For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోమవారం మీ రాశిఫలాలు (30-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు మంచి ప్రేమను పొందుతారు. ఈరోజు శృంగార జీవితంలో మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ ఆర్థిక వ్యవస్థ కొంత మెరుగుపడుతుంది. వ్యాపారులు ఈరోజు కొంత ఎక్కువ లాభం పొందవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు. మీరు శారీరకంగా బలంగా ఉంటారు. మీరు ఈరోజు చాలా పనులను వేగంగా పూర్తి చేయగలరు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 32

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి ఉదయం 11:25 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ రోజు మీ భాగస్వామితో కలవలేకపోయినప్పటికీ, మీరు మీ భాగస్వామితో ఇతర మార్గాల ద్వారా కనెక్ట్ అవుతారు. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మరోవైపు వ్యాపారులకు ఈరోజు భాగస్వాములతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు మీ కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి. ఈరోజు మీరు ఆరోగ్య విషయాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 8:45 నుండి మధ్యాహ్నం 2:20 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పని ఒత్తిడి కారణంగా మీ ఆరోగ్యం కొంత ప్రభావితమవుతుంది. మరోవైపు ఈరోజు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో మంచి సమయం గడిపిన తర్వాత మీరు సంతోషంగా ఉంటారు. అదే సమయంలో, పరస్పర ప్రేమ మరియు ఐక్యత అందరిలోనూ ఉంటుంది. ఈ రోజు మీరు మీ శత్రువులపై ఆధిపత్యం చెలాయించగలరు. ఈ రోజు వ్యాపారవేత్తలకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. వివాహితులకు ఈరోజు కొంత చిరాకుగా అనిపించవచ్చు

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 40

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా మీరు కొంత పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఆర్థిక విషయాల పట్ల మీరు నిర్లక్ష్యాన్ని వీడాలి. మరోవైపు ఈరోజు మీ కుటుంబసభ్యులతో శాంతంగా మాట్లాడాలి. ఇంకోవైపు ఈ రోజు పని భారం మీ ఒత్తిడిని పెంచుతుంది. మీరు మంచి ప్రణాళిక ప్రకారం మీ పనిలోని సమస్యను పరిష్కరించుకోవాలి. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండండి.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8:45 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఈరోజు మీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. అది మీపైనే కాకుండా మీ మొత్తం కుటుంబంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో మీరు వాదించకుండా ప్రశాంతంగా ఉంటే, మంచిది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. ప్రేమికులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ మధ్య విభేదాలు మీ సంబంధాన్ని బలహీనపడే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో కొన్ని మార్పులను చూడొచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న మీ కోరికలు ఈరోజు నెరవేరే అవకాశం ఉంది. ఈ రోజు మీ కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రోజు వ్యాపారులకు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఆరోగ్య పరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నా కూడా, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొంత మెరుగుదల ఉంటుంది. మీరు ఈరోజు కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ప్రత్యేక రోజు అవుతుంది. పని విషయంలో ఈరోజు తేలికగా ఉంటుంది. మీ యజమాని యొక్క మానసిక స్థితి కూడా బాగుంటుంది. బహుశా ఈ రోజు వారు మీ పని చూసి మరింత ఆకట్టుకుంటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబజీవితంలో అనుకూలత ఉంటుంది. బంధువులతో సంబంధం బాగుంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీరు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు మానసికంగా కొంత బాధపడవచ్చు. ఈరోజు చాలా ప్రతికూల ఆలోచనలు మీ మనసులోకి వస్తాయి. అయితే ప్రతి రోజు ఒకేలా ఉండదని మీరు గ్రహించాలి. ఈరోజు మీరు ఊహించిన విధంగాక ఫలితాలను పొందలేకపోతే, మీరు నిరాశ చెందకూడదు. మీ ప్రయత్నాలను కొనసాగిస్తే, మీకు విజయం దక్కవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని కష్టాలు ఎదురువుతాయి. మరోవైపు ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి ఉదయం 11 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు సకాలంలో పనులు జరగకపోతే, మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. అదే సమయంలో మీరు ఓపికగా పని చేయాల్సి ఉంటుంది. త్వరలో మీరు పరిస్థితిని మెరుగుపరుస్తారు. వ్యాపారవేత్తలు ఈరోజు ఎలాంటి కొత్త పనులు చేయకపోవడమే మంచింది. అలాగే ఆదాయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రుణాలు వంటివి తీసుకోకండి. అంతేకాకుండా మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా అప్రమత్తంగా ఉండాలి. అయితే మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఇది మీ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువ విశ్రాంతిపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచి ఫలితాలను పొందవచ్చు. పని విషయంలో కూడా ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ కటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

మీ కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి. మరోవైపు, ఈ రోజు జీవిత భాగస్వామికి మంచి మానసిక స్థితి ఉండదు. ఈ రోజు వారు చాలా మొరటుగా ప్రవర్తించవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు వారిని ప్రేమతో ఒప్పించడానికి ప్రయత్నించాలి. శృంగార జీవితంలో స్థిరత్వం ఉంటుంది. పరస్పర అవగాహన మంచిది. ఇది మీ ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : ఉదయం 7.30 నుండి ఉదయం 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో విజయం లభిస్తుంది. వ్యాపారులు కూడా ఈరోజు మంచి లాభాలను పొందవచ్చు. ఈరోజు మీ పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. మరోవైపు మీ ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు బాగా ఉంటుంది. ఆదాయానికి సంబంధించిన పనిని మీరు నిజాయితీగా పూర్తి చేస్తారు. మీ వైవాహిక జీవితంలో ఈరోజు ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకుంటారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతుంటే, ఈ రోజు మీరు వారి ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు. ప్రేమ విషయంలో ఈ రోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీరు మీ ఇంటి అలంకరణపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈ రోజు మీరు ఇంట్లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఈరోజు మీరు చాలా సరదాగా గడుపుతారు. ఈ రోజు మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు మరియు మీరు రిఫ్రెష్ అవుతారు. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈరోజు మీరు కుటుంబంతో మంచి రోజు ఆనందిస్తారు. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

English summary

Daily Horoscope March 30, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Desktop Bottom Promotion