ఆదివారం మీ రాశిఫలాలు (21-06-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ పనులన్నీ ప్రణాళికబద్ధంగా పూర్తవుతాయి. ఈ రోజు ఐటి రంగానికి లేదా మీడియాతో సంబంధం ఉన్నవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు వ్యాపారులకు మంచి అవకాశం లభిస్తుంది. మీరు మీ వ్యాపారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ కుటుంబ జీవితంలో సమస్యలకు పరిష్కారం దొరకుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిరోజు అవుతుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. మీ పనిలో మీకు ఈరోజు గొప్ప గౌరవం దక్కే అవకాశం ఉంది. వ్యాపారులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు కనబడుతున్నాయి. అయితే, మీరు అకస్మాత్తుగా ఓ సమస్యను ఎదుర్కొంటారు. మీరు ఈ సమస్య నుండి బయటపడితే, మీకు కచ్చితమైన ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబం నుండి ప్రేమను పొందడం ద్వారా మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామితో సంబంధం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైనవారు మిమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారో మీకు అనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు అందరితో చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు. ఇది ప్రజలలో మీ ఇమేజ్‌ను బలోపేతం చేస్తుంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు చాలా బిజీగా ఉంటారు. పని ఒత్తిడి కారణంగా, మీకు తగినంత సమయం లభించద. వ్యాపారులు ఈరోజు ఊహించిన ఫలితాలు రాకపోవడంతో, మీరు నిరాశ చెందే అవకాశముంది. అయితే మీరు ఒత్తిడిగా ఫీలవ్వకండి, ఎందుకంటే త్వరలోనే పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా మీరు ఖర్చులను నియంత్రించాలి. ఆరోగ్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9:15 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా పనిని పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు విజయం దక్కకపోతే మీరు నిరాశ చెందాల్సిన పనిలేదు. సానుకూలంగా ప్రయత్నిస్తే కచ్చితంగా ఫలితంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. సహోద్యోగులతో మాట్లాడి సమయాన్ని వృథా చేయవద్దు. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలు ఎదురవుతాయి. మీరు తీసుకున్న ఇటీవలి నిర్ణయాల వల్ల సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు చేసే పనిలో ఈరోజు మీరు చాలా నిరాశ చెందుతారు. ఎందుకంటే మీరు ఆశించిన ఫలితం మీకు లభించదు. ఉద్యోగులు ఈరోజు తమ జాబ్ మారాలని ఆలోచిస్తుంటారు. మరోవైపు వ్యాపారులుకు ఈరోజు ఒక పెద్ద ఉపశమనం రావచ్చు. మరోవైపు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు కుటుంబంతో ఆనందకరమైన రోజు అవుతుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:15 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పూర్తి స్థాయిలో ఆనందిస్తారు. ఈరోజు మీకు ఎలాంటి ఒత్తిడి అనేది ఉండదు. మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. మీ కెరీర్‌లో మీకు ఏమైనా సందిగ్ధత ఉంటే, ఈ రోజు మీరు ఒకరి నుండి కొన్ని ముఖ్యమైన సలహాలను పొందవచ్చు. ప్రత్యేకించి మీరు మీ ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలి కొత్త కంపెనీలో చేరాలనుకుంటే. మరోవైపు, మీరు బట్టల వ్యాపారులకు ఈ రోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. భారీ ఆర్థిక ప్రయోజనాల సంకేతాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో పరిస్థితులు హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. అకస్మాత్తుగా ఖర్చులు పెరగొచ్చు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని విషయాల్లో ఆందోళన పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన పనిని సాధించడంలో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనది. మీకు ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు పని భారం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులు తమ సహోద్యోగులను కూడా ఎక్కువగా విశ్వసించరు. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : సాయంత్రం 4:20 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పూర్తి విశ్వాసంతో పని చేయాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు దగ్గరి బంధువు లేదా స్నేహితుడికి ఆర్థికంగా సహాయం చేయవచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం చాలా బాగుంటుంది. ఈరోజు కుటుంబ పరంగా ఆనందకరమైన రోజు అవుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు విశ్రాంతిపై ఎక్కువ శ్రద్ధ చూపాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు అన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ బలహీనతలను అధిగమించి బలమైన వ్యక్తిగా మారాలి. మీరు కష్టపడి, శ్రద్ధగా పని చేస్తే మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు నిరాశ ఎదురవ్వచ్చు. మీరు ఊహించిన విధంగా ఆర్థిక లాభం పొందకపోవడం వల్ల మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. మానసికంగా ఒత్తిడి పెరగడం వల్ల ఆరోగ్య పరంగా కొన్ని శారీరక సమస్యలు ఎదురుకావచ్చు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు జీవితంలో పెద్ద మార్పు ఉండొచ్చు. మీరు నిరుద్యోగులైతే, ఈరోజు మంచి ఫలితాలను పొందవచ్చు. వ్యాపారవేత్తలకు ఈరోజు పూర్తి కొన్ని ప్రయోజనాలు దక్కుతాయి. మీ పని వేగంగా పూర్తవుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే మీరు ఆదాయం వంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో మెరుగైన పరిస్థితులు ఉంటాయి. మీ ఆలోచనలో సానుకూలత ఉంటుంది. మీరు కోల్పోయిన విశ్వాసం మళ్లీ తిరిగి వస్తుంది. మీ కుటుంబంలో శాంతి ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడటం చూస్తే మీ ఆందోళన కూడా తొలగిపోతుంది. ఆర్థిక పరంగా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మీరు తొందరపడకుండా ఉండాలి. మీరు వైవాహిక జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. మీ జీవిత భాగస్వామికి ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీకు మానసిక శాంతి కలుగుతుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా జీవిత భాగస్వామితో గొడవ ఉండొచ్చు. ఇలాంటి సమయంలో చాలా ఓపికగా వ్యవహరించాలి. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఆధిపత్యం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ మనసులో అలాంటి ఆలోచనలు రానివ్వకండి. త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీరు కొంత సమయం తీసుకుని, మీ పనిపై కొంచెం శ్రద్ధ పెడితే బాగుంటుంది. అయితే ఎక్కువ పని చేయకండి. పూర్తి విశ్వాసంతో ఉండాలి. మరోవైపు మీరు ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి రాత్రి 10 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Sunday, June 21, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion