Latest Updates
-
పప్పుల పొడి బోర్ కొట్టిందా? అయితే ఈ ఘాటైన ఆంధ్రా చికెన్ కారప్పొడి ట్రై చేయండి! -
పీరియడ్స్ ఆలస్యం అవ్వడానికి అసలు కారణం ఇదేనట! -
మే 4: ఈ రాశుల వారికి ఊహించని ధన యోగం.. కెరీర్లో తిరుగులేని సక్సెస్! -
వేడి అన్నంలో చల్లటి బెండకాయ పెరుగు పచ్చడి..ప్రతి ముద్దా ఆహా అనిపించాల్సిందే! -
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు! -
వృశ్చికం, సింహం, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 04 మే 2026 -
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే..
గురువారం మీ రాశిఫలాలు (11-06-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా పవిత్రంగా ఉంటుంది. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. అయినప్పటికీ, మీరు మీ ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే చాలా కష్టపడి పనిచేసిన తర్వాతే మీకు ఈ ప్రయోజనం లభించిందని మీకు బాగా తెలుసు. ఈరోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండదు. మీరు కొత్త ఆలోచనలు చేస్తారు. ఉద్యోగులు సీనియర్ అధికారులతో కొన్ని ముఖ్యమైన చర్చలు జరపవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో చాలా బాగుంటుంది. మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని అలవాట్లను మార్చుకోవాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 27
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు మానసిక శాంతికి కొంత భంగం కలుగుతుంది. మీరు మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి. అనవసరంగా ఆలోచించడం ద్వారా మీ విలువైన సమయాన్ని వృథా చేయవద్దు. ఉద్యోగులకు పని విషయంలో ఈరోజు బాస్ తో చిన్న వివాదం ఉండొచ్చు. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరే నష్టపోతారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ వివాహ జీవితంలో ఆనందం మరియు శాంతిని కొనసాగించేందుకు మీరు సున్నితంగా వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 8:45 నుండి మధ్యాహ్నం 2:20 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు చేసే పనిలో కొన్ని అంతరాయాలు ఏర్పడొచ్చు. అయితే, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికమే, త్వరలో మీ కష్టాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు ఈ రోజు సహోద్యోగులతో కూడా కొంత వివాదం ఏర్పడొచ్చు. వ్యాపారులకు ఈరోజు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఇలాంటి సమయంలో పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలి. మీ మీ ఆరోగ్యంపై కూడా పూర్తి శ్రద్ధ వహించాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 40
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు ఏ విషయంలో అయినా ఏదైనా ప్రయత్నం చేస్తే విజయం సాధించొచ్చు.ఈ రోజు మీ పని ఒకరి సహాయంతో పూర్తవుతుంది. ఉద్యోగులు ఆఫీసులో గాసిప్స్ కు దూరంగా ఉండాలి. మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఈరోజు మీరు చాలా డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ సోదరుడు లేదా సోదరి గొప్ప విజయాన్ని పొందవచ్చు, అది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : సాయంత్రం 4:45 నుండి రాత్రి 8 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది.ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో బహిరంగంగా మాట్లాడి అన్ని అపోహలను తొలగించడానికి ప్రయత్నిస్తారు. మీరిద్దరూ ఒకరిపై ఒకరు కొంచెం ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలి. ఈరోజు పని విషయంలో సాధారణంగా ఉంటుంది. మీరు సకాలంలో పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులుంటే అవి ఈరోజు తొలగిపోవచ్చు. ఆరోగ్య పరంగా చురుకుగా ఉంటారు.
లక్కీ కలర్ : లైట్ ఎల్లో
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8:45 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. మీరు ఏదైనా మార్పు గురించి ఆలోచిస్తుంటే, మీ యజమానితో మాట్లాడాలి. వ్యాపారులు ఏదైనా సవాళ్లను ఎదుర్కొంటుంటే, ధైర్యంగా పని చేయాలి. త్వరలో పరిస్థితి అనుకూలంగా మారుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మీరు అజాగ్రత్తగా ఉంటే కొన్ని విమర్శలను ఎదుర్కోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదుగా ఉంటుంది. ఎక్కువగా ఖర్చు చేసే మీ అలవాటు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 25
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి వైఖరి మీకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే మీరు మానసిక శాంతిని కోల్పోతారు. ఉద్యోగులు, వ్యాపారులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. అయితే మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు వీలైనంత త్వరగా అప్పులు చెల్లించవచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు కొంత ఇబ్బంది ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఏ విషయంలో అయినా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. దీని వల్ల మీరు నిరాశ చెందుతారు. వ్యాపారులు ఏదైనా కొత్త పని చేసేటప్పుడు, అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవాలి. లేదంటే మీరు నష్టపోతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఆరోగ్య పరంగా ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతుంటే, ఈరోజు మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. అయితే మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. మీరు అజాగ్రత్తగా ఉండకూడదు. వ్యాపారులకు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఆర్థిక నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఖరీదైన రోజు అవుతుంది. మీరు మీ స్నేహితులను సంతోషపెట్టడానికి మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:45 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. చాలా కాలం తరువాత మీరు కుటుంబంతో నిశ్శబ్దంగా మరియు విశ్రాంతిగా గడపగలుగుతారు. ఆర్థిక పరంగా కూడా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు ఏదైనా పెద్ద లాభం కోసం చూస్తుంటే, మీరు ఓపికగా ఉండాలి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పనిని నిజాయితీగా మరియు పూర్తి శ్రద్ధతో పూర్తి చేయాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఉన్నతాధికారుల, సహోద్యోగుల పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది. మీ పనిని సమయానికి పూర్తి చేయడంతో పాటు, మీరు పెండింగ్‌లో ఉన్న పనులపై కూడా దృష్టి పెట్టగలుగుతారు. అదే సమయంలో, వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే మీ జీవిత భాగస్వామితో కొంత గొడవలు ఉండొచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీకు బిపి ఎక్కువగా ఉంటే, మీరు విశ్రాంతిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మరోవైపు వ్యాపారులు ఈరోజు పెట్టుబడుల గురించి ఎలాంటి ఆలోచన చేయకూడదు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబంతో సంబంధం మధురంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రత్యేక బహుమతిని పొందవచ్చు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications