For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం దినఫలాలు : వ్యాపారవేత్తలు ఈరోజు తొందరపడకూడదు...!

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Sun Transit in Gemini on 15 June 2021: సూర్యుడు మిధునంలో ఎంట్రీ.. 12 రాశులపై ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలుSun Transit in Gemini on 15 June 2021: సూర్యుడు మిధునంలో ఎంట్రీ.. 12 రాశులపై ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలు

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి మంచి సలహాలు, సూచనలు పొందుతారు. ఈరోజు మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. మీరు ఏదైనా క్రొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తొందరపడొద్దు. మీ నిర్ణయాలను తెలివిగా తీసుకోండి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధంలో సామరస్యం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో విదేశీ కంపెనీలో పనిచేసే వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీ పనుల్లో కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. మీరు మీ అధ్యయనాలు పూర్తి చేసి, ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీరు ఈరోజు నిరాశకు గురవుతారు. కానీ మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వ్యాపారులు ఈరోజు మంచి ఫలితాలను పొందొచ్చు. మీ వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులకు బలమైన అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో ప్రతి చిన్న పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు ఏదైనా తప్పు చేస్తే మీ పురోగతి ఆగిపోతుంది. వ్యాపారులు ఈరోజు ఏ విషయంలో తొందరపడకూడదు. మీ పెండింగ్ పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. మీ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండండి. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

ఈ రాశుల వారు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ.. ఇతరులను మోసం చేస్తారట...! వీరితో జర జాగ్రత్త..!ఈ రాశుల వారు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ.. ఇతరులను మోసం చేస్తారట...! వీరితో జర జాగ్రత్త..!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది. మీరు చాలా ప్రయోజనం పొందవచ్చు. మీ పెండింగ్ పనులను కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఈరోజు ముఖ్యమైన రోజు అవుతుంది. అకస్మాత్తుగా మీరు కార్యాలయంలో మీ పురోగతికి సంబంధించిన వార్తలను వినొచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి కావాలంటే, మీరు బ్యాలెన్స్ పాటించాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అయితే, ఈరోజు మీరు రుణాలు ఇవ్వడం మానుకోవాలి. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈరోజు మీరు చాలా రిఫ్రెష్ అవుతారు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 37

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకోవడం మంచిది. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలోని సీనియర్ అధికారులతో వాదనలు మానుకోండి. మీరు ఈరోజు కొన్ని ఇబ్బందుల్లో పడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. ఈరోజు మీకు ఎక్కువ పనిభారం ఉంటుంది. అయితే, మీ పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. మీరు వ్యాపారవేత్త అయితే ఈ రోజు మీరు లాభం సంపాదించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు విద్యార్థులకు చాలా మంచి రోజు కానుంది, ముఖ్యంగా మీరు ఇటీవల ఏదైనా పోటీ పరీక్షలో పాల్గొన్నట్లయితే, మీరు విజయం సాధించొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొత్త భాగస్వామితో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇది కాకుండా, మీరు సహోద్యోగుల పనిలో ఎక్కువగా జోక్యం చేసుకోకపోతే మంచిది. ఈరోజు బాస్ తో ఒక ముఖ్యమైన సమావేశం ఉండవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీకు తోబుట్టువులతో సంబంధాలు బలంగా ఉంటాయి. మీరు వివాహం చేసుకుంటే మీ వివాహ జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, ఈ రోజు దానికి అనుకూలమైన రోజు. ఆరోగ్యం విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 39

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

Solar Eclipse 2021: సూర్యగ్రహణం వల్ల ఈ 5 రాశుల వారికి ఇబ్బందులు...!Solar Eclipse 2021: సూర్యగ్రహణం వల్ల ఈ 5 రాశుల వారికి ఇబ్బందులు...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతాధికారులను మెప్పించడానికి మీపై ఎక్కువగా ప్రయత్నించొద్దు. ఒకేసారి ఒక పనిని మాత్రమే చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారవేత్తలు తొందరపడి ఏ పని చేయకండి. ఇది కాకుండా, మీరు చట్టపరమైన పందాలను కూడా నివారించాలి. ఫ్యామిలీ ఫ్రంట్‌లో కొంత టెన్షన్ ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు బలహీనంగా ఉండొచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ అలవాటు వల్ల ఈరోజు కార్యాలయంలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ బాస్ ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారులు ఈరోజు చాలా ప్రయాణించాల్సి ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగుంటుంది. మీరు ఇంటి సభ్యులందరి మద్దతు పొందుతారు. మీ తోబుట్టువులతో సంబంధంలో తీపి పెరుగుతుంది. ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు ఈరోజు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఈరోజు ఆర్థిక పరంగా ఖరీదైనది. అకస్మాత్తుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారవేత్తలకు ఈరోజు మంచి రోజు కానుంది. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఉద్యోగాలను మార్చాలని యోచిస్తున్నట్లయితే, మీరు మీ నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు మీ తల్లిదండ్రుల ప్రేమ మరియు మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన చాలా బాగుంటుంది. ఈరోజు మీకు మీ ప్రియమైన వారితో తగినంత సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో చాలా బ్యాలెన్స్ గా ప్రవర్తించాలి. మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా పెండింగ్ పనులపై చాలా ఎక్కువ శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు కానుంది. కాబట్టి అనవసరమైన విషయాలలో వృథా చేయకండి. శ్రద్ధగా అధ్యయనం చేయండి. మీరు కచ్చితంగా విజయం పొందుతారు. మీ జీవిత భాగస్వామితో వివాదం పెరిగే అవకాశం ఉంది. మీరు ఆలోచనాత్మకంగా మాట్లాడాలి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 4:40 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు అకస్మాత్తుగా ప్రయాణించాల్సి ఉంటుందది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే వ్యక్తులు ఈరోజు కొన్ని శుభవార్తలు పొందొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రవాణాకు సంబంధించిన వ్యాపారం చేస్తున్న ప్రజలకు ఈరోజు చాలా ఒత్తిడితో కూడిన రోజు కానుంది. మీరు కొన్ని పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయడం మంచిది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో పవిత్రమైన రోజు అవుతుంది. అకస్మాత్తుగా మీరు కొన్ని శుభవార్తలను వినొచ్చు. మీ ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం మరియు ఇతర కుటుంబ సభ్యుల ప్రేమను పొందుతారు. కొంతకాలంగా, మీ జీవిత భాగస్వామి రోజువారీ పనులలో బిజీగా ఉంటే మరియు మీ పట్ల శ్రద్ధ చూపలేకపోతే, ఈ రోజు మీకు అద్భుతమైన రోజు కానుంది. ఈరోజు మీ ప్రియమైన వారు ఇంట్లో మీ కోసం ఆశ్చర్యం కలిగించవచ్చు. ఆర్థిక పరిస్థితిలో కొంత మెరుగుదల ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 3 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 16, 2021

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published: Wednesday, June 16, 2021, 5:00 [IST]