు మరియు మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మీకు ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ప్రణాళిక ప్రకారం పని చేస్తే ఫలితం ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 37

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ఏదైనా కొత్త పని చేయబోతున్నట్లయితే, మీకు అడ్డంకులు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో మీరు తెలివిగా వ్యవహరించాలి. మీ జీవిత భాగస్వామితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఉండండి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు స్నేహితుల గురించి ఏవైనా అపొహలుంటే, స్పష్టంగా మాట్లాడి తొలగించుకోవాలి. మరోవైపు ఉద్యోగులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీకు పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఉత్తమమైన పని చేయడానికిప ప్రయత్నిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చేఅవకాశం ఉంది. తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 39

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

జూన్ 5 తర్వాత ఈ 5 రాశుల వారు బిలీనియర్లు అయ్యే అవకాశముందట...జూన్ 5 తర్వాత ఈ 5 రాశుల వారు బిలీనియర్లు అయ్యే అవకాశముందట...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు ఈరోజు పని చేయడంలో భిన్నమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే చాలా కాలం తరువాత మీరు మీరే రిలాక్స్ అవుతారు. మీ దృష్టి అంతా పనిపైనే ఉంటుంది. ఇది కాకుండా, మీరు సహోద్యోగులతో కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. వ్యాపారులకు ఈ రోజు గొప్ప అవకాశం లభిస్తుంది. మీరు తెలివిగా పనిచేస్తే, రాబోయే రోజుల్లో మీరు పెద్ద ప్రయోజనం పొందవచ్చు. పిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా ముఖ్యమైన రోజు. మీరు అకస్మాత్తుగా చాలా ఆదాయాన్ని పొందవచ్చు. ఈరోజు మీరు ఎలాంటి రుణాన్ని అయినా తిరిగి చెల్లించగలరు. మీరు పొదుపుపై కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక సమస్యలన్నీ కొద్దిరోజుల్లోనే ముగుస్తాయి. ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో చాలా గందరగోళం ఉంటుంది. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొంత ఉపశమనం లభిస్తుంది. మీరు ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే, మీకు శుభవార్త వినిపిస్తుంది. అయితే మీరు ఆర్థిక పరమైన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన పనులు చాలా కాలం నుండి పెండింగులో ఉండటంతో మరింత నిరాశ చెందుతారు. ఇలాంటి సమయంలో మీరు ధైర్యంగా పని చేయాలి. ఉద్యోగులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీకు అవగాహన పెరుగుతుంది. ఈ రోజు మీ ప్రియురాలితో ఎక్కువ సమయం గడపడానికి మీరు ఇష్టపడతారు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 4:40 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు అప్పుల గురించి ఆలోచిస్తుంటే, మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే మీపై ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. ఇది మీ మానసిక ప్రశాంతతను కాపాడుతుంది. ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు లేదా వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈ రోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఆరోగ్య పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని చిన్న సమస్యలు ఎదురవుతాయి. మీరు సమస్యల గురించి ఆలోచించకుడా, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. మీకు ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీపై ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు చాలా ముఖ్యమైనది. మీ వివాహ జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 3 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 08, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Sunday, June 7, 2020, 4:19 [IST]
Desktop Bottom Promotion