Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
గురువారం మీ రాశిఫలాలు (12-03-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలను పొందవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది. ఉద్యోగులకు ఈరోజు మంచి ఆఫర్ రావచ్చు. ఆర్థిక పరంగా కూడా ఈరోజు మంచి ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఆదాయం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించకుండా ఆర్థిక పరమైన నిర్ణయాలను తీసుకోకండి. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది. ఈ రోజు మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మీ ప్రియమైన వారికి అందులో మద్దతు లభిస్తుంది.
లక్కీ కలర్ : కుంకుమ
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, మీరు కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఈరోజు చాలా ఓపికగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి నుండి ఈరోజు మద్దతు లభించకపోవడం వల్ల మీరు నిరాశ చెందుతారు. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామితో ఈరోజు ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడండి. ఆరోగ్యంగా ఉండేందకు కొంచెం వ్యాయామం చేయండి.
లక్కీ కలర్ : లైట్ రోజ్
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు శృంగార జీవితంలో అకస్మాత్తుగా ఓ పెద్ద సమస్య ఉండవచ్చు. ఈరోజు మీ ఇద్దరి మధ్య అపార్థాలకు కారణమవుతుంది. అయితే ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చు. అలాగే పనిలో వచ్చే అడ్డంకులు మీకు ఒత్తిడిని కలిగిస్తాయి. మీ నుండి ఏదైనా ఎక్కువగా ఆశించే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఆరోగ్య పరంగా కొంత గందరగోళంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా పని విషయంలో పని విషయంలో ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగం ఎదురుచూస్తున్నట్లయితే, ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు పొందవచ్చు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో రొమాంటిక్ గా ఉంటుంది. చాలా కాలం తరువాత, మీరిద్దరూ అలాంటి సమయాన్ని ఒకరితో ఒకరు గడుపుతారు. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. కుటుంబంలో శాంతి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులలో ఐక్యత ఉంటుంది. ఆర్థిక పరంగా అదనపు ఆదాయం కావాలంటే, కొంచెం ఎక్కువగా కష్టపడాలి. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి సాయంత్రం 5:55 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారి ఆరోగ్యం ఈరోజు చాలా బాగా ఉంటుంది. మీరు క్రమం తప్పకుండా యోగా మరియు వ్యాయామం చేయడం ద్వారా మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మంచి అనుభూతి చెందుతారు. పని విషయంలో ఈరోజు చాలా ముఖ్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు బదిలీ లేదా ప్రమోషన్ వంటి పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మార్పు మీకు సానుకూల ఫలితాలను తెస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు కొత్త పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, మీరు మీ నిర్ణయాన్ని వాయిదా వేయడం మంచిది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 5:55 నుండి మధ్యాహ్నం 2:45 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు వివాహం చేసుకుంటే, ఈ రోజు మీకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే, వారు దానిని పరిష్కరించడంలో మీకు సహాయం చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబలో ఈరోజు ఏదైనా గొడవలు ఉండొచ్చు. పని పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండండి.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:15 నుండి రాత్రి 7 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు కొత్త ఆలోచనలతో నిండి ఉంటారు. వాటి నుండి పూర్తి ప్రయోజనం పొందుతారు. ముఖ్యంగా పని విషయంలో ఈరోజు సరైన ఫలితాలను పొందుతారు. ఈరోజు మీ ప్రమోషన్ కల నెరవేరే అవకాశం ఉంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో గడిపిన అందమైన క్షణాలను గుర్తుంచుకోవడం ద్వారా మీరు ఈ రోజు ఆశ్చర్యపోతారు. ఈ రోజు మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి మీరు ఇష్టపడే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 7:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు మంచి అనుభూతి చెందుతారు. మీరు ఈరోజు చాలా సరదాగా ఉంటారు. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. కార్యాలయంలో కూడా పనిభారం చాలా తేలికగా ఉంటుంది. వారాంతంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. పెండింగ్ పనులను పూర్తి చేయాలి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన ఆందోళనలన్నీ తొలగిపోయి ఆదాయం సంపాదించే అవకాశాన్నిపొందవచ్చు.మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కృషి మరియు నిజాయితీ విషయంలో కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. మరోవైపు ఈ రోజు మీరు మీ భాగస్వామితో మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ప్రణాళిక చేయవచ్చు. మీరు ఆత్మవిశ్వాసంతో చేసే పని ఎల్లప్పుడూ విజయవంతం అవుతుంది. ఈరోజు మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. మీరు మీ వివాహ జీవితం గురించి మాట్లాడితే, మీ జీవిత భాగస్వామితో సంబంధాన్ని మెరుగుపర్చడానికి, మీరు మీ ప్రియమైన ఆలోచనలకు ప్రాముఖ్యత ఇవ్వాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : రాత్రి 7:30 నుండి రాత్రి 10:05 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈ రోజు వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీరు మీ ఇంటి అలంకరణ నుండి మరమ్మత్తు వరకు పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. ప్రేమ విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. అకస్మాత్తుగా సంపద లాభదాయకంగా మారుతుంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి.ఈరోజు మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు అన్ని విషయాలు సానుకూలంగా ఉంటాయి. మీరు చిన్న చిన్న విషయాల నుండి నేర్చుకోవడం వంటివి తెలుసుకోవాలి. వ్యాపారులకు ఈరోజు ప్రత్యేక ప్రయోజనం ఏమీ లభించదు. అయితే ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు ఈరోజు సత్పలితాలు ఇస్తాయి. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండండి. మానసికంగా మీరు కొంత ఒత్తిడిని అనుభవిస్తుంటే మీకు ఈ సమయంలో మీరు తగిన విశ్రాంతి తీసుకోవాలి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు చాలా కష్టంగా ఉన్నప్పటికీ, కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు, మీ జీవిత భాగస్వామి యొక్క కఠినమైన ప్రవర్తనలో మీరు కొంత మృదుత్వాన్ని కనుగొనవచ్చు. మీ మధ్య దూరాన్ని తొలగించడానికి, మీరు వారితో బహిరంగంగా మాట్లాడాలి. వారు మీ భావాలను అర్థం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు, శృంగార జీవితంలో సానుకూల ఫలితాలు ఆశించబడతాయి. మీరు మీ భాగస్వామితో ఆనందాన్ని అనుభవిస్తారు. మీరు ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు



Click it and Unblock the Notifications











