For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం మీ రాశిఫలాలు (19-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, గురువారం వారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు అన్ని పనులు పూర్తి కాకపోవచ్చు. అయితే మీకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. అయితే మీరు అవసరం కంటే ఎక్కువ ఖర్చు చేయవచ్చు. ఈ సమయంలో, మీరు ఆర్థిక విషయాలలో ఆలోచిస్తూ ముందుకు సాగాలి. ఖర్చు చేయడం కంటే ఎక్కువ ఆదా చేయడంపై దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారులకు పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. మరోవైపు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:15 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. పని విషయంలో మీ యజమానికి మీపై ఒత్తిడి పెంచొచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఈ ఉదయం మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ రోజు వారితో సమయం గడపడం ద్వారా మీరు మీ కష్టాలన్నీ మరచిపోతారు. మొత్తంమీద, ఈ రోజు మీకు మంచి రోజు కానుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 4:50 నుండి మధ్యాహ్నం 1:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు కార్యాలయ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మీరు పని చేయడంలో వేరే ఆనందం పొందుతారు. ఈ రోజు మీ పని తీరు ప్రశంసించబడుతుంది. మీరు వ్యాపారం చేస్తే, ఈ సమయంలో మీ భాగస్వామితో సంబంధాన్ని మెరుగుపర్చడానికి ప్రయత్నించాలి. వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం తీపిగా మరియు బలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. మీరు మానసిక మరియు భావోద్వేగ సామర్థ్యాన్ని పెంచడానికి రోజు యోగా మరియు ధ్యానం చేయండి. ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఇతరులను నమ్మకూడదు. ఈ రోజు మీకు ఆస్తికి సంబంధించిన ఏదైనా విషయానికి సంబంధించి కుటుంబసభ్యులతో విభేదాలు ఉండవచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిగ్రహాన్ని కోల్పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి ఈ రోజు బాగా ఉండదు. మీరు కార్యాలయంలో కష్టపడి పని చేయాలి. కానీ మీ పనిని పూర్తి చేయడంలో మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 42

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:05 నుండి సాయంత్రం 5 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు చాలా నిరాశ చెందుతారు. అయితే మీరు ప్రయత్నం చేస్తూనే ఉంటూనే, మీకు త్వరలో సానుకూల ఫలితం లభిస్తుంది. పని వంటి విషయాలలో ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచిస్తుంటే, ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. తొందరలో నిర్ణయం తీసుకోకండి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. పెట్టుబడులు ఈరోజు పెట్టకండి. మీరు కుటుంబ సభ్యుల నుండి ప్రేమ మరియు మద్దతు పొందుతారు, తద్వారా ప్రతికూల పరిస్థితులలో కూడా మీ విశ్వాసం పెరుగుతుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 5:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు సానుకూల ఫలితాలను పొందవచ్చు. మీ పట్టుదల మరియు సహనం వల్ల మీరు ఎలాంటి సమస్యలనైనా సులభంగా ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీరు పాజిటివిటీని అనుభవిస్తారు. మీ ప్రేమ నిజమని భావిస్తారు. వివాహితులకు ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ ఈ రోజు మీరు ఎక్కువ ఆదా చేయలేరు.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. మీరు మీ రోజును పూర్తి స్థాయిలో ఆనందిస్తారు. మీరు ఈ రోజు స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఈ రోజు మీరు ఒత్తిడికి దూరంగా ఉంటారు. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. వివాహిత జంటలు ఈరోజు అనవసరమైన చర్చను చేయకపోవడం మంచిది. ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. ఈ రోజు మీ ఆర్థిక ప్రయత్నాలు ఏవైనా విజయవంతమవుతాయి. ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయంలో జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. మీరు సమయం తీసుకొని మీ మీద దృష్టి పెట్టడం మంచిది. మీ భావోద్వేగాలను నియంత్రించండి. బాధ్యతా రహితమైన పనులు చేయకుండా ఉండండి. ఎందుకంటే తర్వాత మీరే చింతించాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం పరంగా కొంత ఆందోళన ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక సమస్యల కారణంగా మీరు చాలా బలహీనంగా ఉండాల్సి రావొచ్చు. ఈరోజు పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి. మీరు ఓపికగా వ్యవహరించాలి. ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు రావచ్చు. ఈరోజు, అనవసరమైన పనులకు దూరంగా ఉండండి. మీ ముఖ్యమైన సమస్యలపై దృష్టి పెట్టండి. ఈ రోజు మీకు ఒకరితో గొడవ ఉన్నప్పటికీ, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు చాలా తెలివిగా వ్యవహరించాలి. పని విషయంలో ఈరోజు ముఖ్యమైన రోజు. మీరు ఉన్నత స్థానాన్ని పొందాలని కోరుకుంటే, ఈరోజు మీరు మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాన్ని పొందవచ్చు. మీరు దాని పూర్తి ప్రయోజనాన్ని పొందడం మంచిది. మీ ఉత్తమమైన దాన్నిఇవ్వడానికి ప్రయత్నించండి. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా అంతా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు మానసికంగా బలంగా ఉంటారు. మీరు మంచి ఆరోగ్యం యొక్క గొప్ప ప్రయోజనాలను పొందుతారు. ఈ రోజు మీరు మీ అన్ని పనులను పూర్తి విశ్వాసంతో చేస్తారు. ఇది మాత్రమే కాదు, చాలా కాలం తరువాత, మీరు మీ ఆసక్తులపై కూడా శ్రద్ధ చూపుతారు. మీకు సంతోషాన్నిచ్చే పని చేస్తారు. మీరు ఈ విధంగా సానుకూలతతో జీవితంలో పురోగతి సాధిస్తే, మీరు ఇంకా పెద్ద సమస్యను మరింత చిన్నదిగా కనుగొంటారు. ఇంటి వాతావరణం బాగుంటుంది. మీరు తల్లిదండ్రుల అభిమానాన్ని పొందుతారు. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీరు ఈరోజు కోపాన్ని నియంత్రించుకవాలి. మీ కోపాన్ని అనవసరంగా కుటుంబంపై చూపొద్దు. మీరు ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే, మీరు ఏ నిర్ణయానికి రాలేరు. మీరు కొంతకాలం వాయిదా వేస్తే మంచిది.

మరోవైపు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఖర్చులు తక్కువగా ఉంటాయి. శృంగార జీవితంలో స్థిరత్వం ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 37

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 11 గంటల వరకు

English summary

Daily Horoscope March 19, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Wednesday, March 18, 2020, 22:48 [IST]
Desktop Bottom Promotion