సోమవారం మీ రాశిఫలాలు (23-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, సోమవారం వారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో వివాహితులకు పిల్లల నుండి కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. వారి వ్యవహారం మీకు చాలా ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో మీరు ఎక్కువ శ్రద్ధ వహించాలి. అలాగే మీరు వారికి దిశానిర్దేశం చేయాలి. మరోవైపు మీ జీవిత భాగస్వామి యొక్క అజాగ్రత్త వైఖరి వల్ల మీ ఇద్దరి మధ్య విభేదాలు రావొచ్చు. ఆర్థిక పరంగా కూడా ప్రతికూల పరిస్థితులే కనబడుతున్నాయి. ఆరోగ్యం వంటి విషయాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 9:50 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ప్రేమికులు ఈరోజు ప్రేమ విషయంలో తొందరపడకుండా ఉండాలి. చాలా ఓపికగా ఉండాలి. మీ ప్రియమైన వారిని ప్రేమతో ఒప్పించడానికి ప్రయత్నించండి. వారు మీ పాయింట్‌ను అర్థం చేసుకునే అవకాశం ఉంది. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ పనులన్నీ అంతరాయం లేకుండా పూర్తవుతాయి. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:20 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చాలాకాలంగా పెండింగులో ఉన్న ఓ సమస్య ఈరోజు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో తమ పనిని సజావుగా సాగిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గానే ఉంటుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో సమయం అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 10:15 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. ఆర్థిక పరమైన సమస్యలు ఈరోజు పరిష్కరించబడతాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో చాలా సరదాగా గడుపుతారు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో కొంత సమస్య ఉండవచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి యొక్క ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ప్రేమ విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాల్లో వాదించడం మానుకోవాలి. ప్రేమలో ఉన్న జంటలకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు చాలా ముఖ్యం. మీరు పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తుంటే, మీరు విజయం సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారాన్ని తీసుకోండి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి సాయంత్రం 3 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో వివాహితులు ఈరోజు భాగస్వామి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎంతగా గొడవపడ్డా ఒకరినొకరు ఎంతగా ప్రేమిస్తున్నారో మరచిపోవద్దు. ఆర్థిక పరంగా ఈరోజు ఎక్కువ ఖర్చులు చేసే అవకాశం ఉంది. మీరు అవసరాల మేరకు ఖర్చు పెట్టడం మంచిది. ఉద్యోగులు నిజాయితీగా పని చేయాలి. మీ ఆరోగ్యం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతును పొందుతారు. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా దక్కుతుంది. ఉద్యోగులకు ఈరోజు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు అన్ని పనులను సులభంగా పూర్తి చేస్తారు. మీరు ఈరోజు ఏదైనా సమస్యలో చిక్కుకుంటే, మీ సీనియర్లు మీకు సహాయం చేస్తారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం అందమైన మలుపు తీసుకునే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:25 నుండి సాయంత్రం 4 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీరు ఈరోజు ఇంట్లో లేదా కార్యాలయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలోనే మీరు సంయమనంతో వ్యవహరించాలి. ఆర్థిక పరంగా కూడా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ రోజు వారీ పనులను పూర్తి చేయడంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు ఆరోగ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 32

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు. ప్రేమలో ఉన్న జంటలకు ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఆర్థిక పరంగా కూడా ఈరోజు అదృష్టం కలసి వస్తుంది. మీరు ఈరోజు ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో కూడా పని భారం చాలా తేలికగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : రాత్రి 7:30 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఈరోజు విద్యార్థులకు చాలా కష్టంగా ఉంటుంది. మీరు అనవసర విషయాలపై శ్రద్ధ పెట్టకుండా, లక్ష్యంపై శ్రద్ధ వహించడం మంచిది. మరోవైపు వివాహితులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో గొడవలు పెరగొచ్చు. కోపం పెంచుకోవడం వల్ల మీరే నష్టపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ఆలోచనాత్మకంగా గడపండి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే మీరు అవగాహనతో మీ ఇంట్టోని వారితో మాట్లాడితే ఫలితం సానుకూలంగా రావొచ్చు. మరోవైపు మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు తమ ప్రత్యర్థుల గురించి, ఆలోచించడం మానేసి, తమ సొంత వ్యాపారంపై శ్రద్ధ పెట్టాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 7:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా సమస్యలు ఎదురైతే మీరు ధైర్యంగా, వాటిపై అవగాహనతో, తెలివితేటలతో వాటిని అధిగమించగలుగుతారు. మీ ఇంట్లో ఆనందం కూడా ఉంటుంది. మీ ఇంట్లో వారందరితో ఈరోజు మంచి సంబంధాలను కలిగి ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీతో ఈరోజు ఎక్కువ సమయం గడపాలని కూడా కోరుకోవచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

Story first published: Monday, March 23, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion