For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (28-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారి గ్రహాల కదలిక వల్ల ఈరోజు పని విషయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ పనిలో వేగాన్ని పెంచే అవకాశం ఉంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి సరిగ్గా ఉండదు. ప్రేమ విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఆరోగ్య పరంగా కూడా అప్రమత్తంగా ఉండండి. మీ శక్తిని పెంచడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయండి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 8:45 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు మానసికంగా చాలా బలంగా ఉంటారు. మీ మనసు సంతోషంగా ఉంటుంది. ప్రేమ విషయంలో ఈరోజు మరింత సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామిని ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రేమ జంటలకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఏదైనా పనిని ఈరోజు సకాలంలో పూర్తి చేయడం మంచిది. ఈరోజు మీరు మీ కుటుంబసభ్యులతో, ముఖ్యంగా మీ పిల్లలతో సరదాగా గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు కొంత నిరాశ ఉన్నప్పటికీ, ఆదాయ పరంగా త్వరలో మెరుగుదల కనిపిస్తుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొంత చిరస్మరణీయ సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు ఏ సమస్యను అయినా మీరు పరిష్కరించే బలమైన అవకాశం ఉంది. మీరు మీ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే, మీ ముఖ్యమైన పనిని ఈరోజు పూర్తి చేయవచ్చు. ఈరోజు మీరు అన్ని పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీ ఆరోగ్యంలో కొంత సమస్య ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి రాత్రి 9 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో అద్భుతంగా ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఈరోజు తక్కువ లాభం పొందొచ్చు. విద్యార్థులకు ఈరోజు కష్టంగా ఉంటుంది. మీరు ఇలాంటి వాటి నుండి బయటపడటానికి స్నేహితులు లేదా కుటుంబసభ్యులతో కొంత సమయం గడపాలి. ఇది మీ ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో ఈరోజు సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా పవిత్రంగా ఉంటుంది. ఈరోజు మీరు ఏదైనా పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని పొందొచ్చు. అయితే మీరు ఈ సమయంలో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఆరోగ్య పరంగా మీరు అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మీకు ఇబ్బందులు తప్పవు. పెండింగులో ఉన్న పనులను నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీరు సాయంత్రం కొన్ని శుభవార్తలను పొందవచ్చు, ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీ భాగస్వామితో ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. మీకు ఈరోజు పెద్ద ఉపశమనం కలుగుతంది. అయితే మీ కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఇది మీ ఇంటి వాతావరణాన్ని చెడగొడుతుంది. అయితే మీరు సహనంతో మరియు ప్రశాంతంగా వ్యవహరించాలి. మీరు ఈరోజు కూడా పనిలో బిజీగా ఉంటారు. మీ వైవాహిక జీవితంపై ఈరోజు మీరు ఎక్కువ శ్రద్ధ చూపాలి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల మీరు నిరాశ చెందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉండొచ్చు. అయితే ఆదాయం విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. మీరు మీ కుటుంబంపై ఈరోజు ఏ విషయంలో కూడా ఒత్తిడి చేయకూడదు. ఆరోగ్య పరంగా కూడా ఈరోజు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు కష్టపడి పనిచేయడం వల్ల మీరు శారీరకంగా మరియు మానసికంగా అలసిపోతారు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఏ విషయంలో అయినా మీరు కోపం తెచ్చుకోకూడదు. ఎవరైనా మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే మీరు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వాటిని మీరు పట్టించుకోకూడదు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు మద్దతు మీకు లభిస్తుంది. శృంగార జీవితంలో కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే తొందరపడి ఆదాయం వంటి విషయాలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్య పరంగా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో కొందరికి స్నేహితుల మధ్య గొడవలు పెరగొచ్చు. మరోవైపు ఈరోజు పనిభారం కూడా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఈ సమయంలో మీరు మీ నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఏవైనా సమస్యలను మీ జీవిత భాగస్వామితో పంచుకోండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 6 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. మీరు చాలా తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు. మీ ఆదాయం పెరగడం వల్ల మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. పని విషయంలో ఈరోజు ఆనందంగా ఉంటుంది. అయితే ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపలేరు. మీరు మీ పనిలో బిజీగా ఉండవచ్చు. పిల్లల వైపు నుండి ఆనందం వస్తుంది. మీరు వ్యాపారం చేస్తే ఈ రోజు మీకు కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. అయితే, మీరు ధైర్యంతో పనిచేస్తే, త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ఆనందాన్ని చూసి మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మీ ప్రియమైన వారు మిమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారో మీకు అర్థమవుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచి ప్రయోజనం పొందవచ్చు. ప్రేమ విషయంలో ఈరోజు తెలివిగా వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా బాగా ఉంటుంది. ఈ రోజు మీరు కష్టపడి పనిచేస్తారు. ఈ రోజు మీ గొప్ప పనితీరును చూసి మీ సీనియర్లు ఆశ్చర్యపోతారు. సీనియర్ ఆఫీసర్లు మాత్రమే కాదు, మీ అసూయపడే సహోద్యోగులలో కొందరు ఈ రోజు మీ పనిని అభినందిస్తారు. మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చాలా రొమాంటిక్ మూడ్‌లో ఉంటారు. మీరు ఒకరితో ఒకరు ఉండటం చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులతో చాలా సరదాగా గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో ఎక్కువ లాభం పొందవచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు

English summary

Daily Horoscope March 28, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Saturday, March 28, 2020, 0:12 [IST]
Desktop Bottom Promotion