Latest Updates
-
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే! -
మేషం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? – మంగళవారం, 05 మే 2026 -
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్‌ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! -
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఉలవలతో టేస్టీ వడలు..తయారీ విధానం ఇదే! -
తెలంగాణ-ఏపీలో ఎండల తీవ్రత: గర్భిణీలకు పొంచి ఉన్న ముప్పు ఇదే! -
ఇడ్లీ,దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ కరివేపాకు కొబ్బరి చట్నీ..మామూలు చట్నీల కంటే 100 రెట్లు రుచి! -
వేసవిలో బరువు తగ్గాలా? అయితే మజ్జిగలో ఈ చిన్న పొడి కలిపి తాగితే, మీ పొట్టలోని కొవ్వు మంచులా కరిగిపోతుంది!
గురువారం మీ రాశిఫలాలు (26-03-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు ప్రయాణానికి దూరంగా ఉండాలి. లేకపోతే మీ ఆరోగ్యం దెబ్బ తింటుంది. అంతేకాదు అలసట వల్ల మీపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈరోజు మీరు చేసే ఏ పని అయినా ప్రశాంతమైన మనసుతో చేయాలి. అప్పుడే మీకు మంచి ప్రయోజనం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : ఉదయం 8:55 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఈరోజు మీ పనిలో మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ వంటి కోరిక నెరవేరే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు చాలా తెలివిగా ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు చాలా డబ్బును ఆదా చేయగలుగుతారు. ఆరోగ్య పరంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : కుంకుమ
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలోని పనులన్నీ పూర్తవుతాయి. ఇది మీకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. మీరు మానసిక శాంతిని కూడా పొందుతారు. మీకు కుటుంబ జీవితంలో సమయం గడపడానికి కొంత అవకాశం దక్కుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకుఅదృష్టం లభిస్తుంది. అయితే మీరు ఆర్థిక విషయాలలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రేమ విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మంచిగానే ఉంటుంది.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12:15 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారిలో ఈరోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పని విషయంలో ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు ఈరోజు ఆత్మవిశ్వాసంతో పని చేయాలి. అప్పుడే మీకు సరైన ఫలితాలు వస్తాయి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి తొలగిపోవడంతో మీకు డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు మీ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. మీరు ఇలాంటి పరిస్థితులను చాలా ఓపికగా భరించాలి. పరిస్థితిని చక్కదిద్దేందుకు మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఆర్థిక లావాదేవీలను చాలా జాగ్రత్తగా చేయాలి.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2:45 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు పని కొంత తేలికగా ఉంటుంది. దీని వల్ల మీకు అదనపు సమయం కూడా లభిస్తుంది. ఈరోజు మీ జీవితంలో మీకు నిరుత్సాహంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మరోవైపుస్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మద్దతు పొందడం ద్వారా మీ విశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు విద్యార్థులకు అనుకూలమైన రోజు. మీ అధ్యయనాలలో జరుగుతున్న ఏదైనా సమస్య ఈ రోజు పరిష్కరించబడుతుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు కొంచెం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో అధికారులతో వాదనకు దిగొచ్చు. మీరు మీ పనిని జాగ్రత్తగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఈరోజు మీరు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది.మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈసారి ఆనందిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 24
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:55 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు వినోదం మరియు ఆనందం నిండి ఉంటుంది. పని విషయంలో ఈరోజు కొందరు పెద్ద ప్రయోజనం పొందుతారు. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మంచిది. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ ఇంట్లో ఈరోజు పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది.ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి రాత్రి 10 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు పెండింగులో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. మీరు మీ నిర్లక్ష్యాన్ని వదిలేయాలి.మీరు స్వయం సమృద్ధి సాధించాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది. ఈ రోజు మీరు చాలా రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. బ్రహ్మాచారుల్లో కొందరు ఈ రోజు ప్రేమ ప్రతిపాదనను పొందవచ్చు. కానీ మీరు మీ భావోద్వేగాలను నియంత్రించాలి. అలాగే తొందరపడకుండా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 30
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు సులభంగా డబ్బును సంపాదించగలుగుతారు. ఈరోజు పని విషయంలో చాలా బిజీగా గడుపుతారు.అకస్మాత్తుగా మీకు అదనపు పనిభారం ఉంటుంది. దీనివల్ల మీకు కొద్దిగా ఒత్తిడిగా అనిపిస్తుంది. అయితే అవగాహనతో మీరు అన్ని పనులను చక్కగా నిర్వహించగలుగుతారు. మీవైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు మద్దతుతో మీరు ఉపశమనం పొందుతారు. మీ సంబంధం కూడా బలపడుతుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు కొందరితో సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు. అయితే మీరు మీ అభిప్రాయానికి కట్టుబడి ఉంటారు. మీరు రాజీపడటానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి సమయంలో మీరు ఎవరి భావాలను బాధించకుండా ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనాలి.మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, త్వరలో మీరు విజయానికి చేరుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కష్టంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 23
లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు మానసిక ఆందోళన కారణంగా, ఈరోజు మీ స్వభావంలో కొంత కోపం వంటివి రావచ్చు. ఇలాంటి సమయంలో మీరు సహనంతో వ్యవహరించాలి. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మరోవైపు మీరు ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:05 గంటల వరకు



Click it and Unblock the Notifications