Latest Updates
-
మే 4: ఈ రాశుల వారికి ఊహించని ధన యోగం.. కెరీర్లో తిరుగులేని సక్సెస్! -
వేడి అన్నంలో చల్లటి బెండకాయ పెరుగు పచ్చడి..ప్రతి ముద్దా ఆహా అనిపించాల్సిందే! -
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు! -
వృశ్చికం, సింహం, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 04 మే 2026 -
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే
గురువారం మీ రాశిఫలాలు (18-06-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. మీరు ఈరోజు విశ్రాంతిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక పరంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆదాయాన్ని పెంచాలని భావిస్తే.. చాలా ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాలి. పనిలో ఉండే ప్రజలు ఈరోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మంచి ప్రయోజనం పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. మీ ప్రియమైనవారు మీ ఉత్సాహాన్ని పెంచుతారు.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి 12:45 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈ రోజు వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. కొంతమంది ఇంటి సభ్యులు మీ పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు తెలివిగా వ్యవహరించాలి. మరోవైపు మీరు ఆర్థిక పరంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఉద్యోగులు ఈరోజు సహోద్యోగులతో సన్నిహితంగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో కష్టపడాల్సి వస్తుంది. మీరు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:45 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు పనిలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజు మీ ప్రణాళిక ప్రకారం మీ పనులన్నీ పూర్తవుతాయి. అది ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా, ఈ రోజు మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు మంచిగా ఉంటుంది. సమయానికి మీ డబ్బు మీకు దక్కడం వల్ల మీ సమస్య పరిష్కారమవుతుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీరు ఓపికగా వ్యవహరిస్తే పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి వస్తుంది.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 10:45 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార పరంగా మంచి ఫలితాలు వస్తాయి. మీకు డబ్బు సంబంధిత ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుంది. మీరు ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే, మీరు చిన్నస్థాయిలో ప్రారంభించడం మంచిది. ఉద్యోగులకు ఈరోజు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మీ ముఖ్యమైన పనులు ఈ రోజు సమయానికి పూర్తవుతాయి. మీరు ఈ రోజు కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆనందిస్తారు. మీ జీవిత భాగస్వామిని గౌరవించండి. ఆరోగ్యంగా ఉండేందుకు మీరు క్రమం తప్పకుండా యోగా మరియు ధ్యానం చేయాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఆదాయం విషయంలో అప్రమత్తంగా లేకుంటే, మీకు నష్టం ఎదురవుతుంది. అయితే మీరు నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. మీరు పని చేసే ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి. అలాగే సకాలంలో పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి. మీకు భావోద్వేగ మద్దతు కూడా లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మంచి రోజు అవుతుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 32
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో ఏదైనా ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది. సహోద్యోగులతో సహకారం బలహీనపడుతుంది. అయితే మీరు ప్రశాంతంగా ఉండి, పరస్థితులను నిర్వహిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు మీ కుటుంబ జీవితంలో కొన్ని కలహాలు ఉండొచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో సక్రమంగా వ్యవహరించాలి. లేదంటే మీ స్వభావం వల్ల వారు మీకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీకు ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8:45 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఆదాయం పెంచుకోవాలని భావిస్తుంటే, మీరు నిరాశకు గురవుతారు. అయితే మీరు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈరోజు మీకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు సకాలంలో పనులన్నీ పూర్తి చేసుకోవాలి. ఈరోజు వ్యాపారులకు మంచిగా ఉంటుంది. ఈరోజు మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి 12:25 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితం వస్తుంది. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. అలాగే ఈ రోజు మీకు పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. మీరు సీనియర్ అధికారులతో కూడా వేగవంతంగా పని చేస్తారు. విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పైసి ఫుడ్ తినడం మానుకోండి. మీరు తాజా పండ్లు మరియు ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తినాలి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి ఉదయం 11:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు, మీరు మతపరమైన పనిలో ఎక్కువ అనుభూతి చెందుతారు. మీరు పేదవారికి కూడా సహాయం చేయవచ్చు. ఉద్యోగులు చేసే పనిని బట్టి ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఈరోజు మీరు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోలేరు. అందుకు సమయం అనుకూలంగా లేదు. వ్యాపారులు కూడా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక పరంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. మీరు శారీరకంగా మంచి అనుభూతి చెందుతారు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి 8:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు పనిలో ఉండేవారికి, వారి యజమానితో సానుకూలంగా ఉంటుంది. మరోవైపు వ్యాపారులు ఈరోజు ఆశించిన ఫలితాలు పొందలేరు. ఆర్థిక పరంగా ఈరోజు ఒక సమస్య కూడా ఎదురవుతుంది. మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ కుటుంబానికి భావోద్వేగ మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ ఎల్లో
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు ఒక పెద్ద సమస్య పరిష్కరించబడుతుంది. మరోవైపు ఉద్యోగులు ఈరోజు ఒక సమస్యను ఎదుర్కొంటారు. అయితే మీరు తెలివితేటలతో మరియు కష్టపడి పని చేస్తే కచ్చితంగా విజయం పొందుతారు. మీ ఇంటి వాతావరణం కూడా చాలా బాగుంటుంది. మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి మీకు అవకాశం దక్కుతుంది. మీ ఆనందాన్ని వారితో పంచుకుంటారు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రోజు మీరు ఏదైనా పాత రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. ఇది మీ పెద్ద చింతను తొలగిస్తుంది. పెండింగులో ఉన్న పనులు కూడా త్వరగానే పూర్తవుతాయి. విద్యార్థులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : సాయంత్రం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications