ఆదివారం మీ రాశిఫలాలు (29-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొంత మెరుగ్గా ఉంటుంది. మీరు ఊహించిన విధంగా డబ్బు మీకు అందుతుంది. అయితే, ఇలాంటి సమయంలో మీరు అప్పులు తీసుకోకుండా ఉండాలి. మరోవైపు మీ కుటుంబంలో శాంతిని నెలకొల్పడానికి, మీరు మీ దూకుడు స్వభావాన్ని నియంత్రించాలి. మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన మంచిది. పని విషయంలో ఈరోజు మీకు కొంత ఉపశమనం కలుగుతుంది. పెండింగులో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేస్తారు. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:05 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈ రోజు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఈరోజు చేసే పనిలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు ఈరోజు స్నేహితులతో గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ వివాహ జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరంగా ఎక్కువగా చింతించాల్సిన పనిలేదు. ఆర్థిక పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3:45 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు ఆదాయం వచ్చే ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో ఈరోజు కొంత ఇబ్బంది ఎదురుకావచ్చు. ముఖ్యంగా సహోద్యోగులకు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు కొత్తగా వివాహం చేసుకుంటే, మీ మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. మీకు ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు అన్ని పనులను వేగంగా పూర్తి చేయగలుగుతారు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు ఏవైనా కొత్త ఒప్పందాలను పొందవచ్చు. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు కొంత ఇబ్బంది ఉండవచ్చు. ఈరోజు మీరు వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు ఈరోజు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీరు ప్రేమగా వ్యవహరించడం మంచిది. ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి 6 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈ రోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఈరోజు మీ ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి ఒక ప్రత్యేక బహుమతిని పొందవచ్చు. అది పొందిన తర్వాత మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కూడా కార్యాలయంలో ఈరోజు ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేస్తారు. మీ ఆరోగ్యం కూడా చాలా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. విద్యార్థులకు ఈరోజు కష్టంగా ఉంటుంది. మీరు పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తుంటే, మీ నిరీక్షణ ఎక్కువసేపు ఉండొచ్చు. మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి. మీ జీవిత భాగస్వామితో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీరు పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవాలి. మొత్తానికి ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 7:45 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో వివాహితులలో ఈరోజు వారి జీవిత భాగస్వామికి ఒక సర్ ప్రైజ్ ఇవ్వవచ్చు. మీరు మీ వివాహ జీవితంలో మునుపటి ప్రేమను పొందే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగుల పని మరింత సులభమవుతుంది. మరోవైపు మీరు ఆరోగ్యంపై పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి 11:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీ ఖర్చులు తక్కువగా ఉంటాయి. మీ వైవాహిక జీవితంలో కొంత సమస్య ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మరియు మానసికంగా మీరు బలంగా ఉంటారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. మీ ప్రియమైన వారితో ఇంతవరకు ఉన్న దూరాన్ని మీరు తగ్గించుకోగలుగుతారు. ఈరోజు మీరు వైవాహిక జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. మీ జీవిత భాగస్వామి తన కఠినమైన వైఖరిని వదిలి, మిమ్మల్ని మరోసారి ప్రేమతో చూస్తాడు. ఆర్థిక పరంగా ఆదాయం పెరిగే బలమైన అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో పని భారం పెరిగితే, ఓపికగా చేయాలి. ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో మంచి ఫలితాన్ని పొందవచ్చు. వ్యాపారులకు ఈరోజు కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. అయితే పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క మంచి మానసిక స్థితి వల్ల ఈరోజు మీరు మరింత సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితంలో ఈరోజు సానుకూల శక్తి ఏర్పడుతుంది. మీరు మానసికంగా బలంగా ఉంటారు. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. మీ కార్యాలయ పనులన్నీ చాలా సులభంగా పూర్తవుతాయి. మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. అయితే మీ కుటుంబంలో కొంత ఆందోళనకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ బడ్జెట్ ను బట్టి మీరు ఖర్చులు చేస్తారు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి సాయంత్రం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనుల్లో చిక్కుకుపోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మరింత ఆందోళన పెరుగుతుంది. మీరు ఓపికగా ఉండాలి. ముఖ్యంగా సానుకూలంగా ఆలోచించాలి. పని విషయంలో ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మానసికంగా ఈరోజు మీరు బలహీనంగా ఉన్నట్టు భావిస్తారు. ప్రేమ విషయంలో ఈరోజు మీ ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా కూడా ఈరోజు ప్రతికూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

Story first published: Sunday, March 29, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion