For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదివారం దినఫలాలు : ఈ రాశుల వారు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు...!

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Sun Transit in Gemini on 15 June 2021: సూర్యుడు మిధునంలో ఎంట్రీ.. 12 రాశులపై ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలుSun Transit in Gemini on 15 June 2021: సూర్యుడు మిధునంలో ఎంట్రీ.. 12 రాశులపై ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలు

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో విద్యార్థులు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఏదైనా ఉద్రిక్తత ఉంటే, ఈ రోజు మీ సమస్యలు అధిగమించబడతాయి. మీ ఇంటి వాతావరణం మరోసారి ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మారుతుంది. మీరు కుటుంబ సభ్యులతో కూడా మంచి సమయం గడుపుతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీరు వారి పూర్తి మద్దతు పొందుతారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించవచ్చు. మీ ప్రయాణం చాలా చిరస్మరణీయంగా ఉంటుంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఈరోజు మీరు ఆర్థికంగా అవసరమైన వారికి సహాయం చేయవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు అంతా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 11 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే త్వరలో మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి మీరు ఏ విషయంలో తొందరపడకూడదు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, మీకు మీ భాగస్వామి యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. మీ మధ్య మంచి సమన్వయం ఉంటుంది. మీరు దాని నుండి మంచి ప్రయోజనాలను కూడా పొందుతారు. మరోవైపు, ఉద్యోగులు ఈరోజు కొంత నిరాశకు లోనవుతారు. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : సాయంత్రం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబ సభ్యులకు తగినంత సమయం ఇవ్వగలుగుతారు. మీ తమ్ముడు లేదా సోదరి వివాహానికి అర్హులు అయితే, ఈరోజు మీ ఇంట్లో వారి వివాహం గురించి చర్చ జరగవచ్చు. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు మద్దతుతో, మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరమైన విషయానికొస్తే, ఈరోజు మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. బాగా ఆలోచించిన తర్వాత మీరు మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే, త్వరలో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. పని విషయంలో ఈరోజు చాలా ముఖ్యమైనది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

ఈ రాశుల వారు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ.. ఇతరులను మోసం చేస్తారట...! వీరితో జర జాగ్రత్త..!ఈ రాశుల వారు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ.. ఇతరులను మోసం చేస్తారట...! వీరితో జర జాగ్రత్త..!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు ఈరోజు నిర్ణయాలన్నింటినీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు సరైన సమయంలో సరైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఈరోజు మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగులకు ఈరోజు చాలా భారంగా అనిపిస్తుంది. పని ఒత్తిడి మరియు ఉన్నతాధికారుల కఠినమైన వైఖరి మిమ్మల్ని బాధపెడుతుంది. మీరు అన్ని ఒత్తిళ్ళను మరచిపోయి మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. అదే సమయంలో, మీరు కూడా మీ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మీరు ప్రతికూల పరిస్థితులలో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మరోవైపు వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను ఆర్జించగలరు. ఆరోగ్య పరంగా సమస్యలు పెరుగుతాయి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 7:50 నుండి రాత్రి 8:18 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు పనిపైనే పూర్తి శ్రద్ధ పెట్టాలి. మీరు మీ కృషితో మీ అన్ని ముఖ్యమైన మరియు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఈరోజు సహోద్యోగులతో కలిసి పనిచేయాలి. జట్టు కృషి వల్ల మీరు మంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపారవేత్తలు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే త్వరలో మీ ఇబ్బందులు తొలగిపోతాయి. మీ ఇంటి వాతావరణం ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు డబ్బు విషయంలో చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కొంచెం కొత్తగా ఉంటుంది. మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావొచ్చు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. ముఖ్యంగా మీకు తండ్రి యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తే ఈరోజు మీరు అదనపు బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మీరు కష్టపడి, శ్రద్ధగా పనిచేస్తే, త్వరలో మీరు పెద్ద పురోగతి సాధించొచ్చు. అదే సమయంలో, ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు వ్యాపారులు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా అంతా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

Solar Eclipse 2021: సూర్యగ్రహణం వల్ల ఈ 5 రాశుల వారికి ఇబ్బందులు...!Solar Eclipse 2021: సూర్యగ్రహణం వల్ల ఈ 5 రాశుల వారికి ఇబ్బందులు...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మరోవైపు మీ పిల్లల విద్య గురించి మీరు కొంత ఆందోళన చెందుతారు. అయితే, పరిస్థితులు త్వరలో మెరుగుపడతాయి. కాబట్టి మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోవలసిన అవసరం లేదు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. కాకపోతే మీరు అదనపు ఆదాయం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో శుభప్రదంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. అయితే, ఇది మీపై బాధ్యతలను పెంచుతుంది. కాబట్టి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు సీనియర్ అధికారులతో సంతోషంగా గడుపుతారు. మీ ఉత్తమ పనితీరును చూస్తే, వారు మీ ప్రమోషన్ నిర్ణయాన్ని కూడా తీసుకోవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో మీరు వారి పూర్తి మద్దతు పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : ఉదయం 4:25 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు తల్లిదండ్రులు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వారిని ఇబ్బంది పెట్టొచ్చు. మీరు అద్దె ఇంట్లో నివసిస్తూ, మీ స్వంత ఇంటి గురించి కలలు కంటుంటే, ఈరోజు మీరు కొన్ని మంచి వార్తలను వినొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు పూర్తి కృషితో మీ పనిని పూర్తి చేస్తారు. వ్యాపారులు తమ ప్రయత్నాలలో విజయం సాధించే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:55 నుండి సాయంత్రం 6:50 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీ అధిక ఖర్చుల వల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగులు జీతం ఆలస్యంగా పొందడం వల్ల కొంత ఆందోళన చెందుతారు. మరోవైపు వ్యాపారులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రశాంతంగా ఉండటం మంచిది. ఈరోజు మీరు పనికి సంబంధించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మరోవైపు, మీ జీవిత భాగస్వామికి మీతో చాలా ఫిర్యాదులు ఉంటాయి. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12:50 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో హెచ్చు తగ్గులుంటాయి. ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా పని చేయాలి. ఎందుకంటే ఉన్నతాధికారుల నిఘా పర్యవేక్షణ మీపై ఎక్కువగా ఉంటుంది. మరోవైపు వ్యాపారులు భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. మీ మధ్య తేడాలు ఉంటే, వ్యాపారంలో భారీ నష్టాలను కలిగిస్తాయి. మూడవ వ్యక్తి ఎవరైనా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మీ కుటుంబ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. అయితే మీ బడ్జెట్ ప్రకారం ఖర్చులు చేయాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ అనియంత్రిత కోపం మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది, ముఖ్యంగా పని విషయంలో, మీరు ఓపికపట్టాలి. ఈరోజు మీ పని అకస్మాత్తుగా ఆగిపోయే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో సీనియర్లతో వాదనలు మానుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు చాలా తెలివిగా ఖర్చులు చేయాలి. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 40

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 13, 2021

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published: Sunday, June 13, 2021, 5:00 [IST]