For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం మీ రాశిఫలాలు (25-06-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope June 25, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఆషాడ మాసంలో అత్తా, కోడళ్ల పోరు పడకూడదనే విడిగా ఉంటారా? మరేదైనా కారణం ఉందా?ఆషాడ మాసంలో అత్తా, కోడళ్ల పోరు పడకూడదనే విడిగా ఉంటారా? మరేదైనా కారణం ఉందా?

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో మీరు మీ భాగస్వామి మాట జాగ్రత్తగా వినాలి. వారు మీ నుండి ఏమి ఆశించారో తెలుసుకోవాలి. ఈరోజు మీరు చాలా కష్టపడి పని చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మరోవైపు మీరు కుటుంబంపై కొంత ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ బ్లాక్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

 వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగులకు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే వ్యాపారులకు ఈరోజు కొన్ని లాభాలు వస్తాయి. కటుంబ విషయంలోనూ ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. మానసికంగా కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:20 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఇటీవల ఎందులో పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు ఈరోజు మంచి లాభం పొందవచ్చు. ఉద్యోగులకు పని విషయంలో, వ్యాపారులకు వ్యాపారం విషయంలో ఈరోజు చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. అయితే మీ కుటుంబ జీవితంలో కొంత ఉద్రిక్తత ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : ఉదయం 9:50 నుండి మధ్యాహ్నం 2:25 గంటల వరకు

ఆశాఢ గుప్త నవరాత్రి డే 2 ప్రాముఖ్యత: బ్రహ్మచారిని పూజ, విధి మరియు మంత్రంఆశాఢ గుప్త నవరాత్రి డే 2 ప్రాముఖ్యత: బ్రహ్మచారిని పూజ, విధి మరియు మంత్రం

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈ రోజు కెరీర్‌కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈ నిర్ణయంపైనే మీ విజయం లేదా ఓటమి ఆధారపడి ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. ఉద్యోగులకు ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. ఉన్నతాధికారుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే వ్యాపారులకు ఈరోజు లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే ఖర్చులు కూడా అదేవిధంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6:40 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీరు ఈరోజు ఏ పని అయినా చాలా సులభంగా చేసేస్తారు. ఆర్థిక పరంగా కూడా ఈరోజు అనేక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో ఈరోజు చాలా సులభంగా అమ్మకాలు జరుగుతాయి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీకు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు

 కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కొంత కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మీ పనులు సమయానికి పూర్తి కావు. ఉద్యోగులకు సీనియర్లతో సమన్వయం లోపిస్తుంది. మరోవైపు వ్యాపారులు కూడా ఊహించిన ఫలితాలను పొందలేరు. ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే పెద్దగా సమస్యలు ఉండవు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో అంతా సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఏదైనా సమస్య తలెత్తితే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా భావిస్తారు... ఆధ్యాత్మికంగా మాత్రం గొప్ప ఫలితమొస్తుందట.. ఎందుకు?ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా భావిస్తారు... ఆధ్యాత్మికంగా మాత్రం గొప్ప ఫలితమొస్తుందట.. ఎందుకు?

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో విద్యార్థులకు విద్యలో ఏవైనా సమస్యలుంటే, గురువుల సహాయం తీసుకోవాలి. ఈ సమయంలో అధ్యయనాల పట్ల అజాగ్రత్తగా ఉంటే, రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు పెరుగుతాయి. ఈరోజు ప్రభుత్వ విభాగంలో పని చేసే వారికి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మరోవైపు వ్యాపారులకు ఈరోజు కొంత ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఈరోజు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. మీ భాగస్వామితో కలిసి వ్యాపారం చేయడం మంచిది. మరోవైపు మీ కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామిలో కూడా కొంత మార్పు వస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, బయటి ఆహారం తినడం మానేయండి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. అయితే ఉద్యోగులకు మాత్రం ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈరోజు ఎలాంటి పనులను పెండింగుంలో ఉంచకండి. వ్యాపారులు ఈరోజు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, మీకు కొన్ని అడ్డంకులు రావచ్చు. మీరు మీ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. పిల్లల నుండి ఏదైనా శుభవార్త వచ్చినందుకు

మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 6:20 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు కష్టంగా ఉంటుంది. మీకు అధ్యయనాలపై ఆసక్తి తక్కువగా ఉంటుంది. మీరు ఏకాగ్రతను కొనసాగించడానికి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఈరోజు పని విషయంలో సాధారణంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు ఎలాంటి ప్రత్యేక లాభాలు ఉండకపోవచ్చు. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే, మీరు చాలా ఆందోళన చెందుతారు.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి 5:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు పవిత్రమైన రోజు అవుతుంది. మీకు పదోన్నతి పొందడానికి కూడా అవకాశం లభిస్తుంది. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే, మీరు మంచి ఆఫర్ ను పొందవచ్చు. వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. మీరు వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తుంటే, ఈరోజు మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఈరోజు కుటుంబపరంగా సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు మానసిక శాంతిని కాపాడుకోవాలనుకుంటే, మీరు అనవసరమైన చర్చకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీరు మీ పనిపై మీ దృష్టిని కేంద్రీకరించాలి. ఉద్యోగులు ఈరోజు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేస్తే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఈరోజు పని విషయంలో చాలా ముఖ్యమైన రోజు. ఉద్యోగులకు ఈరోజు ఒక గొప్ప అవకాశం లభిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఎక్కువగా అప్పులను ఇవ్వకూడదు. అది మీకు నష్టం కలిగించవచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 25, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Wednesday, June 24, 2020, 18:23 [IST]
Desktop Bottom Promotion