Latest Updates
-
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే! -
మేషం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? – మంగళవారం, 05 మే 2026 -
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్‌ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! -
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఉలవలతో టేస్టీ వడలు..తయారీ విధానం ఇదే! -
తెలంగాణ-ఏపీలో ఎండల తీవ్రత: గర్భిణీలకు పొంచి ఉన్న ముప్పు ఇదే! -
ఇడ్లీ,దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ కరివేపాకు కొబ్బరి చట్నీ..మామూలు చట్నీల కంటే 100 రెట్లు రుచి! -
వేసవిలో బరువు తగ్గాలా? అయితే మజ్జిగలో ఈ చిన్న పొడి కలిపి తాగితే, మీ పొట్టలోని కొవ్వు మంచులా కరిగిపోతుంది!
ఆదివారం మీ రాశిఫలాలు (22-03-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఆదివారం వారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు పాత కేసులో విజయం సాధించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ సమస్యలు ఈరోజు తొలగిపోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, చిన్నగా ప్రారంభించొచ్చు. మీకుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో పరస్పర స్నేహం మరియు ప్రేమ పెరుగుతాయి.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈరోజు ఒక శుభవార్తను వినొచ్చు. ఈ అద్భుతమైన వార్త విని మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే అది విన్న మీకు సంతోషంగా అనిపించదు. కానీ మీ మానసిక స్థితి ఈరోజు బాగానే ఉంటుంది.పని విషయంలో ఈరోజు ముఖ్యమైన రోజు.మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయడం మంచిది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ ప్రియమైనవారితో సంబంధాలు బాగుంటాయి. ఈ రోజు మీరు కుటుంబం కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 43
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు మీ ప్రేమ జీవితం ప్రారంభమవుతుంది. మీరు ఎవరికైనా ప్రేమ ప్రతిపాదన పెడితే ఈరోజు వెంటనే సానుకూల సమాధానం పొందే అవకాశం ఉంది. వివాహితులు ఈరోజు నిశ్శబ్దంగా గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజుకుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. మీరు అనుకున్నట్టే వారితో ఆనందంగా గడుపుతారు. దీని వల్ల మీ ఒత్తిడి అంతా మాయమవుతుంది. ప్రేమ విషయంలో ఈరోజు చాలా గొప్పగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశం ఉంది. అయితే ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 33
లక్కీ టైమ్ : ఉదయం 11:15 నుండి రాత్రి 8:45 వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఏదైనా అంతరాయం కలగవచ్చు. కానీ,ఉన్నతాధికారుల సహాయంతో మీ సమస్య పరిష్కరించబడుతుంది. ఇది మాత్రమే కాదు, మీ పెండింగ్ పని కూడా ఈ రోజు పూర్తవుతుంది. ఈ రోజు మీ ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఆర్థిక పరంగా లాభాలు కావాలంటే, మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపుతల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీకు సంబంధించిన ఆరోగ్య విషయాలు బాగుంటాయి.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 30
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:45 నుండి రాత్రి 8:15 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఆందోళన ఉండొచ్చు. మీరు చాలా కష్టపడి పని చేసిన తర్వాత కూడా ఫలితం రాకపోతే, మీలో ఏదో లోపం ఉందని భావించాలి. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది.ఈరోజు మీరుఎక్కువ ప్రయోజనం పొందలేరు. ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. మరోవైపుతల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. సాయంత్రం మీరు వారితో పాటు ఏదైనా మత ప్రదేశానికి వెళ్ళవచ్చు.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ :26
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది.ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరపురాని రోజు గడుపుతారు. ఇది మాత్రమే కాదు, మీ ప్రియమైనవారు మీకు ఎంత ప్రత్యేకమైనవారో మీరు అర్థం చేసుకోగలరు. ఈ రోజు కూడా ప్రేమ ప్రేమ విషయంలో, మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన సమస్యలన్నీ ఈరోజు తొలగిపోయే అవకాశం ఉంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి సాయంత్రం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం చాలా బాగానే ఉంటుంది. ఈరోజు మీకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు అన్ని విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది.దూర ప్రాంతాల నుండి కొంతమంది ప్రత్యేక అతిథులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ఓ విషయంలో విసుగు చెందుతారు. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.మానసిక ఒత్తిడి కారణంగా, మీరు ఈ రోజు పనిలో సరిగ్గా దృష్టి పెట్టలేరు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. అయితే ఖర్చులపై మీరు ఎక్కువ శ్రద్ధ వహించాలి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 8:15 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది. అవివాహితులకు ఈరోజు వివాహ ప్రతిపాదన రావచ్చు.ఈ రోజు, మీరు మీ కష్టాలన్నింటినీ పక్కన పెట్టి మీ కుటుంబ బాధ్యతలపై దృష్టి పెడతారు. తల్లిదండ్రులు మీతో చాలా సంతోషంగా గడుపుతారు. మీరు వారి ఆశీర్వాదం పొందుతారు. ఈ రోజు మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : ఉదయం 5:55 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన రోజు అవుతుంది. ఉద్యోగులు ఈరోజు సంతోషంగా ఉంటారు. ఈ రోజు వారి నుండి చాలా బలమైన స్పందన వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో, మీరు మీ చర్యల గురించి చాలా తీవ్రంగా ఉండాలి. మీరు వ్యాపారం చేస్తే, ఈ రోజు మీకు ఏదైనా పాత వ్యాపార సంబంధం యొక్క పూర్తి ప్రయోజనం లభిస్తుంది. ఈ రోజు మీ ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 9:50 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి.ఉద్యోగ వ్యక్తులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీకుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ప్రేమ మరియు ఐక్యత కుటుంబంలో ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:05 నుండి రాత్రి 9:05 గంటల వరకు



Click it and Unblock the Notifications